Nindu Noorella Saavasam Serial Today Episode: రిసెప్షన్‌కు రెడీ అవుతున్న చిత్ర తన ఫోన్లో సెల్ఫీ తీసుకుంటుంటే మనోహరి వస్తుంది. అక్కడ అన్ని లక్షలు పెట్టి ఫోటో గ్రాఫర్‌ను పెట్టిస్తే నువ్వు ఇక్కడ మిర్రర్‌లో ఫోటోలు తీసుకుంటున్నావా..? అని అడుగుతుది. దీంతో ఇలా నగలన్నీ పెట్టుకుని ఇలా ఫోటోస్ దిగాలని ఎన్ని కలలు కన్నానో తెలుసా మను..? అందుకే ఆశ తీరా నేను ఫోటోలు తీసుకుంటున్నాను అంటుంది చిత్ర. దీంతో మనోహరి వెటకారంగా కోట్లు వచ్చినా నీ కక్కుర్తి బుద్ది పోలేదు అంటుంది. ఎలా పోతుంది మను పుట్టుకతో వచ్చింది. సరేరా మనిద్దరం సెల్ఫీ తీసుకుందాం అంటుంది చిత్ర. అవసరం లేదు అంటుంది మనోహరి.
దీంతో చిత్ర నా ఒంటి మీద నగలు చూసి చిన్నబోతున్నావా..? మను నీ టైం కూడా వస్తుందిలే అంటుంది. ఇంతలో వినోద్ వచ్చి చిత్ర నాన్నా అన్నయ్య పిలుస్తున్నారు వెళ్దామా.? అని అడుగుతాడు. సరే వినోద్ నేను ఎలా ఉన్నాను అని అడుగుతుంది. చాలా బాగున్నావు అని వినోద్ చెప్పగానే.. సిగ్గుపడుతూ ఇన్ని నగలు వేసుకున్నాక బాగానే ఉంటాను కదా.? అయినా ఈ నగలన్నీ ఫంక్షన్ అయిపోయాక మళ్లీ ఇచ్చేయాలి కదా అది నా బాధ సరే పద వెళ్దాం అంటూ బయటకు వెళ్లిపోతారు. దీంతో మనోహరి కన్‌ఫంగా ఇది ఏదో చేస్తుంది. అందుకే నగల గురించి ఇన్ని సార్లు మాట్లాడింది. అయినా దాని చావు దాన్ని చావనివ్వు మను నీ పని మీద కాంసంట్రేషన్ చేయ్ అని మనసులో అనుకుంటుంది మనోహరి.
మిస్సమ్మ, పిల్లలు, అమర్ అందరూ కలిసి రెడీ అయి వచ్చి రిసెప్షన్‌లో మాట్లాడుకుంటూ ఉండగా.. ఆరు చూసి హ్యపీగా ఫీలవుతుంది. గుప్త గారు నా పిల్లలను చూశారా ఎంత ముద్దుగా ఉన్నారో.. గుప్త గారు ఇవాళ భాగీని అంజును ఎలాగైనా కాపాడుకుంటాను అని చెప్తుంది. దీంతో గుప్త కోపంగా బాలిక మరోక రెండు దినములలో మనం మా లోకమునకు వెళ్లెదము అప్పట వరకు నాకు శిరోభారము కలిగించకు అని చెప్తాడు. దీంతో ఆరు అవునా.? అయితే మీరొక పని చేయండి రణవీర్‌ను మనును మా ఆయనకు దొరికిపోయేలా చేసి జైలుకు వెళ్లేలా చేయండి అని చెప్తుంది. దీంతో గుప్త కోపంగా అది మేము చేయరాదని నీకు తెలియును కదా అంటాడు. అయితే మీకు తలనొప్పి రాకుండా చేయడం నా వల్ల కాదని మీకు తెలుసు కదా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆరు.
రిసెప్షన్‌లో ఎలాగైనా మిస్సమ్మను చంపాలనుకుంటుంది మనోహరి అది పసిగట్టిన ఆరు కోపంగా ఆరును చూస్తుంది. గుప్త దగ్గరకు రాగానే.. చూశారా గుప్త గారు ఆ మనోహరి రణవీర్ కోసం ఎదురుచూస్తున్నట్టు ఉంది. రానివ్వండి ఇవాళ వాళ్ల కథ ముగిసిపోతుందని నాకు అర్థం అయింది అంటూ మనోహరిని కోపంగా చూస్తుంది. ఇంతలో శివరాం మనోహరిని పిలిచి వచ్చిన వాళ్లకు ఏం కావాలో చూడమని చెప్తాడు. సరేనంటూ మనోహరి వెళ్లిపోతుంది.
ఇంతలో రిసెప్షన్‌కు రణవీర్ వస్తాడు. అమర్‌ను పలకరిస్తాడు. దీంతో అమర్ పిలవగానే వస్తావని అనుకోలేదు అంటాడు. రాక నాకు తప్పలేదు అమర్. ఇక్కడకు రావడం నాకు చాలా ఇంపార్టెంట్ అని మీకు కూడా తెలుసు కదా అంటాడు రణవీర్. నువ్వు కూడా ఇలా నా కళ్ల ముందు ఉండటం చాలా ఇంపార్టెంట్ అని నీకు కూడా తెలుసు కదా అంటాడు అమర్. దూరం నుంచి అంతా గమనిస్తున్న మనోహరి ఇదే అమర్ నాకు కావాల్సింది. రణవీర్ ఫంక్షన్ లో ఉంటే నీ పూర్తి ఫోకస్ రణవీర్ మీదే ఉంటుందని నాకు బాగా తెలుసు. నువ్వు అంజును కాపాడుకుంటూ ఉంటే నేను మూడో కంటికి తెలియకుండా నేను భాగీని పైకి పంపిచేస్తాను. అది చచ్చిపోతే అమర్ కాంసట్రేషన్ నా మీద నుంచి పోతుంది. ఒక్కటే దెబ్బకు నాకున్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అని మనసులో అనుకుంటుంది.
తర్వాత అందరూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే.. అమర్, మిస్సమ్మ పక్కనే ఉంటాడు. టైం అయిపోతుందని మనోహరి టెన్షన్ పడుతుంది. అమర్ పక్కన ఉండగా భాగీని టచ్ కూడా చేయలేము ఇప్పుడెలా అని ఆలోచిస్తుంది. ఇంతలో బయట రణవీర్ ఏర్పాటు చేసిన మనుషులు అమర్ ఇంట్లోకి వచ్చే కరెంట్ వైర్ కట్ చేస్తారు. ఇంట్లో కరెంట్ పోయి చీకటి కాగానే క్యాండిల్ కోసం మిస్సమ్మ స్టోర్ రూంలోకి వెళ్తుంది. అది గమనించిన మనోహరి వెనకాలే కత్తి తీసుకుని వెళ్లి మిస్సమ్మను చంపబోతుంది. వెంటనే ఆరు వచ్చి మనోహరి పీక పట్టుకుని పైకి ఎత్తుతుంది. గిలా గిలా కొట్టుకుంటున్న మనోహరి ఆరు ఫ్లీజ్ వదులు అంటూ బతిమాలుతుంది. ఎంత బతిమాలినా ఆరు వదలదు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?