Vivo T4 Lite Sales| వివో స్మార్ట్ ఫోన్ కంపెనీ తన T4 సిరీస్ లో కొత్తగా ఒక బడ్జెట్ ఫోన్ విడుదల చేసింది. వివో T4 లైట్ 5G అనే ఈ ఫోన్ లాంచ్ అయిన ఒక వారంలోనే దేశవ్యాప్తంగా అమ్మకానికి వచ్చేసింది. ఈ ఫోన్‌లో 256GB వరకు స్టోరేజ్, పవర్ ఫుల్ 6000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉన్నాయి. అంతేకాకుండా.. ఫోటో ఎడిటింగ్, స్క్రీన్ ట్రాన్స్‌లేషన్ కోసం AI ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ధరలు, ఆఫర్లు, ఫీచర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
వివో T4 లైట్ 5G ధర, ఆఫర్లు
వివో T4 లైట్ 5G మూడు స్టోరేజ్ రకాల్లో లభిస్తుంది: 4GB RAM + 128GB, 6GB RAM + 128GB, 8GB RAM + 256GB. ఈ ఫోన్.. బేస్ మోడల్ ధర కేవలం రూ. 9,999 నుంచి మొదలవుతుంది. మిగతా రెండు మోడళ్ల ధరలు రూ. 10,999, రూ. 12,999. గా ఉన్నాయి.
ఈ ఫోన్ జులై 2, మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. అంతేకాకుండా, వివో అధికారిక ఈ-స్టోర్, వివిధ రిటైల్ షాపుల్లో కూడా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ రెండు ఆకర్షణీయ రంగుల్లో లభిస్తుంది. ప్రిజం బ్లూ, టైటానియం గోల్డ్. అదనంగా, HDFC, SBI, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 500 తగ్గింపు కూడా లభిస్తుంది.
వివో T4 లైట్ 5G ధర
4GB RAM + 128GB రూ. 9,999
6GB RAM + 128GB రూ. 10,999
8GB RAM + 256GB రూ. 12,999
వివో T4 లైట్ 5G ఫీచర్లు
వివో T4 లైట్ 5Gలో 6.74 ఇంచెస్ LCD డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే.. 720×1600 పిక్సెల్స్ HD రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ స్క్రీన్ 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో స్పష్టమైన సాఫీగా కనిపించే వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది.
ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది. ఫోన్ 8GB RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. అవసరమైతే, మైక్రోSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15తో పనిచేస్తుంది. ఇది సులభమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.
ఈ బడ్జెట్ ఫోన్‌లో వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉంది, ఇది మీ జ్ఞాపకాలను సులభంగా సంగ్రహిస్తుంది.
వివో T4 లైట్‌లో 6000mAh గల భారీ బ్యాటరీ ఉంది. ఇది 15W USB టైప్-C ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ రోజంతా ఉపయోగించడానికి అనువైనది. కనెక్టివిటీ కోసం డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, డ్యూయల్ 5G, బ్లూటూత్ ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ రోజువారీ ఉపయోగంలో గట్టిగా ఉండేలా IP64 రేటింగ్, SGS 5-స్టార్ యాంటీ-ఫాల్ ప్రొటెక్షన్, MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
Also Read: హానర్ ప్యాడ్ X9 నుంచి రియల్ మీ ప్యాడ్ 2 లైట్ వరకు.. రూ.15,000 లోపు బెస్ట్ ట్యాబ్లెట్స్
ఈ సరసమైన ధరలో అద్భుతమైన ఫీచర్లతో వివో T4 లైట్ 5G బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కోరుకునే వారికి గొప్ప ఎంపిక.