BigTV English

AP BJP: ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు? రేసులో వారు, కాకపోతే

AP BJP: ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు? రేసులో వారు, కాకపోతే

AP BJP: ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది? పార్టీ సంస్థాగత ఎన్నికలు చివరి అంకానికి చేరుతున్నాయా? రేపో మాపో కొత్త అధ్యక్షుడి రాబోతున్నారా? పీఠం కోసం నలుగురు పోటీ పడుతున్నారా? ప్రస్తుతం అధ్యక్షురాలు పురందేశ్వరి కేంద్ర కేబినెట్‌లోకి వెళ్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


బీజేపీలో దేశవ్యాప్తంగా సంస్థాగత ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. జనవరి మొదటి వారానికి ఈ అంకం ముగియనుంది. సెకండ్ వీక్‌లో కొత్త అధ్యక్షుడ్ని ఎంపిక చేయాలని భావిస్తోంది. సంక్రాంతి తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడ్ని ప్రకటించాలనే ఆలోచన చేస్తోంది  హైకమాండ్. అధ్యక్ష పీఠం కోసం నలుగురు నేతలు పోటీపడుతున్నారు.

దక్షిణాదిలో తన ఉనికి మరింత పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ హైకమాండ్. పార్టీలో బలమైన ట్రాక్ రికార్డు ఉన్న నాయకుడి కోసం వెతుకుతోంది. ఆ తరహా నాయకుల కోసం సెర్చింగ్ చేస్తోంది. ఈ క్రమంలో నలుగురు పేర్లు బయటకు వచ్చాయి. ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ పార్థసారథి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌, సీనియర్‌ నేత రఘురామ్‌ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.


పార్టీ అధ్యక్షుడిగా పార్థసారథి లేదా సుజనా చౌదరిలో ఎవరినైనా ఎంపిక చేయవచ్చు. కానీ, బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్)తో సంబంధాలున్న వ్యక్తులకు ప్రాధాన్యతనిస్తే బాగుంటుందని ఆలోచన చేస్తోంది. వారంతా పార్టీకి అనుకూలంగా పని చేస్తారని ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్సీ మాధవ్, రఘురామ్‌ పేర్లు వచ్చాయి.

ALSO READ:  సీఎం కాగానే జగన్‌ను జైల్లో పెట్టేవాళ్లం, కానీ.. చంద్రబాబు కామెంట్స్

పార్టీ హైకమాండ్‌తోపాటు ఆర్ఎస్‌ఎస్‌తో ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ పార్థసారథి మాంచి సన్నిహిత సంబంధాలున్నాయి. రాష్ట్ర అధ్యక్ష పదవికి బలమైన పోటీదారుగా కనిపిస్తున్నారాయన. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి వాల్మీకి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఈ ప్రాంతం నుంచి పార్టీ నాయకత్వం వహించడానికి ఇప్పటివరకు నేతలు లేరు. ఆయనైతే బాగుంటుందన్నది పార్టీ వర్గాల ఆలోచన.

విభజన తర్వాత బీజేపీలో చేరారు మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి. రెండేళ్ల కిందట ఆమె ఏపీ పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు బీజేపీ తరపున జాతీయ స్థాయిలో పార్టీ పదవులు నిర్వహించారు కూడా.

ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు వెనుక ఆమె కీలక రోల్ పోషించారు ఆమె. ఈ క్రమంలో ఆమెను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవచ్చనే వార్తలు లేకపోలేదు. మొత్తానికి రెండు వారాల్లో ఏపీ కొత్త చీఫ్ ఎవరనేది తేలనుంది.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×