E-Paper
Advertisement

Brahmamudi Serial Today February 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  శృతికి చిక్కిన నంద – రంగంలోకి దిగిన అప్పు

Brahmamudi Serial Today February 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  శృతికి చిక్కిన నంద – రంగంలోకి దిగిన అప్పు
Advertisement

Brahmamudi serial today Episode: స్టేషన్‌కు వచ్చిన కళ్యాణ్‌ను ఎందుకు వచ్చావని అడుగుతుంది అప్పు. క్యారియర్‌ తీసుకొచ్చానని చెప్తాడు. దీంతో నువ్వు క్యారియర్‌ తీసుకురావడం ఏంటని అడుగుతుంది. ఏందుకు నేను తీసుకురాకూడదా..?  భర్తలు, భార్యలకు క్యారియర్‌లు తీసుకురావడం చట్టరిత్యా నేరమా అని అడుగుతాడు. అలా అని కాదు కానీ నువ్వు క్యారియర్‌ పట్టుకుని వస్తే.. ఒక మగాడిగా నీకు ఇబ్బంది అనిపిస్తుందేమోనని అని అప్పు చెప్పగానే.. ఇందులో ఇబ్బంది ఏం ఉంది. ఒకవేశ నేనే పోలీస్‌ ఆఫీసర్‌ అయితే నువ్వు నాకు తెచ్చేదానివా కాదా..? అని అడుగుతాడు కళ్యాణ్‌. దీంతో బంగారంలా తీసుకొచ్చేదాన్ని అంటుంది అప్పు. నేను కూడా నా బంగారం కోసం తీసుకొచ్చాను అని చెప్తాడు. పక్కనే ఉన్న కానిస్టేబుల్ చాలా బాగా చెప్పారు సార్‌.. పురుషుల్లో పుణ్యపురుషులు వేరయా అన్నట్టు మీ లాంటి భర్త దొరకడం మేడం అదృష్టం సార్‌ అంటుంది. ఆ కానిస్టేబుల్‌ను అప్పు తిట్టి అక్కడి నుంచి పంపించివేస్తుంది.

స్టాల్‌ రెడీ చేసిన శృతి చాలా బాగా డిజైన్‌ చేశాను. మేడం చూస్తే నన్ను మెచ్చుకుంటుంది.. వెంటనే వీడియో తీసి మేడంకు పంపిచాలి అని స్టాల్‌ వీడియో తీస్తుంటే.. మధ్యలో వంద కోట్లు ఎగ్గొట్టిన నంద కెమెరాకు అడ్డు వస్తాడు. అతన్ని పకక్కు జరిపి వీడియో తీస్తుంది శృతి. వెంటనే కావ్యకు సెండ్‌ చేస్తుంది.

Advertisement

బట్టలు సర్దుతున్న ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్లి ప్రకాష్ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. కనబడటం లేదా అంటుంది ధాన్యలక్ష్మీ.. దీంతో డొంక తిరుగుతు సమాధానాలు చెప్పకు.. నాకు కోపం తెప్పించకు ఏదైనా ఉంటే స్ట్రైట్‌గా చెప్పు అనగానే ధాన్యలక్ష్మీ ఇరిటేటింగ్‌ గా ఇలాంటి వాటికైతే కోపాలు వచ్చేస్తాయి. రావాల్సిన టైంలో అయితే అసలే రావు అంటుంది. దేని గురించి మాట్లాడుతున్నావే అని ప్రకాష్‌ అడగ్గానే.. రావాల్సిన వాటా అడిగే హక్కు లేకుండా చేశారు. కనీసం బాధపడే హక్కు కూడా లేదా నాకు ఇక్కడ. ఎలాగూ రేపు ఉన్న ఆస్థి అతా ఆ బ్యాంకు వాళ్లకు కట్టేస్తారు.

ఆ తర్వాత వాళ్లు మనల్ని మెడపట్టి బయటకు గెంటేస్తారు అని చెప్పగానే.. ప్రకాష్‌ ఎక్కడికి వెళ్తావు అని అడుగుతాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఇక్కడకు వచ్చాక అసలు ఈ బ్రతుకు ఎక్కడకు వెళ్తుందో అర్తం కావడం లేదు. ఇంక రేపు బయటకు వెళ్తే.. ఎక్కడకు వెళ్లాలో తెలుస్తుంది అంటూ ధాన్యలక్ష్మీ ఎమోషనల్‌ అవుతుంది. దీంతో నీకు పిచ్చి ముదిరిపోయింది అంటూ ప్రకాష్‌ తిడతాడు. అసలు ఏమైందే నీకు అసలు ఎందుకు ఇంత దిగజారిపోయావు.. అక్కడ మా నాన్న చచ్చి బతికి వచ్చాడు. ఒక్క నువ్వు రుద్రాణి తప్పా అందరూ ఈ ఇల్లు బాగుండాలని కోరుకుంటున్నారు. పరిస్థితులు అర్థం చేసుకుని కష్టాలు వచ్చినప్పుడు కలిసి ఉండేదే కుటుంబం అంటే నువ్వు ఇంతలా దిగజారిపోయావు ఏంటి అంటూ తిడతాడు.

Advertisement

రాజ్‌తో మాట్లాడుతున్న కావ్యకు శృతి ఫోన్‌ చేసి మన స్టాల్‌ రెడీ అయింది. మీరు చూసి చెప్తే.. ఫైనల్ చేస్తాము అని చెప్తుంది. ఇప్పుడు వీడియో చూసేంత ఓపిక లేదని కావ్య చెప్తుంది. రాజ్‌ మాత్రం ఒకసారి చూసి చెప్తే వాళ్లు కూడా రిలాక్స్‌ అవుతారు అని చెప్పగానే.. కావ్య సరే చూస్తాను వీడియో సెండ్‌ చేయ్‌ అని చెప్తుంది. మీకు ఆల్‌రెడీ సెండ్‌ చేశాను మేడం అని చెప్తుంది. వెంటనే వీడియో చూస్తుంది కావ్య. అందులో నంద కనిపించడంతో షాక్‌ అవుతుంది. వెంటనే వీడియో రాజ్‌కు చూపిస్తుంది. నంద బతికే ఉన్నాడా..? అంటూ  రాజ్‌ షాక్‌ అవుతాడు. ఆరోజు మన కళ్ల ముందే ప్రాణాలు వదిలాడు కదండి అంటుంది కావ్య. కానీ వీడు ఎలా బతికాడో అర్థం కావడం లేదే అంటాడు రాజ్‌.

అసలు ఏం జరుగుతుంది. అంతా అయోమయంగా ఉంది అంటుంది కావ్య. ఇంతలో రాజ్‌ తన ఫ్రెండ్ విశ్వకు కాల్ చేస్తాను అనగానే వద్దని ఆరోజు నిజంగా నంద చనిపోయి ఉంటే పోస్ట్‌మార్టం జరిగేది రిపోర్ట్స్‌ వచ్చేది అలా రాలేదు అంటే అతను చనిపోలేదు అంటుంది కావ్య. దీంతో రాజ్‌ నా ఫ్రెండ్ నాకు అబద్దం చెప్పాడా..? అని అనుమానిస్తాడు. డబ్బు కోసం ఆశపడి నీ ఫ్రెండ్ ఇంకెవరితోనో చేతులు కదిపాడు అన్నమాట అంటుంది కావ్య. అవును ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు. వాళ్లెవరో కనిపెట్టాలి అంటాడు రాజ్‌.

రాజ్‌, కావ్య ఇద్దరూ కలిసి అప్పు దగ్గరకు వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. ఎస్సై గురించి చెప్పగానే.. ఆ బండోడు నీ ఫ్రెండ్‌ అని నాతో క్లోజ్‌గా మూవ్‌ అవ్వబోయాడు కానీ అదంతా బయట పెట్టుకోమని చెప్పాను. అంటూ కేసు టేకోవర్‌ చేస్తుంది. రెండు రోజుల్లో పట్టుకుంటానని చెప్తుంది. అంత టైం లేదని ఈరోజు బ్యాంకు వాళ్లు ఆస్తులు సీజ్‌ చేయబోతున్నారు. అది ఆపాలంటే ఆ నంద దొరకాలి అని రాజ్‌, కావ్య చెప్పగానే.. సరేనని ఎంక్వైరీ మొదలపెడుతుంది అప్పు. ఇంతలో విశ్వం, నందను కలవబోతున్నాడు అని తెలుసుకుని ఫాలో అవుతుంది.

మరోవైపు బ్యాంకువాళ్లు వచ్చి దుగ్గిరాల ఆస్తులను జప్తు చేస్తుంటారు. ధాన్యలక్ష్మీ, రుద్రాణి గోడవ చేస్తారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×