Hyderabad News: హైదరాబాద్ కాటేదాన్ పారిశ్రామికవాడలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో తిరుపతి రబ్బర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్నవి రబ్బర్ ఉత్పత్తులు కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. అదే సమయంలో ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగలు కమ్మేశాయి.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. మంటలు అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. పొగ కారణంగా స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఆస్తినష్టం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.
ప్రస్తుతానికి మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రమాదానికి సంబంధించి కారణాలు ఇంకా తెలియాల్సివుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయి.
నాలుగురోజుల కిందట పటాన్‌చెరులోని పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచి ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన నుంచి ఇప్పుడిప్పుడే నగరవాసులు తేరుకుంటున్నారు. ఈలోగా కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అక్కడికి చేరుకున్నట్లు సమాచారం.
ALSO READ: కేసీఆర్ మా నాయకుడు, కేటీఆర్‌తో మాటల్లేవ్, కవిత సంచలన కామెంట్స్
తిరుపతి భారీ అగ్నిప్రమాదం
మరోవైపు తిరుపతి పట్టణంలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆలయం ముందు ఉన్న షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చలువ పందిళ్లకు మంటలు అంటుకోవడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు.
ప్రస్తుతానికి మంటలను అదుపులోకి తెచ్చినట్టు తెలుస్తోంది. ఆలయ రథాన్ని సురక్షితంగా తరలించినట్లు చెబుతున్నారు టీటీడీ అధికారులు. ఆరు దుకాణాలు, 10 ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు సమాచారం. అయితే ఆస్తినష్టం భారీ ఉండవచ్చని భావిస్తున్నారు అధికారులు. ఇత్తడి సామాన్లు, బొమ్మలు దగ్ధమయ్యాయి.
గతంలో గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని దుకాణాలు తగలబడ్డాయి. అప్పుడూ భారీ నష్టం వాటిల్లింది. అయితే విద్యుత్ వైర్లు కారణంగానే ఆ ప్రాంతంలో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
కాటేదాన్‌లోని ఓ రబ్బర్ కంపెనీలో మంటలు
మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఫైర్ సిబ్బంది pic.twitter.com/zHePrNi7ex
— BIG TV Breaking News (@bigtvtelugu) July 3, 2025
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం
ఆలయ సమీపంలోని ఓ ఫోటో ఫ్రేమ్ షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం
ఈ క్రమంలో ఆలయం ముందున్న చలువ పందిళ్లకు అంటుకున్న మంటలు
మంటలు వేగంగా వ్యాపించడంతో ఆరు దుకాణాలు, పది ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు సమాచారం
ఫైర్… pic.twitter.com/ySMVfVv7v9
— BIG TV Breaking News (@bigtvtelugu) July 3, 2025