E-Paper
Advertisement

Russia News: రష్యా వీధుల్లో భారత్ టెక్కీ.. వీధులు ఊడుస్తున్న ముఖేశ్, జీతం ఎంతో తెలుసా?

Russia News: రష్యా వీధుల్లో భారత్ టెక్కీ.. వీధులు ఊడుస్తున్న ముఖేశ్, జీతం ఎంతో తెలుసా?
Advertisement

Russia News: కొన్నాళ్లుగా ఇటీ పరిశ్రమ తీవ్ర ఒడుదుకులను ఎదుర్కొంటోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షల విధించడంతో కంపెనీలు ఉద్యోగులను తొలగించే పనిలోపడ్డాయి. చాలామంది ఉద్యోగులు పోయి రోడ్డున పడ్డారు. అలాంటి వారిలో భారతీయ టెక్కీ ముఖేష్ మండల్ ఒకడు. ఆయన రష్యాలో వీధులు ఊడ్చే పనిలో చేరడం అందరి దృష్టిని ఆకర్షించింది. జీతం తక్కువేం కాదు.

రష్యా వీధుల్లో భారత్ టెక్కీ ముఖేశ్

Advertisement

ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర ఒడుదుడుకులను ఎదుర్కొంటోంది. టెక్ పరిశ్రమ చాలా ఏళ్లుగా తిరోగమనం దిశగా వెళుతోంది. ప్రధాన ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించుకునే పనిలోపడ్డాయి. దీనికితోడు నియామకాలు మందగించాయి. పరిస్థితి గమనించిన చాలామంది టెక్కీలు ఆలోచనలో పడ్డారు. కెరీర్ మార్గాలను పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement

రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌ సిటీలో వీధులు ఊడుస్తూ కనిపిచాడు భారతీయ టెక్కీ ముఖేశ్ మండల్. సింపుల్‌గా చెప్పాలంటే మున్సిపల్ పారిశుధ్య కార్మికుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు జీతం కూడా తక్కువేం కాదు. లక్ష పైమాటే, అంతేకాదు ఉచిత వసతి, భోజన సౌకర్యం ఉంటుంది.

వీధులు ఊడ్చే ఉద్యోగం, నెలకు లక్షరూపాయలు పైమాటే

మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో పని చేసిన అనుభవం ముఖేష్ సొంతం. ఏఐ, చాట్‌బాట్స్, జీపీటీ అత్యాధునిక టెక్నాలజీపై పట్టు ఉంది కూడా. ప్రస్తుతం టెక్ సెక్టార్‌లో నియామకాలు తగ్గాయి. ఉద్యోగం పోవడంతో స్వదేశానికి తిరిగి వచ్చాడు మండల్, ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పని చేశాడు.  

ఈ సందర్భంగా ఆయన్ని స్థానిక పేపర్ పలకరించింది. తాను మైక్రోసాఫ్ట్ కంపెనీలలో పనిచేశానని చెప్పాడు. AI, చాట్‌బాట్‌లు, GPT వాటిలో ప్రమేయముందని తెలిపాడు. రష్యాలోని వివిధ నగరాల్లో కార్మికుల కొరత ఉన్నట్లు తెలియడంతో నాలుగు నెలల కిందట 16 మంది భారతీయులతో కలిసి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వచ్చాడు.

ALSO READ: రణరంగమైన ఇరాన్.. నిరసన జ్వాలల్లో టెహ్రాన్

భారతీయులకు పని ముఖ్యం కాదని, బాధ్యతగా పని చేయడం తెలుసన్నాడు. రష్యాలో ఏడాది పాటు ఉండి డబ్బు సంపాదించి తిరిగి ఇండియా వెళ్తాననని చెప్పాడు. పరిస్థితులు అనుకూలించని సమయంలో ఇదొక ఆచరణాత్మక నిర్ణయమని మనసులోని మాట బయపెట్టాడు.

మునిసిపల్ రోడ్ నిర్వహణ సంస్థ కొలోమ్యాజ్స్కోయ్ ద్వారా ఉద్యోగం లభించింది. వీధులు శుభ్రపరచడం, వ్యర్థాలు తొలగించడం, నిర్వహణ బాధ్యత వంటి విధులు నిర్వహిస్తున్నాడు. కాంట్రాక్టుల పద్దతిలో నియమించుకున్నారు. అక్కడ స్థిరపడటానికి మద్దతు ఇచ్చినట్టు ఆ కంపెనీ అధికారులు చెబుతున్నారు.

భారత్ నుంచి వెళ్లిన చాలామంది రకరకాల వృత్తుల్లో కొలువుదీరారు. కొందరు రైతులు, డ్రైవర్లు, ఆర్కిటెక్ట్‌లు, ఈవెంట్ ఆర్గనైజర్లు, టెక్నీషియన్లుగా పని చేస్తున్నారు. వారిలో టెక్కీ మండల్ కూడా ఒకడు. మున్సిపాలిటీ వర్కర్‌గా జాయిన్ అయ్యాడు. కార్మికులు నెలకు దాదాపు 100,000 రూబిళ్లు ఇస్తారు. అది భారతీయ కరెన్సీలో దాదాపు రూ. లక్షల పైగానే ఉంటుంది.

Related News

చర్చిలో తీవ్ర విషాదం.. ప్రార్థన చేస్తుండగా పాస్టర్‌పై పడ్డ భారీ శిలువ.. వీడియో వైరల్!

నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

Big Stories

Advertisement
×