Jama movie : ఓటిటి ప్లాట్ ఫామ్ ఎంటర్టైన్మెంట్ కి ఒక వేదికగా మారింది. ఒకప్పుడు నాటకాలతో ప్రజల్ని ఎంటర్టైన్ చేసేవాళ్ళు. ఆ తర్వాత టెక్నాలజీ పుణ్యమా అని ప్రతి ఒక్కరు సెల్ఫోన్ లోనే ఎంటర్టైన్మెంట్ ని ఆనందిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో హీరో ఒక నాటకాల గుంపులో ఆడ వేశాలు వేస్తూ ఉంటాడు. ఇతడు తన గురువు కూతుర్ని లవ్ చేస్తూ ఉంటాడు. వీళ్లిద్దరి మధ్య స్టొరీ నడుస్తూ ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ తమిళ్ మూవీ పేరు ‘జమా’ (Jama). 2024లో విడుదలైన ఈ తమిళ భాషా నాటక మూవీకి పరి ఇళవళగన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో తాను, అమ్ము అభిరామి, చేతన్, శ్రీ కృష్ణ దయాళ్, KVN మణిమేగలై, వసంత్ మరిముత్తు, శివ మారన్, A. K. ఎలవళగన్, కాల కుమార్ నటించారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
వివరాల్లోకి వెళితే
కళ్యాణ్ ఒక నాటకాల గ్రూపులో క్యారెక్టర్లు వేస్తూ ఉంటాడు. ఒకప్పుడు ఇతని తండ్రి కూడా నాటికలు వేస్తూ ఉండేవాడు. అయితే ఇతని తండ్రి టీం కి లీడర్ గా ఉండేవాడు. ప్రస్తుతం కళ్యాణ్ ఒక క్యారెక్టర్ మాత్రమే వేయగలిగే పొజిషన్లో ఉంటాడు. ఎప్పటికైనా తన తండ్రిలా ఒక టీం ని మెయింటైన్ చేస్తూ, నాటకాలు వేయాలని అనుకుంటూ ఉంటాడు కళ్యాణ్. తన గురువు తాండవం కూతుర్ని ప్రేమిస్తూ ఉంటాడు కళ్యాణ్. తను కూడా కళ్యాణ్ ను ప్రేమిస్తూ ఉంటుంది. తన చదువు కోసం హెల్ప్ చేస్తూ ఉంటాడు కళ్యాణ్. నిజానికి కళ్యాణ్ కి ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటారు. నాటకాలలో కళ్యాణ్ కి ఆడవేషం మాత్రమే ఇచ్చే వాళ్ళు. పెళ్లి చూపుల్లో వంటలు, చీరాల గురించి మాట్లాడటంతో అతన్ని తేడా అనుకుని పెళ్లిళ్లు క్యాన్సిల్ చేస్తారు. ఇకపై ఆడ వేశాలు వేయకూడదని కళ్యాణ్ నిర్ణయించుకుంటాడు. తన స్నేహితుడి సలహా మేరకు అర్జునుడి క్యారెక్టర్ ఇవ్వమని గురువుని అడుగుతాడు కళ్యాణ్.
అందుకు గురువు ఒప్పుకోకపోగా, తిట్టడం మొదలు పెడతాడు. అర్జునుడి క్యారెక్టర్ వేసేందుకు తానే ఒక నాటకాల టీం ని ఏర్పాటు చేయాలనుకుంటాడు. అందుకు తన దగ్గర డబ్బులు కూడా ఉండవు. అయితే ఆ క్యారెక్టర్ దేవుడు పూనితేనే వేయాల్సి ఉంటుంది. ఆక్కడ ఒకరికి మాత్రమే దేవుడు వస్తాడు. చివరికి దేవుడు కళ్యాణ్ ను పూనుతాడా? కళ్యాణ్ నాటకాల గ్రూప్ కి లీడర్ అవుతాడా? ప్రియురాలిని దక్కించుకుంటాడా? తన గురువుగారి మెప్పు పొందుతాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘జమా’ (Jama) అనే ఈ తమిళ్ మూవీని మిస్ కాకుండా చూడండి.