E-Paper
Advertisement

Brahmamudi Serial Today February 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్: నందను పట్టుకున్న అప్పు – ఆగిపోయిన ఆస్తుల జప్తు

Brahmamudi Serial Today February 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్: నందను పట్టుకున్న అప్పు – ఆగిపోయిన ఆస్తుల జప్తు
Advertisement

Brahmamudi serial today Episode:  విశ్వం, నందను కలవబోతున్నాడు అని తెలుసుకుని ఫాలో అవుతుంది. మరోవైపు బ్యాంకువాళ్లు వచ్చి దుగ్గిరాల ఆస్తులను జప్తు చేస్తుంటారు. ధాన్యలక్ష్మీ, రుద్రాణి గోడవ చేస్తారు. కావ్య బయటకు వచ్చి అప్పుకు ఫోన్ చేస్తుంది. ఏమైందని అడుగుతుంది. విశ్వాన్ని నేను ఫాలో అవుతున్నానని ఈరోజు ఆ నంద గాడు ఎక్కడ దాక్కున్నా పట్టుకుని నేను వాడితోనే వస్తాను అని చెప్తుంది. రాజ్‌ వచ్చి ఏం అంటుంది అప్పు అని అడుగుతాడు. ఆ విశ్వాన్ని ఫాలో అవుతుందట. నంద దొరుకుతాడట అని చెప్తుంది కావ్య. వాడు దొరకాలి.. ఎలాగైనా దీన్ని ఆపాలి. పాపం తాతయ్య నమ్మకంతో సంతకం పెడితే ఇలా జరిగిందని బాధపడుతున్నాడు అని ఎమోషనల్‌ అవుతాడు. ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్తారు.

సీతారామయ్య బాధగా ఇందిరను బాధపడుతున్నావా చిట్టి అని అడుగుతాడు. లేదు బావ ఇచ్చిన మాట కోసం సరస్వం వదులుకోవడానికి సిద్ద పడ్డ నిన్ను చూస్తుంటే.. గర్వంగా ఉంది. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటాను అంటుంది. చాలా మంది భార్యాభర్తలు ధాంపత్యం అంటే ఏంటో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అంటుంది అపర్ణ. ఇంతలో రుద్రాణి మెల్లగా రాహుల్‌ మన నగలు అన్ని భద్రంగా దాచావా అని అడుగుతుంది. రాహుల్‌ దాచానని వీళ్లేం ఇన్‌కం టాక్స్‌ ఆఫీసర్లు.. బ్యాంకు ఆఫీసర్లు ఇళ్లంతా ఏమీ చెక్‌ చేయరు అని చెప్తాడు.

Advertisement

ఇంతలో స్వప్న విని అత్తా అందరూ నగలు తెచ్చారు నువ్వు నీ నగలు తీసుకురావా..? అని అడుగుతుంది. నాకు నగలు ఎక్కడివి ఒక్క పుస్తెలతాడు ఉండేది అది కూడా వీళ్ల నాన్నా ఎప్పుడో తాకట్టు పెట్టేశాడు అంటుంది. దీంతో ధాన్యలక్ష్మీ ఎందుకు లేవు.. నీకు మామయ్యగారు చాలా నగలు చేయించారు అవన్నీ పట్టుకురాపో నా నగలు గురించి చెప్పావు కదా..? అందుకే చెల్లుకు చెల్లు అంటుంది. నా నగలు ఎందుకు ఇవ్వాలి. అసలు నేను దుగ్గిరాల ఇంటి ఆడపడచునే కాదు.

నాకు ఈ ఇంటికి అసలు సంబంధమే లేదు అంటుంది రుద్రాణి. దీంతో అపర్ణ కోపంగా కానీ చిన్నప్పటి నుంచి నువ్వు ఈ ఇంటిలోనే ఉన్నావు కదా..?  ఆస్థి పంపకాలు దాకా వచ్చేసరికి ఈ ఇంటి ఆడపడుచునంటూ పోట్లాడావు. నగలు ఇవ్వాల్సి వస్తే అసలు సంబంధమే లేదంటావా..? స్వప్నకు ఉన్న విశ్వాసం నీకు లేదు అంటుంది. వీళ్లకు విశ్వాసం ఎలా ఉంటుంది ఆంటీ.. అయినా రూంలో బెడ్‌ కింద దాచిన నగలు నేను తీసుకొస్తాను అంటూ పైకి వెళ్తుంది.

Advertisement

విశ్వంను ఫాలో చేసిన అప్పు నంద ఉన్న ఇంటిని కనిపెడుతుంది. విశ్వం లోపలికి వెళ్లగానే.. నంద తాగుతుంటాడు. సూపర్‌ నంద నువ్వు సూపర్‌ అంటూ లోపలికి వెళ్తాడు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. అప్పుడే కిటికీ దగ్గరకు వెళ్లిన అప్పు.. కానిస్టేబుల్ చేత వీడియో తీయిస్తుంది. ఇంతలో నంద డబ్బులు తీసి ఎస్సైకి ఇస్తాడు. ఆ డబ్బులు లెక్కపెడుతుంటే.. అప్పు వెళ్లి హాండ్సప్‌ చెప్తుంది. కదిలితే కాల్చి పారేస్తా అంటుంది. కానిస్టేబుల్స్ వచ్చి నందను పట్టుకుంటారు. అప్పు కోపంగా నందను కొట్టి పారిపోవాలని చూస్తే.. కాల్చిపారేస్తానని వార్నింగ్‌ ఇస్తుంది. విశ్వంకు వార్నింగ్‌ ఇస్తుంది.

ఇంట్లో ఆస్తులు జప్తు చేస్తు్న్న ఆఫీసర్లను మీకు ఈ లెక్కలు సరిపోయాయా..? అని అడుగుతాడు సీతారామయ్య. సరిపోయాయని ఆఫీసర్లు చెప్తారు. అలాగే మీరు ఈరోజే ఇల్లు ఖాళీ చేయాలని చెప్తారు. దీంతో రుద్రాణి బాధపడుతుంది. ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టు ఆస్థిలో వాటా కోసం అందరితో పోరాటం చేస్తే చివరికి ఉన్నదాంట్లో కూడా ఊడ్చుకుపోతున్నారు. దేవుడు నాలాంటి దానికే ఎందుకు పరీక్ష పెడతాడో నాకు అర్థమే కావడం లేదు అంటుంది. పేపర్స్‌ మీద సంతకం పెట్టమని సీతారామయ్యకు ఇస్తాడు ఆఫీసర్‌. సీతారామయ్య ఆ పేపర్స్‌ మీద సంతకం చేయబోతుంటే.. నందను తీసుకుని వస్తుంది అప్పు. నందను చూసిన రాజ్‌, కావ్య ఆశ్చర్యపోతారు.

అందరూ ఏమీ అర్తం కాక చూస్తుంటారు. అప్పు లోపలికి వచ్చి తాతయ్యగారు మీరు ఇంక సంతకం చేయాల్సిన పని లేదు.  ఆస్థులు బ్యాంకు వాళ్లకు స్వాధీనం చేయాల్సిన అవసరం లేదు. ఏంటలా చూస్తు్న్నారు. మీ బ్యాంకుకు వంద కోట్టు ఎగ్గొట్టిన నంద వీడే. వీళ్ల తాతయ్యకే మా తాతయ్య షూరిటీ ఇచ్చింది. ఇన్ని రోజులు చనిపోయినట్టు నాటకం ఆడి మా డిపార్ట్‌మెంట్‌ను మా కంపెనీని మోసం చేసింది వీడే. వీడి ఆస్థులు ఎక్కడికీ పోలేదు. మా ఆస్థులు మాకు అప్పజెప్పి మీరు వెళ్లండి అని అప్పు చెప్పగానే.. రుద్రాణి అంటే నా నగలు ఎక్కడికీ పోలేదు కదా..? ధాన్యలక్ష్మీ నా నగలు నాకు మిగిలాయి.. మన ఆస్థి ఎక్కడికి పోలేదు అంటుంది. బ్యాంకర్లు సీతారామయ్యకు సారీ చెప్పి వెళ్లిపోతారు. తర్వాత అందరూ హ్యాపీగా ఉంటారు. ఇంతలో అప్పు ఇంకో విషయం వీళ్లిద్దరి వెనక సామంత్‌, అనామిక ఉన్నారు అని చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. అనామికను అందరూ తిడతారు. ఈసారి మాత్రం వాళ్లను వదిలిపెట్టేది లేదు అంటూ రాజ్‌ ఆవేశంగా వెళ్లిపోతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన.. బిగ్ బాస్ కోసమే వచ్చి దొరికిపోయారా?

బీబీ కొంపలో బెట్టింగ్ మాఫియా.. మరోసారి నాగార్జున పై రెచ్చిపోయిన నా అన్వేష్!

ఏం తప్పు చేశాను.. రాబందులలా పొడుచుకు తింటున్నారు..రాజకుమారి ఎమోషనల్!

బిగ్ బాస్ 10.. ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ కి సపోర్టుగా హైపర్ ఆది!

ఆరోజు జరిగిందిందే.. నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి అసిస్టెంట్!

మొదలైన వార్.. కృష్ణుడు ఫైర్!

Podarillu Serial : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారక్టర్ అవుట్..

Nindu Noorella Saavasam Serial Today EpisodeSeptember 8th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ శక్తులు హరించేందుకు వెళ్లిన ప్రచండ

Big Stories

Advertisement
×