E-Paper
Advertisement

Brahmamudi Serial Today February 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కిడ్నాపర్ల లొకేషన్‌ తెలుసుకున్న రాజ్‌, కావ్య

Brahmamudi Serial Today February 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కిడ్నాపర్ల లొకేషన్‌ తెలుసుకున్న రాజ్‌, కావ్య
Advertisement

Brahmamudi serial today Episode: 

రాహుల్‌, రేఖ, రుద్రాణి హ్యాపీగా ఫీలవుతుంటారు. తాము అనుకున్నది అనుకున్నట్టు ఇప్పుడు జరుగుతుందని అనుకుంటారు. అప్పూ, కళ్యాణ్‌ల కిడ్నాప్‌తో  ట్రస్ట్ పెట్టాలన్న ఆలోచన ఆగిపోయిందని. రాజ్- కావ్యల మీద ఈ కిడ్నాప్ నింద పడిందని హ్యాపీగా చెప్తుంది రేఖ. ఇప్పుడు రాజ్ – కావ్యలు కళ్యాణ్ – అప్పూల్ని వెతికి తీసుకురాలేరని అంటాడు రాహుల్. మనం అనుకున్నది అనుకున్నట్లుగానే జరిగింది. ఇకపై జరుగుతూనే ఉంటుంది, మీరు చేయాల్సింది చాలా ఉంది.. నేను కూడా ఆ మినిస్టర్ ద్వారా తిరిగి ఆ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నాను.. ఈ లోపు ఆ ఇంటి మనుషుల్ని మీ మాటలు, చేతలతో దీనావస్థలోకి నెట్టాలని రాహుల్‌, రేఖలకు చెప్తుంది రుద్రాణి. దీంతో ముగ్గురు హ్యాపీగా ఉంటారు.

తర్వాత స్వప్న వాళ్ల పాపకు ఫీవర్‌ రావడంతో కంగారు పడుతుంది. వెంటనే డాక్టర్‌కు ఫోన్‌ చేస్తుంది. డాక్టర్‌ హాస్పిటల్‌కు తీసుకురమ్మని చెప్పగానే.. స్వప్న రాహుల్‌కు ఫోన్‌ చేస్తుంది. రాహుల్‌ పాపకు చాలా ఫీవర్‌ ఉంది ఇంట్లో ఉన్న సిరప్‌లు వేసినా తగ్గడం లేదు డాక్టర్‌కు కాల్‌ చేస్తే హాస్పిటల్‌కు తీసుకురమ్మని చెప్పింది. నువ్వు త్వరగా వస్తే.. హాస్పిటల్‌కు వెళ్దాం.. అని చెప్పగానే.. రాహుల్‌ ఇరిటేటింగ్‌ గా ఫీలవుతూ.. అదేమీ స్వప్నకు వినిపించకుండా… స్వప్న నాకు ఆఫీసులో అర్జెంట్‌ వర్క్‌ ఉంది. రేపు మార్నింగ్‌ వరకు ఫైల్‌ సబ్మిట్‌ చేయాలి.. నువ్వు ఇప్పుడు పాపను తీసుకుని వెళ్లు వర్క్‌ అయిపోగానే నేను డైరెక్టుగా హాస్పిటల్‌కు వస్తాను అని చెప్పగానే.. సరే రాహుల్‌ అంటూ స్వప్న కాల్‌ కట్‌ చేస్తుంది. స్వప్నను రిక్వెస్ట్‌ చేసిన రాహుల్‌ను చూసి రుద్రాణి కోప్పడుతుంది. దానిని అంతలా బతిమాలుతున్నావేంట్రా అంటుంది. దీంతో రాహుల్‌ మంచివాడిగా నటించడం మహాకష్టం మామ్‌ అంటాడు రాహుల్. మన ప్లాన్ సక్సెస్ అయితే ఎవ్వరి ముందు తలవంచాల్సిన అవసరం ఉండదిక అని చెప్తుంది రుద్రాణి.

Advertisement

అప్పూ- కళ్యాణ్‌లను కిడ్నాప్ చేసిన వీడియోను షేర్ చేసిన నెంబర్‌ను పంపమని పోలీసులు రాజ్‌ని అడుగుతారు. సరేనని రాజ్ వీడియో షేర్‌ చేస్తుంటే.. అప్పుడే స్వప్న, కావ్యకు ఫోన్‌ చేసి జరిగింది చెప్పి పాపని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నానని చెప్తుంది. రాజ్‌, కావ్య హాస్పిటల్‌కు వస్తామని చెప్పడంతో స్వప్న హాస్పిటల్‌కు బయలుదేరుతుంది. హాల్లో ఎదురుగా వచ్చిన సుభాష్‌, స్వప్నకు తోడుగా హాస్పిటల్‌కు వెళ్తాడు.

హాస్పిటల్‌లో పాపను డాక్టర్లు టెస్ట్‌ చేస్తుంటారు. స్వప్న టెన్షన్‌ పడుతుంది. కావ్య ఓదారుస్తుంది. దీంతో స్వప్న బాధగా నువ్వు రాజ్ ఇంట్లో ఉండుంటే నేనింత కంగారు పడేదానిని కాదు.. కానీ కాసేపు పాపని అలా చూసి నా గుండె ఆగినంత పని అయ్యింది కావ్య అంటుంది. దీంతో కావ్య చిన్నత్తయ్య తన అనుమానంలో తనుంది.. కళ్యాణ్, అప్పూల విషయంలో భయపడుతోంది, అప్పూ, కళ్యాణ్‌లను వెతికి తీసుకురాకపోతే ఆమెను ఆపలేము అంటుంది. దీంతో సుభాష్ కోపంగా ఆ ధాన్యలక్ష్మీ అమాయకురాలో, మూర్ఖురాలో అర్ధం కావడం లేదు.. అప్పూ, కళ్యాణ్‌లను మీరే కిడ్నాప్ చేశారని నింద వేసింది అంటూ తిడుతుంటాడు.

Advertisement

కావ్య మాత్రం ఎందుకులేండి మామయ్య గారు అందరికీ అన్నీ అర్ధమవుతాయి.. అంటుంది. దీంతో సుభాష్‌ మరింత కోపంగా అది కాదు కావ్య.. మీరు రేవతి ఇంటికి వెళ్లకుండా ఉండాల్సింది.. మీరు అక్కడ సంతోషంగా ఉన్నారట, అప్పూ- కళ్యాణ్‌ల కోసం ఏ ప్రయత్నం చేయడం లేదని ఏదేదో మాట్లాడుతోంది ఆ ధాన్యలక్ష్మీ అంటూ కోప్పడతాడు. దీంతో రాజ్‌ కూల్‌గా కొడుకు, కోడలు  కనిపించలేదన్న బాధలో పిన్ని అలా మాట్లాడుతోంది, ఎంత కష్టమైనా కళ్యాణ్, అప్పూలను వెతికి తీసుకొస్తాం డాడ్‌.. మాకు పోలీస్ డిపార్ట్‌మెంట్ మొత్తం హెల్ప్ చేస్తుంది. అని చెప్తుండగానే.. డాక్టర్‌ వచ్చి పాపకు ఏం కాలేదని చెప్పడంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు.

అప్పు, కళ్యాణ్‌ను దాచిన లోకేషన్‌ ట్రేస్‌ చేశామని పోలీసులు రాజ్‌కు కాల్‌ చేసి చెప్తారు. దీంతో రాజ్‌ సార్‌ ఆ లోకేషన్‌ నాకు షేర్‌ చేస్తారా..? అని అడగ్గానే.. పోలీస్‌ చేస్తాను అని చెప్పి కాల్‌ కట్‌ చేస్తాడు. లోకేషన్‌ షేర్‌ చేయగానే.. కావ్య, రాజ్‌ అక్కడికి వెళ్తారు. ఎస్సై కూడా వస్తాడు. లోకేషన్‌ మొత్తం వెతుకుదామని తిరుగుతుంటారు. ఇంతలో కావ్యకు కిడ్నాపర్లు వాడిన ఫోన్‌ దొరుకుతుంది.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×