Vaikuntha Ekadashi: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాలన్నీ.. భక్తిశ్రద్ధలతో ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరగడంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే శ్రీమహావిష్ణు దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల సందడి కనువిందు చేసింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, అర్చకుల ప్రత్యేక పూజల అనంతరం ఏకాదశి గడియలు ప్రవేశించిన తర్వాత శ్రీవారి వైకుంఠ ద్వారాలను తెరిచారు. ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకోవడం ద్వారా ముక్తి లభిస్తుందన్న నమ్మకంతో లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.
తిరుమలతో పాటు జూబ్లీహిల్స్‌లోని టీటీడీ ఆలయంలో కూడా.. వైకుంఠ ఏకాదశి శోభ అద్భుతంగా దర్శనమిచ్చింది. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించగా, ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు. భద్రాచలంలో శ్రీరాముడి ఉత్తర ద్వార దర్శనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గోదావరి తీర ప్రాంతమంతా భక్తి వాతావరణంతో పరవశించింది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈరోజు రాత్రి 10 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనానికి అవకాశం కల్పించారు.
ఇక అనంతపురం జిల్లా కదిరిలోని శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో.. ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజామునే శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఆలయానికి పోటెత్తారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 3:30 గంటలకు ఉత్తర గోపురం ద్వారా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి నామస్మరణలతో కదిరి పట్టణమంతా మారుమోగింది.
ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు కదిరికి తరలివచ్చారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దంపతులు పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. హిందూ ధార్మికతను చాటి చెప్పే విధంగా దేవస్థాన ప్రాధాన్యతను మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.
Also Read: తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి ఫ్యామిలీ
భక్తుల మనసులో ఎలాంటి కొరత లేకుండా సౌకర్యాలు కల్పించామని, వైకుంఠ ఏకాదశి పర్వదినం ప్రజలందరికీ శుభాన్ని చేకూర్చాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఆలయంలో చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తూ దేవస్థానం యాజమాన్యాన్ని అభినందించారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటున్న తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు pic.twitter.com/FC8XVU1XTp
— BIG TV Breaking News (@bigtvtelugu) December 30, 2025
భద్రాచలం రామయ్య ఉత్తర ద్వార దర్శనం pic.twitter.com/YEAIgujBlP
— BIG TV Breaking News (@bigtvtelugu) December 30, 2025
జూబ్లీహిల్స్ టీటీడీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి శోభ
తెల్లవారుజాము నుంచే ఆలయానికి పోటెత్తిన భక్తులు
ఇవాళ రాత్రి 10 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం
భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు
క్యూ లైన్లలో ఉన్న భక్తులకు మజ్జిగ, బాదంపాలు పంపిణీ pic.twitter.com/X9xcHVNOLR
— BIG TV Breaking News (@bigtvtelugu) December 30, 2025
నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో భక్తుల సందడి
తెల్లవారుజాము నుంచే శ్రీమహావిష్ణు దర్శనానికి ఆలయాలకు వెళ్తున్న భక్తులు
తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలివెళ్తున్న భక్తులు pic.twitter.com/fbND5k8b9B
— BIG TV Breaking News (@bigtvtelugu) December 30, 2025