E-Paper
Advertisement

Brahmamudi Serial Today January 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్య కండీషన్ సీరియస్ – జైల్లో రాజ్

Brahmamudi Serial Today January 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్య కండీషన్ సీరియస్ – జైల్లో రాజ్
Advertisement

Brahmamudi serial today Episode:

రాజ్‌ను పోలీసులు తీసుకెళ్లగానే.. కావ్య ఏడుస్తూ.. అత్తయ్యా ఏం చేయాలో అర్థం కావడం లేదు చాలా భయంగా ఉంది అత్తయ్యా.. అంటూ ఏడుస్తుంది. నువ్వేం టెన్షన్‌ పడుకు కావ్య.. ధాన్యం కొంచెం వాటర్‌ తీసుకురా అని చెప్పగానే.. ధాన్యలక్ష్మీ వాటర తీసుకొచ్చి ఇస్తుంది. ఇదిగో ఈ వాటర్‌ తాగు అంటూ అపర్ణ కావ్యకు వాటర్‌ ఇస్తుంది. వాటర్‌ తాగిన తర్వాత అత్తయ్యా మా ఆయనేంటి ఇలాంటి కేసులో ఇరుక్కోవడం ఏంటి..? అసలు కలలో కూడా ఇలాంటి తప్పు చేశారని మనం ఊహించగలమా..? అంటూ ఏడుస్తుంది. దీంతో కళ్యాణ్‌ ఇదంతా ఎవరో కావాలనే చేశారు వదిన. ఇదంతా ఎవరో ఒక ప్లాన్‌ ప్రకారమే చేశారు. అనేగానే.. కావ్య ఏడుస్తూ.. అప్పు ఏదో ఒకటి చేయవే.. ఎవరితోనైనా మాట్లాడు.. మీ బావ గారిని బయటకు తీసుకురా అప్పు అంటుంది. దీంతో అప్పు అవసరం లేదు బావను ఎలాగైనా బయటకు తీసుకొస్తాము అక్క నువ్వు రిలాక్స్‌ గా ఉండు.. అనగానే..

నా వల్ల కావడం లేదే.. నిన్న నా బిడ్డకు ప్రమాదం తలపెట్టాలని చూశారు. ఈరోజు చేయని తప్పుకు ఆయన్ని జైలుకు పంపించారు నాకెందుకో కంగారుగా ఉంది అప్పు.. అనగానే.. ఇంద్రాదేవి కల్పించుకుని కావ్య నీకు దండం పెడతాను.. నువ్వు అలా కంగారు పడకు కావ్య.. కడుపులో బిడ్డకు మంచిది కాదే తల్లి నా మాట విను.. అనగానే.. కావ్య సుభాష్‌ దగ్గరకు వెళ్లి మామయ్య ఎలాగైనా ఆయన్ని కాపాడండి మామయ్య గారు ఎవరో కావాలనే ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు.. కంపెనీ సేల్స్‌ చూసి తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇంతకు తెగించి ఏ పాపం తెలియని ఆయన మీద దొంగ బంగరం కేసు పెట్టి ఆయన పేరును చెడగొట్టాలనుకుంటున్నారు.. కంపెనీ పరువును దుగ్గిరాల వారి ప్రతిష్టను దెబ్బతీయాలనుకుంటున్నారు మామయ్య.. అమ్మమ్మ మీరే ఏదో ఒకటి చేయండి.. మీ మనవడు  ఎలాగైనా కాపాడాలి అంటూ కావ్య బాధతో కిందపడిపోతుంది.

Advertisement

అందరూ కంగారు పడుతుంటారు.. ఏమైంది కావ్య అని అడగ్గానే.. అమ్మా నొప్పులతో భరించలేకపోతున్నాను అంటూ కూలిపోతుంది. భయంగా ఇంద్రాదేవి భగవంతుడా ఏడో నెలలో నొప్పులు ఏంటి..? అనుకుంటుంది. ఇంతలో సుభాష్‌ ఓరేయ్‌ కళ్యాణ్‌ కారు తీయరా..? హాస్పిటల్‌కు వెళ్దాం అనగానే.. కళ్యాణ్‌ సరే పెద్దనాన్న అంటూ పరుగెత్తుకుంటూ వెళ్తాడు. కట్‌ చేస్తే.. కావ్య హాస్పిటల్‌ ఐసీయూలో ఉంటుంది.. ట్రీట్‌మెంట్‌ జరుగుతుంది. ఐసీయూ బయట అందరూ కంగారుపడుతుంటారు. అపర్ణ బాధగా అత్తయ్యా కావ్య పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది అత్తయ్యా..అంటుంది. దీంతో ఇంద్రాదేవి అపర్ణ అన్నింటికి ఆ దేవుడే ఉన్నాడు.. నువ్వు కంగారు పడకు అంటూ ధైర్యం చెప్తుంది. కానీ సమయానికి రాజ్‌ ఇక్కడ ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అంటుంది  అపర్ణ.. దీంతో సుభాస్‌ కల్పించుకుని అపర్ణ నువ్వేం టెన్షన్ పడకు కళ్యాణ్‌ వెళ్లాడు కదా..? నేను స్టేషన్‌కు వెళ్తాను ఎలాగైనా రాజ్‌ ను తీసుకొస్తాను అని చెప్తాడు. దీంతో ఇంద్రాదేవి ముందు ఆ పని చేయరా..? అంటుంది అలాగేనమ్మా అంటూ సుభాష్‌ వెళ్లబోతుంటే.. అప్పు… పెద్దమామయ్య ఏదైనా ప్రాబ్లమ్‌ ఉంటే ఫోన్‌ చేయండి అని చెప్పగానే.. అలాగేనమ్మా.. అంటూ సుభాష్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

లోపల ఐసీయూలో ఉన్న కావ్య డాక్టర్‌ నేను మా ఆయన్ని చూడాలి.. వెంటనే మా ఆయన్ని రప్పించండి డాక్టర్‌  అని చెప్తుంది. దీంతో డాక్టర్‌ ఫ్లీజ్‌ మీరు టెన్షన్‌ పడొద్దమ్మా.. బీపీ హై అవుతుంది అని చెప్పినా వినకుండా.. ఫ్లీజ్‌ డాక్టర్‌ బయట మా వాళ్లు ఉన్నారు.. వెంటనే రమ్మని చెప్పండి నాకు మా ఆయన్ని చూడాలి డాక్టర్‌ వెంటనే రమ్మని చెప్పండి అంటుంది కావ్య.. దీంతో డాక్టర్‌ సరే అంటూ బయటకు వెళ్లి కావ్యకు సీరియస్‌గా ఉందని వెంటనే ఆపరేషన్‌ చేసి బిడ్డను బయటకు తీయాలి అని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. మరోవైపు రాజ్‌ దగ్గరకు వెళ్లి సుభాష్‌, కళ్యాణ్‌ మాట్లాడతారు. కావ్య పరిస్థితి గురించి చెప్తారు.. రాజ్‌ కంగారు పడతాడు.. మరోవైపు డాక్టర్‌ వచ్చి కావ్య తన భర్తను చూడాలనుకుంటుంది వెంటనే ఆయన్ని తీసుకురండి.. లేదంటే ఆమె ఆపరేషన్‌కు ఒప్పుకోవడం లేదని చెప్తుంది. ఇంతలో అప్పు, రాహుల్‌ ను అనుమానిస్తుంది.. దీంతో అప్పు, స్వప్నల మధ్య గొడవ జరుగుతుంది.  దీంతో ధాన్యలక్ష్మీ స్వప్నను తిడుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Big Stories

Advertisement
×