Gundeninda GudiGantalu Today episode February 10 th: నిన్నటి ఎపిసోడ్ లో… ప్రభావతికి మీనా ముందే డబ్బులు ఇస్తుంది రోహిణి. ఎందుకు రోహిణి అంటే మీకు పాకెట్ మనీ ఉంటుంది కదా అందుకే ఇస్తున్నాను అంటే మీకు ఏం కావాలన్నా మీరు తీసుకోవచ్చు అనేసి అంటుంది. దానికి పొంగిపోయిన ప్రభావతి మీనా ముందే తన ఇద్దరు కోడలు సంపాదించే వాళ్ళని హేళన చేస్తుంది. ఇక రోహిణి డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ బిస్కెట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని నేను చాలా అలసిపోయాను అంటి అనేసి అంటుంది అవునా అమ్మ నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో మీనా నీకు జ్యూస్ తీసుకొచ్చేస్తుంది అనేసి అంటుంది. ఇక రోహిణి నా బిస్కెట్ బాగానే పని చేసింది ఇక మీద ఇలానే చేస్తూ ఉంటే నా విలువ అనేది ఎక్కడా తగ్గదు అనేసి అనుకుంటుంది. మనోజ్ లోపలికి వచ్చి డబ్బులు కావాలని అడుగుతాడు ప్రభావతి నా దగ్గర డబ్బులు లేవు అనగానే రోహిణి ఇచ్చింది కదా అని అంటాడు ఇక ప్రభావతి చేసేదేమీ లేక మనోజ్ కి కాస్త డబ్బులు ఇస్తుంది. మీనా హడావిడిగా వచ్చి బాలుని పైకి రమ్మని తీసుకెళ్ళి పోతుంది. పైకెళ్లగానే తలుపు వేస్తుంది. చూశారా మన ముందరే పని తీసుకెళ్లి తలపు వేసింది అని ప్రభావతి అంటుంది. ఇక లోపలికి వెళ్ళిన మీనా బాలుని రోహిణి డబ్బులు ఇచ్చిన విషయం గురించి చెప్తుంది. బాలు మాత్రం తెలివిగా ఆ పార్లరమ్మ ఎదో చేస్తుంది నగలను తీసుకురమ్మని మా అమ్మ అంటుందని ముందు జాగ్రత్తగా ఇలా డబ్బులు ఇచ్చి పడేస్తుందేమో ఏదేమైనా నేను దీని బయటపెట్టి తీరుతాను అని బాలు అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రోహిణి ఇచ్చిన డబ్బుల గురించి బాలుకి మీనా చెబుతుంది. ఇక ఏమో అండి నాకు తెలీదు మనం కూడా ఇకమీదట నుంచి మీ అమ్మగారికి పాకెట్ మనీ ఇద్దామని అంటుంది. సరే నేను వెళ్లి స్నానం చేసి వస్తాను అని బాలు అంటాడు.. స్నానం చేసి వచ్చిన తర్వాత బాలు మీనా ఇద్దరు కలిసి అక్కడే భోజనం చేస్తారు.. బాలుని మీనాను ఇంట్లో నుండి పంపించాలని ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే పరిస్థితులను క్రియేట్ చేస్తుంది. అలా ప్రభావతి అర్ధరాత్రి సడన్ గా లేచి.. బాత్రూం వస్తుంది అని కుప్పిగంతులు వేస్తుంది. అయితే కింద బాత్రూం ఉంది కదా అక్కడికి వెళ్ళు అంటే అక్కడ బల్లులు గబ్బిలాలు సంసారం చేస్తూ ఉంటాయండి నేను వెళ్ళను అని అంటుంది నేను అంచుతాను కదా పదా అనేసి సత్యం ప్రభావతిని బాత్రూంకి తీసుకెళ్తాడు. ఇక తర్వాత మీనా ను బాలుని ఇంట్లోంచి పంపించేస్తే మనం ఇలాంటి బాధలు పడాల్సిన అవసరం లేదు కదా అనేసి ప్రభావతి అంటుంది. దానికి సత్యం ఆలోచిస్తాను అని అంటాడు.
ఇంట్లో బాలు, మీనా వల్ల రోజుకో గొడవ జరుగుతుందనీ, వారిని ఇంట్లో నుంచి పంపించాలని ప్రభావతి అంటుంది. దీంతో సత్యం కూడా వారిని ఇంట్లో నుంచి బయటకు పంపించడమే కరెక్ట్ అని భావిస్తాడు.. ఆ తర్వాత రోజు బాలు బయటకు వెళ్తుంటాడు. ప్రభావతి ఎక్కడికి అని ఆపుతుంది. అర్జెంటుగా ట్రిప్ వచ్చిందని, వెళ్లనివ్వమని అంటుంది. తాను అంతకంటే.. ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలని, నిన్ను, మీనా ను ఇంట్లో నుండి పంపించి, వేరు కాపురం పెట్టించాలి నిర్ణయించుకున్నాం. అంటూ అసలు విషయాన్ని బయటపడుతుంది ప్రభావతి..
అదేంటి బాలు, మీనాను బయటకు పంపడం ఏంటి అని రవి, శృతి ప్రభావతిని అడుగుతారు. వెళ్లి.. అమ్మ చెప్పింది నిజమేనా ? అని అడుగుతాడు. అవును మీ అమ్మ చెప్పేది నిజం. నీతో పడలేకపోతున్నా.. నువ్వు పెట్టే టార్చర్ భరించలేకపోతున్నాను. నిన్ను ప్రతిసారి సమర్ధించలేక అలసిపోయాను పెడతాడు సత్యం. మనుషులమే దూరంగా ఉంటాం.. ఒకరికొకరు కలిసే ఉంటాం. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోండి అంటూనే ఈ రోజే ఇల్లు మారాలి అని సత్యం. ఆ మాట వినగానే బాలు, మీనాలు షాక్ అవుతారు.. ఇంట్లోంచి మేము వెళ్తే నువ్వు ఉండలేము నాన్న అనేసి బాలు ఎమోషనల్ అవుతాడు ఇక మీనా కూడా నేను ఎన్ని పనులు చేసినా కూడా మీరు నన్ను తిట్టినా కూడా సర్దుకుపోతున్నాను అత్తయ్య మమ్మల్ని ఇంట్లోంచి ఎందుకు పంపించాలి అనుకుంటున్నారు అనేసి మీనా కూడా బాధపడుతుంది. మనోజ్ మాత్రం ఫుల్ ఖుషి అవుతుంటాడు. అయితే చివర్లో సత్యం ప్రభావతికి దిమ్మతిరిగే షాక్ ఇస్తాడు. వెళ్ళేది వాళ్ళు కాదు మనం అనేసి అంటాడు. మన మా ఎక్కడికెళ్తున్నామంటే మా అమ్మ దగ్గర నా శేష జీవితాన్ని గడపాలని వెళ్తున్నాను నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడే ఉండాలి కదా పద వెళ్దాం అనేసి అంటాడు. మనకి షాక్ అయిన ప్రభావతి మనం ఎక్కడికి వెళ్తామండి అక్కడికైతే నేను అసలు రాను అనేసి అంటుంది ఇక నువ్వు వేరే కాపురం పెట్టాలి అది ఇది నేను మాటలు మానేసి హాల్లో ఉంటానంటే చెప్పు ఇక్కడే ఉన్నాం లేదంటే మా అమ్మ దగ్గరికి వెళ్లి పోదాం అనేసి అంటాడు. దానికిగా చచ్చినట్టు ప్రభావతి కాంప్రమైజ్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మీనా పై బాలు అమితమైన ప్రేమను చూపిస్తాడు.. ఏం జరుగుతుందో చూడాలి…