E-Paper
Advertisement

Birthday Party: బర్త్ డే పార్టీలో దారుణం.. మైనర్‌పై బాయ్ ఫ్రెండ్ రేప్

Birthday Party: బర్త్ డే పార్టీలో దారుణం..  మైనర్‌పై బాయ్ ఫ్రెండ్ రేప్
Advertisement

Birthday Party: కామాంధులు రెచ్చిపోతున్నారు. అన్నెం పుణ్యం ఎరుగని చిన్నారులపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. తాజాగా బర్త్ డే పార్టీకి పిలిచి మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు బాయ్‌ఫ్రెండ్. చివరకు యువతి గర్భవతి అయ్యింది. ఇంతకీ ఈ కేసు ఎక్కడో తెలుసా? ఒక్కసారి ఈ స్టోరీలోకి వెళ్లొద్దాం.

పార్టీ పేరిట ఆ కామాంధుడు

Advertisement

మహారాష్ట్రలో దారుణ ఘటన బయటకు వచ్చింది. పాల్ఘఢ్​ జిల్లాలో జనవరి రెండున సాయంత్రం తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఉందని చెప్పిన 16 ఏళ్ల బాలికను తీసుకెళ్లాడు ఆమె బాయ్‌ఫ్రెండ్. పార్టీ అంతా బాగానే జరిగింది. యువకులంతా రకరకాలు మాటలు ఆడుకున్నారు.

ఆ పార్టీలో మత్తు మందు కలిపిన కేక్, డ్రింక్స్ ఆ యువతికి ఇచ్చాడు. ఆమె స్పృహలో లేని సమయంలో అత్యాచారానికి ఒడిగట్టాడు.తన స్నేహితుడి ఇంటి పడక గదిలో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.చివరికి, ఆమె గర్భం దాల్చడంతో అసలు విషయం బయటపడింది. పార్టీ తర్వాత యథాతధంగా ఎవరికి ఇంటికి వారు వెళ్లిపోయాడు.

Advertisement

కాకపోతే యువతిలో రోజురోజుకూ వస్తున్న మార్పులను పేరెంట్స్ గమనించారు. చివరకు డాక్టర్ వద్దకు యువతిని పేరెంట్స్ తీసుకెళ్లారు. యువతిని పరీక్షించిన డాక్టర్లు గర్బం దాల్చిందని తేల్చారు. ఈ విషయం విని షాకయ్యారు పేరెంట్స్. ఎలా జరిగిందని పేరెంట్స్ యువతిని అడగడంతో మొత్తం చెప్పింది.

ALSO READ: కుటుంబంలో చిచ్చు.. ఆపై అన్నను చంపిన చెల్లెళ్లు

జనవరి రెండు తాను ఫలానా వ్యక్తిగా బర్త్ డే పార్టీకి వెళ్లానని తెలిపింది. కూల్ డ్రింక్ తీసుకున్న తర్వాత మత్తులోకి జారిపోయానని తెలిపింది. ఆ తర్వాత ఇలా జరిగిందని చెప్పుకొచ్చింది. వెంటనే కూతుర్ని తీసుకుని ఆ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాలిక ఫిర్యాదు మేరకు విరార్ పోలీసుస్టేషన్ పోలీసులు నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. పిల్లల   విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు పదే పదే చెబుతున్నారు. అయినా పేరెంట్స్ ఏ మాత్రం పట్టించుకోని సందర్భాలు తరచూ కనిపిస్తున్నాయి. మరోవైపు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్ప అమ్మాయిలపై అత్యాచారాలు ఇటీవలి కాలంలో పెరుగుతున్న విషయం తెల్సిందే.

థానెలో ఏం జరిగింది?

థానెలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. మజివాడ ప్రాంతానికి చెందిన బాధితురాలు షెడ్యూల్డ్ కులాలకు చెందినది. ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ వ్యక్తులతో పరిచయం చేస్తానని మూడు సంవత్సరాల కిందట యవతిని కలిసింది నిందితురాలు.  ఈ క్రమంలో  ఓ వ్యక్తిని పరిచయం చేసింది. ఆ తర్వాత ఆ వ్యక్తి యువతిని తన ఇంటికి తీసుకెళ్లి మద్యం ఇచ్చి అత్యాచారం చేశాడు.

నటిగా మారేందుకు సహాయం చేస్తానని అబద్ధం చెప్పి ముంబైలోని ఓ హోటల్‌లో అనేక సార్లు లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు. ఆ లైంగిక చర్యల వీడియో తీసి తనను బ్లాక్‌ మెయిల్ చేయడం మొదలు పెట్టాడని తెలిపింది. ఆ తర్వాత నిందితురాలు, ఆమె భర్త, కూతురు బాధితురాలిని బెదిరించడం, వేధించడం మొదలుపెట్టారు.

వీరి టార్చర్ తట్టుకోలేక చివరకు బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారం, బెదిరింపులకు కింద మొత్తం నలుగురు నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటివరకు  ఈ కేసులో ఇంకా ఎవరూ అరెస్ట్ కాలేదు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×