E-Paper
Advertisement

Brahmamudi Serial Today July 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అప్పుకు బెయిల్‌ ఇచ్చిన కావ్య – షాకైన ఏసీబీ ఆఫీసర్‌  

Brahmamudi Serial Today July 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అప్పుకు బెయిల్‌ ఇచ్చిన కావ్య – షాకైన ఏసీబీ ఆఫీసర్‌  
Advertisement

Brahmamudi serial today Episode: తన యూనిఫామ్ తీసి నార్మల్‌ డ్రెస్‌ వేసుకుని వస్తుంది అప్పు. ఏసీబీ వాళ్లు అప్పును ఘోరంగా మాట్లాడుతూ అవమానిస్తుంటారు.  ఎఫ్‌ఐఆర్‌ పూర్తి కాగానే అప్పును సెల్‌ లో వేయండి అని చెప్తారు. ఇంతలో కావ్య లాయర్‌ను తీసుకుని పోలీస్‌స్టేషన్ కు వస్తుంది. లోపలికి వెళ్లి అవసరం లేదు అప్పుకు బెయిల్‌ తీసుకొచ్చాను అని చెప్తుంది. లాయర్‌ గారు బెయిల్ ఇవ్వండి అని చెప్పగానే లాయర్‌  బెయిల్‌ ఇవ్వగానే.. ఏసీబీ ఆఫీసర్‌ షాక్‌ అవుతాడు. అప్పుడే బెయిల్‌ ఎలా వచ్చింది. మామూలుగా ఇలాంటి కేసుల్లో బెయిల్‌ ఇవ్వరు కదా..? అని అడుగుతాడు.

దీంతో లాయర్‌ అరెస్ట్‌ అయిన వ్యక్తి సొసైటీలో మంచి పేరు ఉండి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేకపోతే బెయిల్‌ ఇస్తారు ఆఫీసర్‌ అని చెప్తాడు లాయరు. దీంతో ఆ ఆఫీసర్‌ అంత బ్యాగ్రౌండ్ ఉందా ఈవిడకు అని అడుగుతాడు. దీంతో కావ్య కోపంగా నా చెల్లెలు అంటే ఎవరనుకున్నారు దుగ్గిరాల ఇంటి కోడలు అని చెప్తుంది. ఆఫీసర్‌ షాకింగ్‌గా వాట్‌ అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి చీఫ్‌గా లంచం తీసుకున్నారా..? అని అడుగుతాడు. దీంతో కావ్య మీకు తెలిసింది ఇంతే దీని వెనక ఎవరున్నారో ఎవరు ఫ్లాన్‌ చేశారో కోర్టులో అన్నీ తెలుస్తాయి అంటుంది. దీంతో ఆ ఆఫీసరు.. కోపంగా  మీ పలుకుబడి వాడి నిజాలను తారుమారు చేయాలనుకుంటున్నారేమో సాక్ష్యాలతో పట్టుకున్నాము మేడం అంటాడు. అది తేల్చాల్సింది కోర్టు.. మీరు కాదు ఆఫీసర్‌.. అంటూ లాయరు, కావ్య అప్పును తీసుకుని వెళ్లిపోతారు.

Advertisement

బయటకు వచ్చిన అప్పు ఇద్దరు వెధవలు వచ్చి నన్ను డైవర్ట్‌ చేసి ఇలా జరిగేలా చేశారు అంటూ మొత్తం చెప్పేస్తుంది అప్పు. అయితే ముందు ఇంటికి వెళ్దాం తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని ఇద్దరూ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతారు. మరోవైపు ఇంటికి రాజ్‌ డల్లుగా వెళ్తాడు. రాజ్‌ను చూసిన యామిని నవ్వుతూ పలకరిస్తుంది. ఏంటి బావ అప్పుడే వచ్చేశావు.. వెళ్లిన పని అయిపోయిందా..? కళావతికి ప్రపోజ్‌ చేసేశావా..? తను నీ లవ్‌ను యాక్సెప్ట్‌ చేసిందా…? అని అడుగుతుంది. లేదు యామిని.. నేను ప్రపోజ్‌ చేయలేదు అని చెప్తాడు. దీంతో యామిని ఎందుకు చేయలేదు బావ అని అడుగుతుంది. కళావతి గారికి ఆఫీసులో ఒక ప్రాబ్లమ్‌ వచ్చింది అది సాల్వ్‌ చేశాక చెప్పాలనుకున్నాను. ఇంతలో అప్పు అరెస్ట్‌ అయినట్టు తెలియడంతో కళావతి వెళ్లిపోయింది అని చెప్పగానే..

నాకెందుకో అనుమానంగా ఉంది బావ. కళావతి కావాలనే నిన్న అవైడ్‌ చేయడం కోసం ఇలా చేస్తుందేమో అనిపిస్తుంది బావ అంటూ చెప్పగానే.. రాజ్‌ కోపంగా యామిని ఆపు కళావతి గారి గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు. తనేంటో తన వ్యక్తిత్వం ఏంటో నాకు బాగా తెలుసు. పైగా తనకు నేనంటే ప్రాణం కూడా అలాంటి మనిషి నాకు అబద్దం చెప్పి నా నుంచి తప్పించుకుని వెళ్లడం ఏంటి..? ఇష్టం లేకపోతే ఇష్టం లేదని డైరెక్టుగానే చెప్తుంది కానీ అబద్దాలు మాత్రం ఎప్పటికీ చెప్పదు. తనకు నిజంగానే ఫోన్‌ వచ్చింది నా ముందే మాట్లాడింది. నాకు చెప్పే వెల్లిపోయింది. కళావతి గారిని అర్థం చేసుకోలేకపోయినా పర్వాలేదు కానీ అపార్తం మాత్రం చేసుకోకు ఇంకోసారి నా ముందు ఇలా తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేను అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు రాజ్‌.

Advertisement

దీంతో యామిని కోపంగా చూస్తూ.. నా ముందు నువ్విలా కావ్యను పొగిడనా.. తనకు సపోర్టుగా మాట్లాడినా.. నాకు నచ్చదు బావ. నేను తట్టుకోలేను బావ అంటూ తిట్టుకుంటుంది యామిని. ఇంతలో వైదేహి వచ్చి బేబీ నీకేమైనా పిచ్చి గానీ పట్టిందా..? అని అడుగుతుంది. నాకు పిచ్చి పట్టడం ఏంటి మామ్‌ అని యామిని అడగ్గానే.. మరి లేకపోతే ఏంటే.. జరిగింది అంతా నీకు తెలిసి కూడా ఏమీ తెలియనట్టు అలా మాట్లాడటం ఎందుకు..? అల్లుడి గారి చేత ఇలా తిట్టించుకోవడం ఎందుకు అని నిలదీస్తుంది. దీంతో ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది మామ్‌ అని యామిని చెప్తుంది.

మరోవైపు అప్పు గురించి రుద్రాణికి తెలియడంతో ఇంట్లో అందరి ముందు చెప్పి హడావిడి చేస్తుంది. రుద్రాణి మాటలకు అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ధాన్యలక్ష్మీ కోపంగా కళ్యాణ్‌ను తిడుతుంది. ప్రతి విషయానికి నీ పెళ్లాన్ని వెనకేసుకొస్తావు కదా ఇప్పుడేం చెప్తావు అంటూ నిలదీస్తుంది. ఇంతలో అప్పు, కావ్య ఇంటికి వస్తారు. ధాన్యలక్ష్మీ నోటికొచ్చినట్టు అప్పును తిడుతుంది. కళ్యాణ్‌ అడ్డు రావడంతో ధాన్యలక్ష్మీ కళ్యాణ్‌ను తిడుతుంది.

అప్పు తప్పు చేయలేదని కావ్య చెప్తుంది. అందరి ముందు అప్పు నిర్దోషి అని నిరూపించి నేను తీసుకొస్తాను అని మాటిస్తుంది కావ్య. అలా నిరూపించుకోకపోతే ఏం చేస్తారు అని ధాన్యలక్ష్మీ అడగడంతో అలా చేయకపోతే నా చెల్లెలు మీరు కోరిన కోడలిగానే ఇంట్లో ఉండిపోతుంది అని కావ్య చెప్పగానే అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు. ధాన్యలక్ష్మీ మాత్రం సరే రెండు రోజులే కదా ఎదురుచూస్తాను అని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది. అందరూ వెళ్లిపోతారు. స్వప్న, కళ్యాణ్‌ ఇద్దరూ అప్పు దగ్గరకు వెళ్లి ఓదారుస్తారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×