BigTV English

Akhanda 2 : భారీ ధరకు ‘అఖండ 2’ నాన్ థియేట్రికల్ బిజినెస్.. మళ్లీ ఆ ఓటీటీలోకే..

Akhanda 2 : భారీ ధరకు ‘అఖండ 2’ నాన్  థియేట్రికల్ బిజినెస్.. మళ్లీ ఆ ఓటీటీలోకే..

Akhanda 2 : నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2.. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అఖండ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో అఖండ 2 తాండవం రానున్న సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజరు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఒక వైపు విమర్శలు వచ్చినా కూడా మరోవైపు బాలయ్య సినిమా కావడంతో ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే తాజాగా ఈ మూవీ భారీ ధరకు నాన్ థియేట్రికల్ రైట్స్ ను క్లోజ్ చేసుకుంది. ఎంత బిజినెస్ జరిగిందో ఒకసారి తెలుసుకుందాం..


‘అఖండ 2’ నాన్ థియేట్రికల్ బిజినెస్..

అఖండ 2 సినిమాలో డబుల్ మాస్ యాక్షన్ సీన్స్ ఉంటాయని ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో చర్చలు మొదలు పెట్టారు. అఖండ మూవీ కన్నా ఎక్కువగా అఖండ 2 మూవీ బిజినెస్ జరిగింది. నిర్మాత 80 కోట్లు ఆఫర్ చెయ్యగా అమెజాన్ 60 కోట్లలో మీడియా డీల్ ద్వారా 70 కోట్లతో మూసివేయబడుతుంది. ఆగస్ట్ 31 నాటికి పాటలతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ భారీ సెట్ లో జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ దాదాపు షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంది. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ప్రమోషన్స్ ను మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.. ముందుగా టీమ్ అనౌన్స్ చేసినట్లుగానే సెప్టెంబర్ 25 న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది.


Also Read : డైరెక్టర్- హీరో మధ్య గొడవ.. షూటింగ్ మధ్యలో వెళ్ళిపోయిన మహేష్..?

‘అఖండ 2’ స్టోరీ విషయానికొస్తే..

బాలయ్య సినిమాల అంటే ఫ్యాన్స్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు. బాలయ్య దేవాలయాల పవిత్రత కాపాడే ఒక పవర్ఫుల్ ఆఘోర పాత్రలో.. హిందూ దేవాలయాలు, గ్రంథాల జోలికి ఎవ్వరు వెళ్ళిన వాళ్ళ తాటతీసే తాండవం ఆడే వ్యక్తిగా కనిపించనున్నాడని సమాచారం. మొదటి భాగంలో కన్నా రెండో భాగంలో ఎక్కువగా మాస్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. బాలయ్య కళ్ళల్లో కోపం శత్రువులు వణుకు పుట్టించేలా ఉంటుందని.. సనాతన ధర్మాన్ని టచ్ చేస్తూ.. సినిమా రూపొందనుందని.. పాన్ ఇండియన్ పాయింట్ కూడా బోయపాటి టచ్ చేయబోతున్నాడని టాక్‌.. అంటే ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.. ఇటీవల నార్త్ అభిమానుల కోసం టీజర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్.. బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట, గోపీచంద్ అచంట సంయుక్తంగా అఖండ 2 చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ తర్వాత మరో రెండు సినిమాలకు సైన్ చేసినట్లు టాక్..

Related News

Boney Kapoor: ‘శివగామి‘ పాత్ర వివాదం.. శ్రీదేవిని అవమానపరిచారు.. పెదవి విప్పిన బోనీ కపూర్

OG: ఓజీపై తమన్ బిగ్ అప్డేట్.. గూస్ బంప్స్ గ్యారెంటీ అంటూ!

Rudramadevi: గోన గన్నారెడ్డిపై ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్, మహేష్.. మరి బన్నీతో ఎలా?

Lokesh Kanagaraju : లోకేష్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో… కూలీనే కూనీ చూసింది ?

Little hearts: రిలీజ్ అయిన ఒక్క రోజులోనే… రికార్డు క్రియేట్ చేసిన లిటిల్ హార్ట్స్!

Spirit: షూటింగ్ మొదలు కాలేదు.. అప్పుడే 70 శాతం పూర్తి అంటున్న డైరెక్టర్!

Big Stories

×