E-Paper
Advertisement

Brahmamudi Serial Today July 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నగలన్నీ అప్పుకు ఇచ్చిన స్వప్న – రాజ్‌ కు ట్రైనింగ్‌ ఇచ్చిన కావ్య

Brahmamudi Serial Today July 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నగలన్నీ అప్పుకు ఇచ్చిన స్వప్న – రాజ్‌ కు ట్రైనింగ్‌ ఇచ్చిన కావ్య
Advertisement

Brahmamudi serial today Episode: రాహుల్‌ రూంలో వెతుకుతుంటే స్వప్న వస్తుంది. మళ్లీ ఏం కొట్టేయాలని వెతుకుతున్నావు అని అడుగుతుంది. ప్రతిసారి ఏదో ఒకటి కొట్టేయడానికి నేను దొంగను కాదు స్వప్న అంటాడు రాహుల్‌. దీంతో స్వప్న వెటకారంగా కుక్కతొక వంకర అన్నట్టు నీ బుద్ది మారదు కదా..? అయినా అది నీ తప్పు కాదులే తప్పులు చేయడం అనేది తమరి డీఎన్‌లోనే ఉంది.ఏం చేస్తాం ఇలా అనుభవించాల్సిందే.. చెప్పు ఏం కొట్టేయడానికి వచ్చావు అని అడుగుతుంది. ఏం లేదు నేనేం కొట్టేస్తాను స్వప్న అంటాడు రాహుల్‌. మరి గదిలో ఇంత స్పేస్‌ ఉండగా ఇక్కడికే ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. దీంతో రాహుల్‌ ఒక్క నిమిషం ఇదిగో ఈ చార్జర్‌ కోసం వచ్చాను అని చార్జర్‌ తీసుకుని వెళ్లిపోతాడు. నా దొంగమొగుడు చెప్తుంటే ఏదో డౌటుగా అనిపిస్తుంద. కచ్చితంగా ఏదో చేయబోతున్నాడు అని స్వప్న అనుకుంటుంది. బయటకు వెళ్లిన రాహుల్‌ కూడా చావు తప్పి కన్ను లొట్ట పడ్డట్టు కొద్దిలో కొద్దిగా తప్పించుకున్నాను అనుకుంటూ వెళ్లిపోతాడు.

ఇంద్రాదేవి, అపర్ణ కాఫీ తాగుతూ రాజ్‌, కావ్యల గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో రాజ్‌ వస్తాడు. నిన్న ఏం జరిగిందో చెప్పు అని ఇంద్రాదేవి అడుగుతుంది. ఏం జరుగుతుంది. ఏదో ఒకటి తిని పడుకున్నాను అని రాజ్‌ వెటకారంగా చెప్పగానే.. ఇంద్రాదేవి కొంచెం కోపంగా ఒరేయ్‌ వెధవ మేము అడుగుతుంది అది కాదు అంటుంది. నిన్న నువ్వు ఏం తిన్నావు.. ఏం బట్టలు వేసుకున్నావు అని కాదు నిన్న నువ్వు కావ్య బయటకు వెళ్లారు కదా..? ఏం మాట్లాడుకున్నారు ముందు దాని గురించి చెప్పు అని అపర్ణ అడుగుతుంది. దీంతో రాజ్‌ సిగ్గుపడుతూ చాలా మాట్లాడుకున్నాము అని చెప్తుంటే.. అసలు ఏం మాట్లాడుకున్నారో క్లియర్‌గా చెప్పు అని ఇంద్రాదేవి అడుగుతుంది. అంటే అది మా ఇద్దరి లైఫ్‌ గురించి పూర్తిగా క్లారిటీగా మాట్లాడుకున్నాము.. ఇక మా ఇద్దరి మధ్య ఎలాంటి కన్పీజ్‌ ఉండదు. నేను చేసిన పనికి నాకు థాంక్స్‌ కూడా చెప్పారు అని రాజ్‌ చెప్పగానే.. ఇది కదా మాకు కావాల్సింది అంటూ ఇంద్రాదేవి సంతోషపడుతుంది.

Advertisement

ఈ శుభవార్త వినడానికే ఇన్ని రోజులు ఎదురుచూశాం అని అపర్ణ చెప్తుంది. ఇంద్రాదేవి.. అయితే వెంటనే పంతులును పిలిపించాలి అంటుంది.  పెళ్లికి ముహూర్తం పెట్టించాలి అని అపర్ణ చెప్తుంది. దీంతో రాజ్‌ హలో మరీ అంత స్పీడ్‌ అయిపోకండి కాస్త నెమ్మది అంటాడు. ఇంకా నెమ్మది ఏంట్రా నిర్ణయం తీసుకునే వరకే మీరు తర్వాత అంతా మా నిర్ణయం ప్రకారమే జరగాలి అంటుంది ఇంద్రాదేవి. దీంతో రాజ్‌ అసలు పెళ్లికి ఓకే అని నేనెప్పుడు చెప్పాను అంటాడు. ఇప్పుడే అన్నావు కదరా లైఫ్‌ గురించి పూర్తిగా మాట్లాడుకున్నామని అపర్ణ అడుగుతుంది. దీంతో రాజ్‌ కావ్యతో జరిగిన విషయం ఆఫీసు ప్రాబ్లమ్‌ గురించి చెప్తాడు. అపర్ణ, ఇంద్రాదేవి డల్లు అయిపోతారు.

ఇంతలో కావ్య వచ్చి కోపంగా రామ్‌ గారు ఏంటండి మీరు ఉదయం రాగానే నన్ను వచ్చి కలవమన్నాను ఇక్కడ వీళ్లతో ముచ్చట్లు పెడుతున్నారు అంటుంది. దీంతో రాజ్‌ ముచ్చట్లు కాదండి మనం చేయబోయే పని గురించి క్లారిటీగా చెప్తున్నాను అనగానే.. చేయాల్సిన పని మీద క్లారిటీ ఉండాల్సింది మీకు.. నేర్చుకోవాల్సింది మీరు. పదండి అసలే టైం చాలా తక్కువగా ఉంది పదండి రండి అంటూ రాజ్ ను చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంది. రాజ్‌ చూశారా..? చేయిపట్టుకుని లాక్కుని వెళ్తుంది అంటూ లోపలికి వెళ్తిపోతాడు.

Advertisement

స్వప్న నగలు తీసి మెరుగు పెట్టించాలని బయటకు తీస్తుంది. అప్పు వచ్చి ఏం చేస్తున్నావు అక్కా అంటూ అడుగుతుంది. దీంతో స్వప్న రాహుల్ గురించి చెప్పి బాధపడుతూ ఈ నగలు నువ్వే మెరుగు పెట్టించి తీసుకురా అని చెప్తుంది. సరేనని నగలు తీసుకుని వెళ్లిపోతుంది అప్పు. మరోవైపు రూంలోకి వెళ్లిన కావ్య.. రాజ్‌కు సూట్‌ వేసి ఆఫీసులో ఎలా మాట్లాడాలో ఎలా నడవాలో ట్రైనింగ్‌ ఇస్తుంది. కావ్య చెప్పినట్టు చేయడానికి రాజ్‌ నానా తిప్పలు పడుతుంటాడు. తర్వాత భోజనం చేయడంలో కూడా ట్రైనింగ్‌ ఇస్తుంది. అక్కడ కూడా రాజ్‌ తిప్పలు పడతాడు. కావ్య ట్రైనింగ్‌ ఇవ్వడాన్ని రుద్రాణి చూసి షాక్ అవుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Related News

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

Big Stories

Advertisement
×