E-Paper
Advertisement

Brahmamudi Serial Today February 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  రాజ్‌ కు శాపంగా మారిన కావ్య నిజాయితీ – అప్పును మోటివేట్‌ చేసిన కళ్యాణ్‌

Brahmamudi Serial Today February 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  రాజ్‌ కు శాపంగా మారిన కావ్య నిజాయితీ – అప్పును మోటివేట్‌ చేసిన కళ్యాణ్‌
Advertisement

Brahmamudi serial today Episode:  ఇంట్లో అందరూ బాధపడుతూ కూర్చుని ఉంటారు. ఇంతలో అప్పు ఇంటికి వస్తుంది. అప్పును చూసిన ధాన్యలక్ష్మీ, రుద్రాణి  కోపంగా తిడతారు. ఈ ఇంటికి నిన్ను రప్పించడానికి మా రాజ్‌ ఎంతో కష్టపడ్డాడు.. అలాంటిది మా రాజ్‌నే అరెస్ట్‌ చేశావు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వచ్చావు. ఏ తప్పు చేయని రాజ్‌ను అరెస్ట్‌ చేస్తావా..? ఇందుకేనా నా కొడుకు నిన్ను పోలీస్‌ ను చేసింది అంటుంది ధాన్యలక్ష్మీ. సొంత బావనే అరెస్ట్‌ చేశావు దాంతో ఏ మెడల్‌ సాధించావు.. ఆ అనామికతో ఎంత తీసుకున్నావు అని అడుగుతుంది రుద్రాణి. దీంతో అప్పు కోసంగా రుద్రాణిని తిడుతుంది. మా బావను అరెస్ట్‌ చేయాల్సి వచ్చినందుకు నేను ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు అంటుంది.

ఇంతలో కళ్యాణ్‌ ఇద్దరినీ తిడతాడు. అప్పు పరిస్థితుల్లో ఎవరున్నా ఇలాగే చేసేవారు. అప్పు మన ఇంట్లో ఉంది కాబట్టి నీకు ఇంత కోపం వస్తుంది. తన తప్పేం లేదమ్మా.. తను రూల్స్‌ పాటించకపోతే ఉద్యోగానికి అన్యాయం చేసినట్టు అవుతుంది అని చెప్తాడు. అప్పర్ణ ఏడుస్తుంటే.. సుభాష్ ఓదారుస్తాడు. ఊరుకో అపర్ణ రాజ్‌ ఏ తప్పు చేయలేదు. చట్టం కానీ న్యాయ స్థానం కానీ నిర్ధోషికి శిక్ష వేయదు. నువ్వేం బాధపడకు అపర్ణ అని చెప్తుండగానే.. కావ్య ఆయనకు ఏం కాదు దీని వెనక ఎవరున్నారో కనిపెడదాం. ఆయన్ని నిర్దోషిగా బయటకు తీసుకొద్దాం. నా చెల్లెలు చట్టానికి లోబడి తన డ్యూటి తను చేసింది. తనను ఎవరూ తప్పు పట్టకండి కవిగారు అప్పును లోపలికి తీసుకెళ్లండి అని చెప్తుంది.

Advertisement

లోపలికి వెళ్లిన అప్పు ఏడుస్తూ తనలో తాను బాధపడుతూ ఇందుకేనా నువ్వు పోలీస్ అయింది. నా వాళ్లనే నేను శిక్షించుకుంటున్నానా.. అనుకుంటుంది. ఇంతలో కళ్యాణ్‌ వచ్చి అప్పు.. ఎందుకు ఏడుస్తున్నావు. ఇప్పుడేమైందని బాధపడుతున్నావు అంటూ ఓదారుస్తాడు. దీంతో అప్పు ఏడుస్తూనే.. నా వల్ల కావడం లేదు కూచి నేను పెద్ద తప్పు చేశాను. నాకు గిల్టీగా ఉంది అంటూ ఏడుస్తుంది. దీంతో ఒక పోలీస్‌గా ధైర్యంగా ఉండాల్సిన నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా చెప్పు అంటూ ప్రశ్నిస్తాడు. సొంత బావగారినే అరెస్ట్‌ చేసి ఎలా ధైర్యంగా ఉండగలను.. ఇలాంటి రోజు వస్తుందని తెలిస్తే అసలు నేను పోలీస్‌ అయ్యేదాన్నే కాదు అంటుంది.

దీంతో కళ్యాణ్‌ పోలీస్‌ అవ్వాలనేది నీ గోల్‌ ఇదంతా ఎందుకు అలోచిస్తున్నావు అంటాడు. నా గోల్‌ నా సొంత వాళ్లనే బాధపెడుతుందంటే నాకు పోలీస్‌ జాబే వద్దు అంటుంది. దీంతో కళ్యాణ్‌ ఇలా కుంగిపోవడానికి నువ్వు పోలీస్‌ అయింది. భవిష్యత్తులో ఇంకా చాలా జరగొచ్చు అన్ని తట్టుకుని నిలబడాలి అంటూ చెప్పినా అప్పు నాకు భయంగా ఉంది. మన వాళ్ల మాటలు వింటుంటే చాలా భయంగా ఉంది అని చెప్పగానే. కళ్యాణ్‌ నువ్వేం తప్పు చేయలేదు. అన్నయ్యను అరెస్ట్‌ చేసిన ఈ చేతలతోనే అన్నయ్యను బయటకు తీసుకురావడం గురించి ఆలోచించు అప్పుడు అందరూ నిన్ను మెచ్చుకుంటారు. అని చెప్పగానే అప్పు కూల్‌ అవుతుంది.

Advertisement

రాజ్‌ను పోలీసులు కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. లాయర్‌ వచ్చి రాజ్‌, సామంత్‌ను హత్య చేశాడని డెడ్‌ బాడీని మాయం చేయడానికి తన కారులో తీసుకుని వెళ్లాడని ఇంతలో పోలీసులు పసిగట్టి పట్టుకున్నారని చెప్తాడు. ఇంతలో రాజ్‌ తరపున ఉన్న లాయర్‌ రాజ్‌ ఈ హత్య చేయలేదని ఫ్యాక్టరీని తగుబెట్టేందుకు కొంతమంది ప్రయత్నిస్తుంటే వెళ్లి వాళ్లను కొట్టగానే వాళ్లు పారిపోయారు. ఎవరో కావాలనే సామంత్‌ను హత్య చేసి బాడీని తీసుకొచ్చి రాజ్‌ కారులో పెట్టారని చెప్తాడు. దీంతో పబ్లిక్‌ లాయర్‌ ఇదంతా కట్టుకథ రాజ్‌ గురించి తెలియాలంటే ఆయన భార్యను ప్రశ్నించాలని అడుగుతాడు. జడ్జి కావ్యను పిలవగానే.. కావ్య వస్తుంది. లాయర్‌ వచ్చి సామంత్‌ ఇంట్లో రాజ్‌, సామంత్‌ను చంపేస్తానని వార్నింగ్‌ ఇచ్చాడా అని అడుగుతాడు. ఇచ్చాడని కానీ అది ఆవేశంలో అన్న మాటలని చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

Big Stories

Advertisement
×