BigTV English

SSMB29 Update : జక్కన్న మొదటిసారి ఇలా.. సైలెంట్ గా కానిచ్చేస్తున్నాడే..?

SSMB29 Update : జక్కన్న మొదటిసారి ఇలా.. సైలెంట్ గా కానిచ్చేస్తున్నాడే..?

SSMB29 Update : టాలీవుడ్ స్టార్ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆయన దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తన 29 వ సినిమాను చేయనున్నాడు మహేష్ బాబు.. ఈ మూవీని అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు. దాంతో ఈ మూవి కోసం అందరు ఎదురు చూపులు చూస్తున్నారు. ఎప్పుడుడెప్పుడు ఈ సినిమా ప్రారంభం అవుతుందా? అని ఓ వైపు మహేష్ ఫ్యాన్స్, మరోవైపు రాజమౌళి ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికి అప్డేట్ ను అనౌన్స్ చేశారు. నేడు ఈ మూవీని గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో లాంచ్ చెయ్యనున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరిలో ఈ మూవీ లాంచింగ్ కార్యక్రమం జరగనుంది..


ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి దాదాపు రెండేళ్లు గడుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. అసలు ఈ సినిమా మొదలవుతుందా?.. మొదలైతే ఎప్పుడు మొదలవుతుంది అని అంతా చర్చించుకుంటున్నారు.. తాజాగా ఈ మూవీ లాంచింగ్ కు జక్కన్న ముహూర్తం ఫిక్స్ చేశారు. నేడు ఉదయం పూజాకార్యక్రమాల తో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అవుతుందని టాక్ గట్టిగా వినిపిస్తోంది.. అయితే రాజమౌళి సినిమాలు అంటే పబ్లిసిటీ కూడా ఉంటుంది. కానీ ఈ మూవీ లాంచింగ్ కార్యక్రమానికి మాత్రం సెలెబ్రేటిలను కానీ మీడియాను కానీ పిలవలేదని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. హడావిడి లేకుండా పూజా కార్య క్రమాలను పూర్తి చెయ్యనున్నారట.అయితే ఈ సినిమా కోసం రాజమౌళి తన ఫార్మాట్ ని మార్చినట్టుగా టాక్ వినిపిస్తుంది. ఇది వరకు రాజమౌళి ఏ సినిమా చేసినా కూడా దానిని మొదలు పెట్టిన సమయంలోనో లేక కొంచెం గ్యాప్ తర్వాత కానీ ఆ సినిమాకి సంబంధించి డెఫినెట్ గా ప్రెస్ మీట్ పెట్టేవారు. కానీ ఇపుడు మహేష్ తో సినిమాకి ఇలాంటి ప్రెస్ మీట్ లు ఏవి ఉండబోవు అని తెలుస్తుంది. దీంతో జక్కన్న మొదటిసారి ఈ స్టెప్ తీసుకుంటున్నారా అనిపిస్తుంది. మరి ఇపుడు సింపుల్ గా ముహూర్త కార్యక్రమాలతో స్టార్ట్ చేసేసి నెక్స్ట్ ఎప్పుడైనా ప్రెస్ మీట్ ని పెడతారేమో చూడాలి మరి..

ఇక పాన్ ఇండియా లెవెల్లో ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్ లో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ కోసమే అని చెప్పాలి. మరి మహేష్ కెరీర్ లో 29 వ చిత్రంగా దీనిని గ్లోబల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇక జనవరి 2న అవైటెడ్ ముహూర్త కార్యక్రమాల తో సినిమా లాంఛ్ కాబోతుండగా అభిమానులు ఓ రేంజ్ లో ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు-ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ను ఆరు దేశాల్లో షూటింగ్ చెయ్యనున్నారు. ఈ సినిమా ఈ వేసవిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. అంతేకాదు బాహుబలి లాగా రెండు భాగాలు గా జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి భాగం 2027లో విడుదల కానుంది.. ఈ మూవీకి మ్యూజిక్ ఇవ్వబోతున్న యం యం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.  ఇక ఈ మూవీకి ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు టాక్.. మరి చూడాలి..


Related News

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Dhee Raju : ఢీ రాజుకు ఇంత మందితో బ్రేకప్ అయ్యిందా..? మంచి రసికుడే..

Big Stories

×