E-Paper
Advertisement

Brahmamudi Serial Today January 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: హాస్పిటల్ నుంచి వెళ్లిపోయిన కావ్య  

Brahmamudi Serial Today January 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: హాస్పిటల్ నుంచి వెళ్లిపోయిన కావ్య  
Advertisement

Brahmamudi serial today Episode:   

మినిస్టర్‌ ధర్మేంద్ర తన భార్య తులసిని తీసుకుని కావ్య ఉన్న హాస్పిటల్‌కే వస్తాడు. డాక్టర్‌ చక్రవర్తి దర్మేంద్ర దగ్గరకు వెళ్లి ఈ సారి మేడంకు ఏమీ కాకుండా మేము చూసుకుంటామని హామీ ఇచ్చి వెళ్లిపోతాడు. తులసి మాత్రం భయపడుతుంది. తులసిని ఓదారుస్తూ ధైర్యం చెప్తాడు ధర్మేంద్ర. మరోవైపు కావ్యకు ఆపరేషన్‌ చేయడానికి డాక్టర్‌ కావ్య రూంలోకి వెళ్తే అక్కడ కావ్య ఉండదు.. డాక్టర్‌ వెంటనే బయటకు వెళ్లి దుగ్గిరాల ఫ్యామిలీతో కావ్య కనిపించడం లేదని చెప్తుంది. అందరూ షాక్‌ అవుతారు. కట్‌ చేస్తే కావ్య పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి ఉంటుంది. అక్కడ కావ్యను చూసిన రాజ్‌ షాక్‌ అవుతాడు.  ఏంటి కళావతి నువ్వు కండీషన్‌ ఏంటి నువ్వు చేస్తున్న పనేంటి అంటూ బాధగా అడగ్గానే.. అది కాదండి మీరు ఇక్కడ ఇలా అంటూ ఏడుస్తుంటే..

ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావు కళావతి అంటూ రాజ్‌ అడగ్గానే.. ఏం చేయనండి.. నా వల్ల కావడం లేదు.. మీరెలా ఉన్నారో..? మీ పరిస్థితి ఏంటో నాకు ఏమీ తెలియడం లేదు. ఎంత అడిగినా ఎవ్వరూ ఏమీ చెప్పడం లేదు.. నా మనసు అంతా కకావికలం అయిపోతుందండి.. ఒక్కక్షణం కూడా మీరు లేకుండా హాస్పిటల్‌ లో ఉంలేకపోతున్నాను అండి అని ఏడుస్తూ కావ్య చెప్పగానే.. కళావతి నాకేం అవుతుంది. అరెస్ట్‌ చేశారు ఈ స్టేషన్‌లో ఉన్నాను.. అంతే కదా..? కానీ నువ్వు ఎంత ప్రమాదంలో ఉన్నావో తెలుసా..? అనగానే.. మీరు పక్కన లేరు కాబట్టే ఇదంతా ప్రమాదంగా మారిందండి.. మీరే కనక నా కళ్ల ముందు ఉండి ఉంటే.. నేను ఇలా ఉండేదాన్ని కాదు.. అంటూ కావ్య ఏడుస్తుంటే.. రాజ్‌ మాత్రం ఇప్పుడేమైంది కళావతి నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు.. హాస్పిటల్‌ నుంచి బయటకు వచ్చే సాహసం చేశావు..అంటాడు.

Advertisement

ఇంకా ఏం జరగాలి అండి మీరు దొంగ బంగారం కొనడం ఏంటి..? మీ కారులో బంగారం దొరకడం ఏంటి..? ఎవరో చెప్తే ఈ  పోలీసులు మిమ్మల్ని అరెస్ట్‌ చేసి తీసుకుని రావడం ఏంటి..? అంతా అయోమయంగా ఉందండి. మీతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తీసుకొచ్చారండి.. మీరు ఎలా ఉన్నారో తెలియదు..? ఎప్పుడు వస్తారో తెలియదు..? ఎలా వస్తారో తెలియదు.. అందుకే నేను వచ్చేశానండి. అంటూ కావ్య ఏడుస్తుంది. దీంతో రాజ్‌ ఓదారుస్తూ.. కళావతి నేను కళ్యాణ్‌కు చెప్పాను కదా..? ఎట్టి పరిస్థితుల్లో నీ ఆపరేషన్‌ టైంకు నీ పక్కనే ఉంటానని చెప్పాను కదా.. వాడు నీకు చెప్పలేదా..? అని అడగ్గానే.. కావ్య ఏడుస్తూనే ఏవండి నేను మీ భార్యనండి వాళ్లు అబద్దం చెబితే పసిగట్టలేనేమో కానీ మీరు అబద్దం చెప్తే మాత్రం తెలుసుకోలేనా..? కవి గారు నాకోసం అబద్దం చెప్పారు.. కానీ మీరు కూడా అదే అబద్దం చెప్పి మోసం చేస్తున్నారా..? మీరు రారని రాలేని పరిస్థితుల్లో ఉన్నారని.. అలా చెప్తే.. నేను తట్టుకోలేనని నాకు అబద్దం చెప్పానని కవి గారు అత్తయ్య వాళ్లకు చెప్తుంటే నేను విన్నాను.. అంటుంది కావ్య.

దీంతో రాజ్, కావ్యకు సారీ చెప్పి నా మాట విని నువ్వు హాస్పిటల్‌కు వెళ్లిపో అని చెప్తాడు. దీంతో కావ్య మీరు నాతోనే రావాలి.. నేను వెళ్లి ఎస్సై గారినే అడుగుతాను అంటూ ఎస్సై దగ్గరకు వెళ్లి అడిగితే ఎస్సై తాను ఏమీ చేయలేనని చెప్తాడు. ఇంతలో కళ్యాణ్‌ వచ్చి కావ్యను తీసుకెళ్తాడు. హాస్పిటల్ లో అందరూ కావ్య, కళ్యాణ్‌ కోసం ఎదురుచూస్తుంటారు.. ఇంతలో కళ్యాణ్‌ స్ట్రెచర్‌ మీద కావ్య తీసుకుని వస్తాడు. ఏమైందని అందరూ అడగ్గానే..వదినకు మళ్లీ పెయిన్స్‌ వస్తున్నాయని చెప్తాడు. ఇంతలో డాక్టర్‌ వచ్చి కావ్యను ఆపరేషన్‌ థియేటర్‌ లోకి తీసుకెళ్తుంది. ట్రీట్‌మెంట్‌ చేసి బయటకు వచ్చి కావ్యకు సీరియస్‌ గా ఉందని చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. మరోవైపు మినిస్టర్‌ ధర్మేంద్ర భార్య తులసికి కూడా ఆపరేషన్‌ చేయాలని డాక్టర్‌ చెప్తాడు.

Advertisement

మరోవైపు స్టేషన్‌లో ఉన్న రాజ్‌ కానిస్టేబుల్‌ ను రిక్వెస్ట్‌ చేసి ఫోన్‌ తీసుకుని కళ్యాణ్‌కు కాల్‌ చేస్తాడు. కావ్య గురించి అడిగి తెలుసుకుని అలాగే తాను న్యాయంగా బయటకు రాలేనని అందుకే మొదటిసారి తప్పుడు మార్గంలో బయటకు రావాలని అనుకుంటున్నట్టు తన ప్లాన్‌ చెప్తాడు రాజ్‌. కళ్యాణ్ సరే అంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×