E-Paper
Advertisement

Agniveer Notification: భారత సైన్యంలో కొలువుల జాతర.. 25వేల అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Agniveer Notification: భారత సైన్యంలో కొలువుల జాతర.. 25వేల అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
Advertisement

దేశసేవ చేయాలనే తపన ఉన్న యువతకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ జనరల్ డ్యూటీ (GD), టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్స్‌మన్ వంటి వివిధ విభాగాల్లో భారీ స్థాయిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈసారి సుమారు 25,000 పైగా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సమాచారం. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

విభాగాలు, విద్యార్హతలు ఇవే

Advertisement

ఈ నోటిఫికేషన్ ద్వారా కేవలం యుద్ధ విభాగాలు మాత్రమే కాకుండా, సాంకేతిక మరియు వైద్య విభాగాల్లో కూడా నియామకాలు చేపట్టనున్నారు. వీటిలో ప్రధానంగా:

అగ్నివీర్ జనరల్ డ్యూటీ (GD): దీనికి పదో తరగతిలో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

Advertisement

టెక్నికల్ విభాగం: ఇంటర్మీడియట్ (MPC) చదివిన అభ్యర్థులు దీనికి అర్హులు.

క్లర్క్ / స్టోర్ కీపర్: ఇంటర్మీడియట్‌లో ఏ గ్రూపు వారైనా 60 శాతం మార్కులతో అప్లై చేసుకోవచ్చు.

ట్రేడ్స్‌మన్: కేవలం ఎనిమిదో తరగతి లేదా పదో తరగతి పాసైన వారు ఈ పోస్టులకు పోటీ పడవచ్చు.

సోల్జర్ ఫార్మా & నర్సింగ్ అసిస్టెంట్: సైన్స్ విభాగంలో ఇంటర్ లేదా సంబంధిత డిగ్రీ ఉన్న వారికి ఇవి చక్కని అవకాశం.

వయోపరిమితి, దరఖాస్తు ప్రక్రియ

అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 17½ ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, కొన్ని ప్రత్యేక కేటగిరీలకు (నర్సింగ్ అసిస్టెంట్ వంటివి) గరిష్ట వయోపరిమితి 25 ఏళ్ల వరకు సడలించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 1వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.

ఎంపిక విధానం

ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CEE) నిర్వహిస్తారు. ఈ పరీక్షలు జూన్ 1 నుంచి జూన్ 15 వరకు దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో జరుగుతాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి రెండో దశలో శారీరక దారుఢ్య పరీక్షలు (Physical Fitness Test), వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. తుది ఎంపిక జాబితాలో నిలిచిన వారికి శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకుంటారు.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 1

ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణ: జూన్ 1 – జూన్ 15

అధికారిక వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in/

యవత ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకుని సైన్యంలో చేరడం ద్వారా దేశ గౌరవాన్ని కాపాడాలని రిక్రూట్‌మెంట్ అధికారులు కోరుతున్నారు.

ALSO READ: Budget Gaming Phones: 2026 బడ్జెట్ గేమింగ్ ఫోన్స్.. పవర్‌ఫుల్ మొబైల్ గేమింగ్ కోసం బెస్ట్ ఇవే

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×