E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవని పై అక్షయ్ ప్రశంసలు.. భరత్ ను ఇరికించిన పల్లవి.. మీనాక్షికి అవమానం..

Intinti Ramayanam Today Episode: అవని పై అక్షయ్ ప్రశంసలు.. భరత్ ను ఇరికించిన పల్లవి.. మీనాక్షికి అవమానం..
Advertisement

Intinti Ramayanam Today Episode January 9th : నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ కుటుంబం మళ్ళీ తిరిగి హైదరాబాద్ కి వస్తారు. అయితే హైదరాబాదులో ఉండే రెంట్ హౌస్ కి రావడంతోనే పల్లవి రియల్ ఇద్దరు రచ్చ రచ్చ చేస్తారు. ఊరు నుంచి రాగానే మనం ఆ ఇంటికి వెళ్దాం అని అనుకున్నారు అయితే మీరేంటి మళ్లీ ఇక్కడికి తీసుకొచ్చారు అని పల్లవి శ్రీ వాళ్ళిద్దరూ కూడా రచ్చ చేస్తారు. అప్పుడంటే మనకి డబ్బులు లేవు పరిస్థితులు బాగోలేవు కాబట్టి మనము ఈ అద్దె కొంపలో ఇరికిరుకు ఇంట్లో చాలా సర్దుకుని ఉన్నాము.. మన ఇల్లు మన ఆస్తులు మనకు వచ్చేసాయి కదా ఇప్పుడు కూడా మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి అని వాళ్ళు అడుగుతారు. ఇంకా ఇక్కడే ఉంచి ఇబ్బందులు పెట్టాలని అనుకుంటున్నారా అని రాజేంద్రప్రసాద్ ని ఇద్దరు కోడలు నిలదీస్తారు. రాజేంద్రప్రసాద్ మాత్రం మౌనంగా ఉంటాడు. అవని పార్వతి ఎంత చెప్తున్నా సరే పల్లవి రియల్ మాత్రం ఇంట్లో ఉండడానికి మేము అసలు ఒప్పుకునే ఒప్పుకోమని అంటారు. మావయ్య గారిని ఎదిరించే అంత ధైర్యం మీకు ఎవరు ఇచ్చారు ఎప్పుడు ఏం చేయాలో ఆయన బాగా తెలుసు మీరు మావయ్య గారిని ప్రశ్నించే అంత అధికారం మీకు ఎవరు ఇచ్చారు అని అవని అంటుంది. అక్షయ్ శ్రీకర్ కమల్ ని పిలిచి ఆస్తి పంపకాలు చెయ్యను అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు. ఆ మాట వినగానే మొదట షాక్ అయినా కూడా ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ నిర్ణయం తెలుసుకొని అలాగే అని మాటిస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అక్షయ్ అవని దగ్గరకు వస్తాడు. అవని ఏమైందండీ మీ నాన్నగారితో మాట్లాడాలి అన్నారు నాకు చెప్పండి విషయం ఏంటి అని అడుగుతుంది. భార్యతో కూడా చెప్పని నిర్ణయం ఏదైనా ఉందా అని అవని అడుగుతుంది. అదేం లేదు నాన్న ఆస్తి గురించి చెప్పాడు. ఆస్తి పంపకాలు చేస్తే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారని నాన్న ఆస్తిని పంచన అని చెప్పారు.. మావయ్య గారు నిర్ణయం చాలా బాగుంది ఆస్తిపంచితే ఎవరికి వారే అన్నట్లు వెళ్లిపోతారు.. ముఖ్యంగా శ్రియ, పల్లవిలు ఇద్దరు కూడా ఆస్తి రాగానే ఎప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోదామని చూస్తున్నారు. ఇప్పుడు ఆస్తి గనుక ఇస్తే వాళ్ళు కచ్చితంగా వెళ్ళిపోతారు అని అవని అంటుంది.

Advertisement

వాళ్లిద్దరి సంగతి ఏమో కానీ నువ్వు మాత్రం నా నిర్ణయం ఎప్పుడు కాదనకుండా ఉండాలి అని అక్షయ్ అంటాడు. మావయ్య గారు ఆలోచన బాగుంది మీ నిర్ణయం కూడా బాగుంది అయితే మీరు మీ తమ్ముళ్ళ గురించి ఆలోచించాలి. ఏం చేసినా మీరు ముగ్గురు కలిసి చేయాలి అని అవని అంటుంది. నీలాంటి భార్య దొరకడం నాకు అదృష్టం అని అక్షయ్ తనపై ప్రశంసలు కురిపిస్తాడు. తర్వాత రోజు ఉదయం మీనాక్షి అవని ఇంటికి రావడంతో పల్లవి అది చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మేము ఎప్పుడెప్పుడు ఊరు నుంచి వస్తామా అని కనిపెట్టుకొని ఉన్నావా రాగానే దిగబడి పోయావు అని మీనాక్షి తో దారుణంగా మాట్లాడుతుంది పల్లవి..

పక్కనే ఉన్న భరత్ ఏం మాట్లాడుతున్నావు ఆరాధ్యం చూడ్డానికి మా అమ్మ వచ్చింది.. మర్యాదగా మాట్లాడు అని పల్లవి అంటుంది. నీకు మర్యాద ఇచ్చేదేంటి నువ్వు ఎవరికి పుట్టావో కూడా తెలియదు.. గాలికి పుట్టిన ఒక వెధవి నువ్వు నన్ను ఎదిరిస్తున్నావా? నీకు ఎంత ధైర్యం అని పల్లవి భరత్ ని అవమానించేలా మాట్లాడుతుంది. ఎలాంటి వాడివో మాకు బాగా తెలుసు అని పల్లవి అంటుంది. నీ గురించి ఏంటో మీ నాన్న గురించి ఏంటో బాగా తెలుసు కదా ఇక మళ్ళీ మాట్లాడడం ఎందుకు అని భరత్ అంటాడు.. నీ బుద్ధి అంటే కూడా తెలిసిన తర్వాత నీతో ఎలా మాట్లాడుతామని అని భరత్ అనగానే ఏం మాట్లాడుతున్నావ్ రా గాలికి పుట్టిన వెధవ అని గట్టిగా అరుస్తుంది పల్లవి.. ఆ మాట వినగానే నోరు ముయ్ అంటాడు భరత్.. తండ్రి ఎవరో తెలియదని ఎంత దారుణంగా మాట్లాడుతున్నావో అని చెయ్యెత్తుతాడు.

Advertisement

అప్పుడే అది చూసిన భానుమతి ఆగరా అని అంటుంది.. ఒక ఆడపిల్ల మీద చెయ్యెత్తి కొట్టాలని చూస్తావా నువ్వు ఏం మగాడివి రా అసలు అని భానుమతి అంటుంది. ఆడపిల్ల మీద చెయ్యెత్తే కుసంస్కారం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని భానుమతి అనగానే ఇంట్లోని వాళ్ళందరూ ఏం జరుగుతుందని బయటికి వస్తారు.. వెనకాల పార్వతి కూడా ఆడపిల్ల మీద చేయి ఎత్తుతావా నువ్వు మనిషివేనా అని అంటుంది.. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అని అంటారు. అప్పుడు అక్కడికి వచ్చిన అవని నా తమ్ముడు ఆడపిల్ల మీద చేయిస్తే అంత దౌర్భాగ్యుడు కాదు.. ఏం మాట్లాడిందో ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా అని అంటుంది.. తనకి పల్లవి భర్త సారీ చెప్పించుకుంటుంది.

Also Read :చిక్కుల్లో పడ్డ మనోజ్.. బాలు మాటకు శివ ఫైర్.. రోహిణి తల్లి కాదా..?

తర్వాత పల్లవి చక్రధర్ని కలవడానికి జైలుకు వెళుతుంది.. ఆ డాక్యుమెంట్స్ కనిపించాయా నీకు అని పల్లవిని చక్రధర అడుగుతాడు. కాని పల్లవి మాత్రం ఎంత వెతికిన కనిపించలేదు డాడ్ అని అంటుంది.. అవి కేవలం ఆస్తి పత్రాలు మాత్రమే కాదు అవినీతి నేను తండ్రి అని నిరూపించే పత్రాలు కూడా.. వాటిని మీ అమ్మ చూసిందనుకో కచ్చితంగా నాకు విడాకులు ఇవ్వడానికి కూడా వెనకాడదు.. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో కనుక్కో… మన చేతికి వస్తే ఆ అవని సంగతి చూడొచ్చు అని చక్రధర్ అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×