Brahmamudi serial today Episode: చీకటి కోసం ఎదురుచూసే గుబ్లగూడలా ఆస్థి కోసం ఎదురుచూస్తున్నాను. నిన్ను నమ్ముకుని నాకు ఏంటి లాభం అంటూ నిలదీస్తుంది. దీంతో నేను కూడా అవకాశం కోసం చూస్తున్నాను. కాస్త ఓపిక పట్టండి. రేపు మీ మనవరాలి బారసాల టైం కి నేను వస్తున్నాను. బాంబు పేల్చబోతున్నాను అని చెప్తుంది అనామిక. ఏంటని రుద్రాణి అడగితే.. చెప్తే థ్రిల్ ఏం ఉంది ఆంటీ అంటుంది అనామిక. చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు అంటుంది రుద్రాణి.. రేపు కళ్లు అప్పగించి చూడండి చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.
అప్పు, కావ్య ఇద్దరూ కలిసి ఊయల రెడీ చేస్తుంటారు. ఇంతలో ఇదిరాదేవి వచ్చి నా గురించే మాట్లాడుకుంటున్నట్టు ఉన్నారు అని అడుగుతుంది. అవును అమ్మమ్మ మీ కోసమే ఊయల రెడీ చేస్తున్నాము అంటుంది కావ్య. ఆశ్చర్యంగా నా కోసమా అని అడుగుతుంది ఇందిరాదేవి. అవును అమ్మమ్మ స్వప్న చేతిలో ఉన్నది చిట్టి.. మీరు కూడా చిట్టే కదా..? అందుకే మీ కోసమే ఊయల రెడీ చేస్తున్నాము అంటుంది. దీంతో ఇందిరాదేవి వెళ్లి కావ్య చెవి పట్టుకుంటుంది. అమ్మమ్మ నొప్పిగా ఉంది అంటుంది కావ్య. మర్యాదగా తప్పైందని క్షమించమని అడుగు.
లేకపోతే వదిలిపెట్టను అంటుంది. మన పురాణాల ప్రకారం చూస్తే నేను నిజమే చెప్పాను అంటుంది కావ్య. మన పురాణాల ప్రకారమా…? అదెలాగా.. అని అడుగుతుంది. దీంతో కావ్య అవును అమ్మమ్మ గారు.. 60 ఏళ్ల వయసు దాటాక వాళ్లను కూడా చిన్న పిల్లలుగానే చూసుకోవాలని మన పురాణాలు చెప్పాయి కదా..? అంటుంది. దీంతో ఇందిరాదేవి ఈ మాటలకు తక్కువేం లేదు. మాటలే కాదు బామ్మ చూడండి మొత్తం డెకరేషన్ పూర్తి అయిపోయింది అంటుంది కావ్య. ఊయల ఇంకా రెడీనే కాలేదు అంటుంది ఇందిరాదేవి. అయిపోయింది అమ్మమ్మగారు జస్ట్ టూ మినిట్స్ అంటుంది. పై నుంచి అంతా గమనిస్తున్న రుద్రాణి కోపంగా చూశావా అక్క కూతురు అనగానే అన్ని మర్చిపోయి ఖర్చుకు వెనకాడకుండా చేస్తున్నారు అని చెప్తుంది. నేను అన్ని గమనిస్తున్నాను.. ప్రతి పైసా లెక్క అడుగుతాను అని ధాన్యలక్ష్మీ చెప్తూ.. అయినా ఫంక్షన్ నీ మనవరాలిదే కదా..? నువ్వేంటి అంటీ అంటనట్టు ఉంటున్నావు అంటుంది. నన్ను ఎక్కడ దగ్గరకు రానిస్తున్నారు. అంతా అక్కా చెల్లెల్లే చేసేస్తున్నారు అని వెటకారంగా చెప్తుంది.
రాహుల్ ఎవరితో ఫోన్ మాట్లాడుతుంటే.. రాజ్, కళ్యాణ్ వచ్చి.. నువ్వేంటి ఇంకా ఇలా ఉన్నావు ఇక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది అంటారు. ఏం ఫంక్షన్ జరుగుతుంది అంటాడు రాహుల్. దీంతో నీ కూతరు బారసాల జరగుతుంది. అది కూడా మర్చిపోయావా అంటాడు రాజ్. దీంతో రాహుల్ ఇరిటేటింగ్‌గా మీరు మాటిమాటికి కూతురు కూతురు అనకండి వినడానికి నాకు ఎదోలా ఉంది అంటాడు. దీంతో కళ్యాణ్ నువ్వింకా యంగ్ జనరేషన్ కిడ్ అనుకుంటున్నావా..? నువ్విప్పుడు ఓ పాపకు తండ్రివి.. అంటాడు. వెళ్లి రెడీ అవ్వు అని చెప్పగానే సరే అంటూ రాహుల్ లోపలికి వెళ్లిపోతాడు.
దుగ్గిరాల ఇంటికి ఫంక్షన్‌కు కనకం వస్తుంది. కనకాన్ని చూసి రుద్రాణి వెటకారంగా ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను మీరే వచ్చేశారు. మీకు నూరేళ్లు.. అంటుంది. కనకం మాత్రం అంత ఆయుష్సు ఏం చేసుకుంటాం లేండి.. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తాం. మీరు మాత్రం నిండు నూరేళ్లు ఈ ఇంట్లో పుండులా.. పుండు మీద చల్లే కారంలా బాగా బతకండి.. అంటూ రాహుల్ రాగానే ఏం బాబు బాగున్నావా అని అడుగుతంది. దీంతో రుద్రాణి ఇప్పటి దాకా బాగానే ఉన్నాడు. మీరు వచ్చారు కదా..? ఇంకేం బాగుంటాడు అంటుంది. దీంతో కనకం.. మీతో ఉన్నప్పుడే బాగున్నాడు అంటే మాతో ఇంకా బాగుంటారులే రుద్రాణి గారు. అనగానే రుద్రాణి షాక్ అవుతుంది. ఇది నాకే కౌంటర్ వేస్తుంది. దీని పరువు తీయాలి అని మనసులో అనుకుని బ్యాగులో ఏంటి ఎంత బంగారం తీసుకొచ్చావు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది.
తర్వాత కళ్యాణ్, అప్పు ఊయల దగ్గర రొమాంటిక్‌గా మాట్లాడుకుంటుంటే.. అపర్ణ, సుభాష్ వచ్చి ఆటపట్టిస్తారు. దీంతో అక్కడి నుంచి అప్పు, కళ్యాణ్ సిగ్గుతో వెళ్లిపోతారు. తర్వాత స్వప్న పాపను తీసుకుని ఊయల దగ్గరకు వస్తుంది. పాపను ఊయలలో వేయమని కనకం, ఇందిరాదేవికి చెప్తుంది. సరేనని ఇందిరాదేవి పాపను ఊయలలో వేస్తుంది. అందరూ కలిసి ఊయల ఊపండి అని ఇందిరాదేవి చెప్తుంది. అందరూ కలిసి ఊయల ఊపుతుంటే ఇంతలో అనామిక వస్తుంది. అనామికను చూసిన అందరూ షాక్ అవుతారు. రుద్రాణి మాత్రం హ్యాపీగా ఫీలవుతుంది.
కనకం కోపంగా అసలు నిన్ను ఎవరు పిలిచారు. మా వీధిలో పిలవని పేరంటాకి వచ్చేది ఇద్దరే ఒకటి నువ్వు .. రెండు వీధి కుక్కలు అంటుంది. ఒక నిజం బయటపెట్టాలని వచ్చాను అని చెప్తుంది అనామిక. ఇందిరాదేవి.. కోపంగా నువ్వు ఏం చెప్తున్నావో నాకు తెలియదు. కానీ మా సంతోషం దూరం చేయడానికి వస్తే.. బాగుండదు అంటుంది. అందరూ తలొ మాట మాట్లాడతారు. ఇంతలో రుద్రాణి ఎందుకు అందరూ అలా తిడుతున్నారు అంటూ అడ్డుపడుతుంది. అసలు ఎందుకు వచ్చిందో.. తెలుసుకుని పంపండి. అని చెప్పగానే.. ఇంకా ఈవిడతో మాటలేంటి అత్తా అని రాజ్ చెప్పగానే.. మీరు చేసిన తప్పుని బయటపెట్టేస్తానని భయంగా ఉందా రాజ్‌గారు అంటుంది అనామిక. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?