E-Paper
Advertisement

Brahmamudi Serial Today January 31st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నిజం తెలుసుకున్న రాజ్

Brahmamudi Serial Today January 31st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నిజం తెలుసుకున్న రాజ్
Advertisement

Brahmamudi serial today Episode:

కావ్య, రాజ్‌ను తీసుకుని మినిస్టర్‌ ఇంట్లోకి తీసుకెళ్తుంది. కిటికీలోంచి ధర్మేంద్ర వాళ్ల బెడ్‌రూంలో ఏం జరుగుతుందో చూపిస్తుంది. బెడ్‌రూంలో ధర్మేంద్ర, తులసి కూర్చుని ఉంటారు. కావ్య రాజ్‌తో ఇప్పటికైనా నమ్మండి.. మన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డని మీరు కళ్లారా చూస్తే అయినా మీకు నమ్మకం కుదురుతుంది. ఒక తల్లి మనసు పడుతున్న ఆరాటం మీకు అర్థమవుతుంది అంటూ ఎమోషనల్‌ అవుతుంది. రూంలో పాపను నిద్రపుచ్చుతున్న తులసికి ధర్మేంద్ర ఏదో చెప్తాడు అయినా తులసి విననట్టుగా ఉండిపోతుంది. దీంతో ధర్మేంద్ర కోపంగా ఏంటి తులసి.. నా మాట వినిపించనంతగా ఆ పాపతోనే మునిగిపోయావా? అంటాడు. దీంతో తులసి ఏమండీ.. చిన్నపిల్ల ఏడుస్తుంటే అలా కసురుకుంటారేంటి? ఆ అరుపులకి పాప భయపడి లేస్తుంది.. అంటూ తిడుతుంది తులసి.

దీంతో మినిస్టర్‌.. చిరు కోపంగా  పాప పుట్టినప్పటి నుంచి నువ్వు నన్ను మర్చిపోతున్నావు. నీ ప్రపంచం అంతా ఆ చంటిపిల్లే అయిపోయింది. కనీసం మొగుడికి ఏం కావాలో పట్టించుకోవడం లేదు అంటాడు. దీంతో తులసి మీ పనులు మీరు చేసుకోగలరు.. కానీ నా బిడ్డ పసిపాప. లేక లేక పుట్టిన బిడ్డ ఇది. ఈ బిడ్డే లేకపోయుంటే నేను అనే దానిని ఉండే దానిని కాదు. నా ప్రాణానికి ప్రాణమైన పాపని పనివాళ్లకు ఎలా అప్పగిస్తాను? ఆడదానికి బిడ్డ పుట్టే వరకే భర్త మీద ప్రేమ.. ఆ తర్వాత బిడ్డే సర్వస్వం అంటూ గుడిలో జరిగిన సంఘటన గురించి అడుగుతుంది తులసి. అసలు ఆ రోజు గుడిలో కావ్య మన పాపని ఎత్తుకుంటే మీరెందుకు అంత విచిత్రంగా ప్రవర్తించారు? ఏదో కొంపలు మునిగిపోయినట్లు పాపని లాగేసుకుని నన్ను అంత హడావుడిగా ఎందుకు తీసుకొచ్చారు? అనగానే.. అది.. మన పాప పరాయివాళ్ల చేతుల్లోకి వెళ్లడం ఇష్టం లేక అలా చేశాను. అయినా ఆ కావ్య తన బిడ్డ కోసం తల్లడిల్లిపోతోంది, నేను కూడా మనవాళ్లకి చెప్పాను.. వెతుకుతున్నారు.. పాప నిద్రపోయింది కదా మనం భోజనం చేద్దా పద తులసి అంటూ తులసిని తీసుకుని భోజనం చేయడానికి వెళ్తాడు ధర్మేంద్ర.

Advertisement

వాళ్లు రూంలోంచి వెళ్లిపోయాక రాజ్‌, కావ్య రూంలోకి వెళ్తారు. పాపను హత్తుకుని కావ్య ఎమోషనల్‌ అవుతుంది. చూశారా అండీ.. మన ఇంట్లో ఉండాల్సిన బిడ్డ ఇది. ఇదిగోండి.. పాప చేతి మీద ఉన్న ఈ పుట్టుమచ్చ చూడండి. ఇది మన రక్తం కాదని ఎలా అనగలరు? అనగానే.. రాజ్‌ పాపను చూసి నిజమే కావ్య.. అచ్చం నీలాగే ఉంది.. అంటాడు. ఇంతలో పాప ఏడుస్తుంది. ఆ ఏడుపుకు కింద నుంచి తులసి పరిగెత్తుకుని వస్తుంది. వెనకే ధర్మేంద్ర వస్తారు. రాజ్‌, కావ్య చాటుకు వెళ్తారు. మినిస్టర్‌ కోపంగా నీకు పిచ్చి పట్టిందా తులసీ..? చిన్న పిల్లలు అన్న తర్వాత ఎవరైనా ఏడుస్తారు. కొంచెం ఉంటే మెట్లపై పడిపోయేదానివి అని తిడతాడు.  దీంతో తులసి నా పాపకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను.. చచ్చిపోతాను. పాప నా ప్రాణం.. రేపు పాపను ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలి. నా పాలు పాపకు సరిపోవడంలేదు అని చెప్తుంది తులసి.

రాజ్‌, కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతారు. బయటకు వెళ్లిన తర్వాత రాజ్‌, కావ్యకు సారీ చెప్తాడు. నేను ఫూల్‌ని కళావతి.. కన్నతల్లి స్పర్శ గొప్పతనం గుర్తించలేకపోయాను. నిన్ను ఇన్ని మాటలన్నాను నన్ను క్షమించు అంటాడు. దీంతో కావ్య ఇప్పుడు మనకు కావాల్సింది క్షమాపణలు కాదు. వాళ్ల పాపని వాళ్లకు అప్పగించి, మన పాపని మనం ఎలా దక్కించుకోవాలనేదే ముఖ్యం. ధర్మేంద్ర గారు పవర్‌లో ఉన్నారు, ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు. మనం ఆ తులసి గారికి దగ్గరవ్వాలి. వాడి కళ్ల ముందే తిరుగుతూ వాడికి నిద్రపట్టకుండా చేయాలి అంటూ కావ్య చెప్తుంది. దీంతో రాజ్‌ నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను కళావతి అంటాడు రాజ్‌.

Advertisement

కావ్యలో మార్పును చూసి ఇంట్లో వాళ్లు ఆశ్చర్యపోతారు. రాజ్‌ తనను నేనే కన్వీన్స్‌ చేశానని చెప్తాడు. తర్వాత పాపను తీసుకుని హాస్పిటల్‌కు వెళ్తారు. అప్పుడే తులసి కూడా పాపను తీసుకుని హాస్పిటల్‌కు వస్తుంది. అక్కడ తులసికి మినిస్టర్‌ మీద డౌటు వచ్చేలా కావ్య, రాజ్‌, డాక్టర్‌ అనురాధ నాటకం ఆడతారు. దీంతో తులసిలో అనుమానం మొదలవుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

Big Stories

Advertisement
×