Brahmamudi serial today Episode: రాజ్ కారెక్కిన సాఫ్ట్‌వేర్ సావిత్రి తన పేరు వెనక గల విషాద స్టోరీ చెప్తుంటే రాజ్ భయపడిపతుంటాడు. ఇంత దరిద్రుడిని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో అని అడగ్గానే.. ఉందిలే ఓ మహానుభావురాలు అంటూ ఉండండి మీతో కాదు మేడంతో మాట్లాడాలి అంటూ వెనక్కి తిరిగి మేడం మీ పేరేంటి అని అడగ్గానే.. కావ్య అని చెప్తుంది. ఇంతలో సావిత్రి ఫోన్‌కు హోమ్ లోన్ వచ్చినట్టు మెసేజ్ వస్తుంది. దీంతో కావ్యను మీరు ఎంత అదృష్టవంతులో మీతో మాట కలిపానో లేదో నాకు హోమ్ లోన్ వచ్చింది అంటూ కారు ఆపి దిగి వెనక్కి వెళ్లి కావ్య పక్కన కూర్చుంటాడు. రాజ్ ఇరిటేటింగ్ గా ఫీలవుతుంటాడు.
సీతారామయ్య దగ్గర కూర్చున్న కళ్యాణ్. బయట ఫోన్ లో మాట్లాడుతున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి తిడతాడు. ఇది హాస్పిటల్ దయచేసి మెల్లగా మాట్లాడండి అంటూ చెప్తాడు. ఇంతలో అక్కడికి ఒక లేడీ పోలీస్ రాగానే ఆమెను చూస్తూ కళ్యాణ్ అప్పును గుర్తు చేసుకుంటాడు. ప్లాష్‌బ్యాక్‌లో వెళ్తాడు. రిటర్న్ టెస్ట్ రాశాను. రిజల్ట్ వస్తుంది. తర్వాత ఆరు నెలల ట్రైనింగ్‌కు వెళ్తాను. తర్వాత ఎస్సై అయిపోతాను అంటుంది. ఇంకేముంది వారం రోజులు లీవ్ పెట్టేసి హనీమూన్‌కు ఏ ఊటీకో.. కొడైకెనాల్ కో వెళ్లిపోవాల్సిందే అంటాడు కళ్యాణ్. అబ్బా బలే కలలు కంటున్నావురా బై నువ్వు అంటుంది అప్పు. రేపు పిల్లలను కనాలంటే ఇలాంటి కలలు కనాలి కదా అంటాడు కళ్యాణ్.
కనాలి కానీ నువ్వు కూడా మంచి లిరిక్ రైటర్ అవ్వాలి. మన ఫ్యామిలీ మనల్ని గర్వంగా ఇంటికి పిలవాలి. ఇంకా ముఖ్యంగా కొంత మందికి గుణపాఠం నేర్పాలి. అప్పుడు నువ్వు ఎక్కడకు అంటే అక్కడకు వెళ్దాం అంటుంది అప్పు. అయితే సరే నువ్వు ఎలాగూ పోలీస్ అవుతావు కానీ ముందే నిన్ను పోలీస్ డ్రెస్ లో చూడాలని ఉంది డ్రెస్ వేసుకో అంటూ బతిమాలుతాడు కళ్యాణ్. సరే అంటూ అప్పు పోలీస్ డ్రెస్ వేసుకుని వస్తుంది. కళ్యాణ్ ఆనందంతో హగ్ చేసుకోబోతుంటే.. అప్పు ఆపుతుంది. పోలీసును హగ్ చేసుకుంటే శిక్ష పడుతుంది అంటుంది అప్పు. అంతా గుర్తు చేసుకుని కళ్యాణ్ హ్యాపీగా లోపలికి వెళ్తాడు.
మరోవైపు కారులో వెళ్తున్న కావ్య నాకు ఇప్పుడు కొబ్బరిబొండం తాగాలని ఉంది అంటుంది. దీంతో సావిత్రి మీరు అలా నోరు తెరచి అడిగితే ఎంత పాపిస్టోడైనా సరే మొదనష్టపోడైనా సరే కొని పెట్టకుండా ఉంటాడా..? ఓయ్ డ్రైవర్ ముందు కారు ఆపు అనగానే రాజ్ సడెన్ బ్రేక్ వేయగానే సావిత్రి ముందు సీటుకు వచ్చి కొట్టుకుంటాడు. అదేంటి దండం మీద దుప్పటి ఆరేసినట్టు అలా పడ్డావు అంటాడు రాజ్. నువ్వు బ్రేక్ వేసే పద్దతి అంత చెండాలంగా నికృష్టంగా ఉంది మరి.. అంటూ మేడం మీరు అడిగిన కొబ్బరిబొండం ఈ పక్కనే ఉంది మీరు దిగండి మేడం అంటూ సావిత్రి దిగి డోర్ తీస్తాడు.
కావ్య చేయి పట్టుకుని కిందకు దించుతాడు. ఇంతలో సావిత్రికి ఫోన్ వస్తుంది. ఫోన్‌లో లాయర్ సావిత్రి మనం కోర్టులో కేసు గెలిచాం అని చెప్తాడు. దీంతో సంతోషంగా సావిత్రి.. మేడం చేయి పట్టుకోగానే నేను ఏన్నో ఏళ్లుగా కోర్టులో పోరాడుతున్న ఆస్తి కేసు గెలిచామని చెప్తాడు. కొబ్బరి బొండం తాగిన తర్వాత ముగ్గురు కలిసి వెళ్తుంటే.. తన పక్కింటోడి చెండాలమైన కథ చెప్తాడు. రాజ్‌కు తిక్కరేగి సావిత్రి చేయి కారు డోర్ లో ఇరుక్కునేలా చేస్తాడు. తర్వాత వెళ్తుంటే.. సావిత్రి నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి జాతకమైనా క్లియర్‌గా తెలుసుకున్నావా..? అని రాజ్ అడగ్గానే..
తెలుసుకున్నాను.. వాళ్ల జాతకం అంత దరిద్రమైన జాతకం మరోకరిది లేదు అంటూ కానీ నేను ఇప్పుడు మనసు మార్చుకున్నాను అంటూ కావ్యను మేడం మీకు పెళ్లి అయిందా అని అడుగుతాడు. లేదని చెప్తూ.. రాజ్‌ను చూస్తూ మీరు నన్ను ఆడుకుంటారు కదా..? ఇప్పుడు నేను ఆడుకుంటాను అంటూ సావిత్రితో క్లోజ్ గా మూవ్ అవుతుంది కావ్య. రాజ్ ఇరిటేటింగ్ గా ఫీలవుతుంటాడు. ఇంతలో పోలీస్ ఫోన్ చేసి ఆ ఎండీ గాడు ఎక్కడ ఉంటాడో లోకేషన్ దొరికింది అని చెప్పగానే.. సరే మేము ఇప్పుడే వెళ్తాము అంటూ ఫోన్ కట్ చేస్తాడు రాజ్. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?