BigTV English

Brahmamudi Serial Today July 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఆఫీసుకు వెళ్లిన కావ్య – ఎంప్లాయీస్‌ ముందు రాజ్‌ ను జీరోను చేసిన కావ్య

Brahmamudi Serial Today July 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఆఫీసుకు వెళ్లిన కావ్య – ఎంప్లాయీస్‌ ముందు రాజ్‌ ను జీరోను చేసిన కావ్య

Brahmamudi serial today Episode:  ఆఫీసులో రాజ్‌ ఎంప్లయీస్‌ను బెదిరిస్తుంటాడు. ఎవ్వరూ భయపడటం లేదని కోప్పడతాడు. ఒక ఎంప్లాయి లోపల భయపడుతున్నాం సార్‌ అని చెబితే మీరెవ్వరూ భయపడటం లేదు. అందుకే మిమ్మల్ని అందర్ని జాబ్‌లోంచి తీసేస్తున్నాను అంటాడు. అప్పుడే కావ్య సూపర్‌ సార్‌ సూపర్‌ అంటూ వస్తుంది. అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు. దీంతో కావ్య ఏంటి అందరూ అలా చూస్తున్నారు. ఓ సార్‌ మిమ్మల్ని ఫైర్‌ చేస్తుంటే.. నేను వచ్చి సూపర్‌ అంటూ క్లాప్స్‌ కొడుతున్నానేంటి అనా..? మీరేం కంగారు పడకండి ఇది నిజమైన ఫైర్‌ చేయడం కాదు. ఉత్తుత్తి ఫైరే అంటుంది. దీంతో రాజ్‌ ఉత్తుత్తి ఫైర్‌ ఏంటి కళావతి గారు నేను నిజంగానే వీళ్లందరినీ ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నాను అంటాడు.


దీంతో కావ్య ఇక మీ పెర్మామెన్స్‌ ఆపండి సార్‌ ఇదంతా ఎంప్లాయీస్‌ను అలెర్ట్‌ చేయడానికి మీరు చేసిన ఫ్రాంక్‌ అని చెప్పండి అంటుంది. దీంతో రాజ్‌ కోపంగా ఏంటి..? ఫ్రాంకా..? అంటాడు. అవును సార్‌ ఫ్రాంకే.. మీరంతా వెళ్లండి అందరూ మీ పని చూసుకోండి వెళ్లండి అని కావ్య చెప్పగానే.. అందరూ వెళ్లిపోతారు. అందరూ వెళ్లాక కావ్య కోపంగా రామ్‌గారు అసలు మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. దీంత రాజ్‌ ఏం చేయడం ఏంటి కళావతి గారు. మీ బాస్‌ అంటే స్టిక్ట్‌ అన్నారు కదా అందుకే అందరిని కంట్రోల్ లో పెడుతున్నాను ఎలా ఉంది మన ఫెర్మామెన్స్‌.. అస్సలు డౌటు రాలేదు కదా అని అడుగుతాడు. దీంతో కావ్య డౌటు కాదు.. కొంచెం లేటుగా వచ్చి ఉంటే.. నా గుండె పగిలిపోయేది ముందు మీరు ఇంటికి పదండి అంటూ రాజ్‌ను అక్కడి నుంచి తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది కావ్య.

రాహుల్‌ ను తీసుకుని ఇంటికి వస్తుంది స్వప్న అప్పుడే కిందకు దిగి వస్తున్న రుద్రాణి కాళ్ల దగ్గర పడేస్తుంది రాహుల్‌ను దీంతో రుద్రాణి కోపంగా ఎంత ధైర్యం ఉంటే కట్టుకున్న మొగుణ్ని అలా తోస్తావు అది నా కళ్ల ముందే అంటూ తిడుతుంది. దీంతో స్వప్న కట్టుకున్న మొగుడు కాబట్టే ఇంటికి తీసుకొచ్చి మీ అందిరి ముందు నిలబెట్టాను. అదే వేరే ఎవరైనా మీ కొడుకు చేసిన పని చేసి ఉంటే అక్కడే చంపేసేదాన్ని అంటుంది. ఇరవై నాలుగు గంటలు నా కొడుకు మీద పడి ఏడవడం తప్పా మీకు వేరే పని లేదా అంటుంది రుద్రాణి. దీంతో స్వప్న మీరు పెద్ద సెలబ్రిటీలు మీ ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడానికి మీద పడుతున్నాము అంటుంది స్వప్న. ఇంతలో ఇంద్రాదేవి అసలు ఏం జరిగిందో ఎందుకు అంతలా అరుస్తున్నావు అని అడుగుతుంది.


దీంతో స్వప్న ఏం జరిగిందో మీ మనవణ్నే అడగండి అమ్మమ్మ ఆ దరిద్రాన్ని నా నోటితో చెప్పాలంటే నాకే అసహ్యంగా ఉంది అంటుంది. రాహుల్ మళ్లీ ఏం చేశావు నువ్వు అని అపర్ణ అడుగుతుంది. ఏముంటుంది వదిన మళ్లీ ఏదో వెధవ పని చేసి ఉంటాడు. దానికి స్వప్నకు కోపం వచ్చి ఉంటుంది అని ప్రకాష్‌ చెప్పగానే.. అనండి అందరూ నా కొడుకునే అనండి ఇంట్లో తిట్టడానికైనా కొట్టడానికైనా తేరగా దొరికేది మేమే కదా..? అంటుంది రుద్రాణి దీంతో స్వప్న నీ కొడుకు ఏం చేశాడో నిజం చెప్తే ఇంట్లో వాళ్లే అందరూ కొడతారు అంటూ స్వప్న నిజం చెప్తుంది. నువ్వు చెబితే నమ్మాలా.? అసలే నీకు నా కొడకంటే కోపం ఉంది..? అంటుంది రుద్రాణి. ఇంతలో అప్పు, రాహుల్‌ లవర్‌ను తీసుకుని వచ్చి ఇది చెబితే నమ్ముతావా..? అంటుంది. ఇంట్లో వాళ్లందరూ షాక్ అవుతారు.

దీనికే రాహుల్‌ నగలన్నీ ఇచ్చారు. ఏంటి అలా చూస్తున్నావు జరిగింది మొత్తం చెప్పు అంటుంది అప్పు. దీంతో అవునండి అప్పు మేడం చెప్పింది నిజమే నేనేం అడగలేదు నేను అందంగా ఉంటానని నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఏడు వారాల నగలు నాకు ఇచ్చాడు అని చెప్తుంది. అప్పుడే వచ్చిన రాజ్‌ చూడ్డానికి ఇన్నోసెంట్‌గా ఉంటాడు కానీ మంచి రసికుడే అంటాడు. కావ్య చాల్లే ఊరుకోండి అంటూ రాజ్‌ను కోప్పడుతుంది. ఇంట్లో అందరూ రాహుల్‌ను తిడతారు. రాహుల్‌ లవర్‌ను తిట్టి వెళ్లగొడతారు. రాజ్‌ మెల్లగా రాహుల్‌ దగ్గరకు వెళ్లి నువ్వు చాలా నాటీ రాహుల్‌.. మేము ఒక్కరితోనే వేగలేకపోతుంటే.. నువ్వు సూపర్‌ అంటూ మాట్లాడుతుంటే.. రాహుల్‌ వెళ్లిపోతాడు. రాజ్‌ కూడా వెళ్లిపోతుంటే.. కావ్య ఈ రోజు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. రాత్రికి మీకు ట్రైనింగ్‌ ఉంది. అని చెప్పి కావ్య పైకి వెళ్లిపోతుంది.

పైకి వెళ్లిన రాహుల్‌ను రుద్రాణి కొడుతుంది. ఇక నువ్వు మారవా..? ఎన్నిసార్లు చెప్పినా వినవా.? అంటూ తిడుతుంది. దీంతో రాహుల్ సారీ మమ్మీ ఇంకోసారి ఇలా చేయను అంటాడు. ఇక చేయడానికి కూడా అవకాశం లేదులే ఇంట్లో చిల్లర పనులు చేస్తూ చిల్లర కోసం ముష్టి ఎత్తు నా కడుపున ఎలా పుట్టావో ఏంటో అంటూ తిట్టి వెళ్లిపోతుంది రుద్రాణి. మరోవైపు రాజ్‌, యామినికి కాల్‌ చేస్తాడు. ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన యామిని పెద్దటి నుంచి ఎక్కడికి వెళ్లిపోయావు బావ. అసలు ఎక్కడున్నావు అని అడుగుతుంది. రాజ్‌ నేను కళావతి గారి ఇంట్లో ఉన్నాను అని చెప్తాడు.

దీంతో యామిని తిట్టుకుంటూ.. అసలు ఎందుకు కాల్‌ చేశావు అని అడుగుతుంది. ఈరోజు  నైట్‌కు నేను ఇంటికి రావడం లేదు. అని చెప్తాడు రాజ్‌. దీంతో యామిని షాక్‌ అవుతుంది. ఆ ఇరిటేషన్‌ను బయటకు వినిపించకుండా నార్మల్‌ గా మాట్లాడుతుంది. ఇంతలో అపర్ణ, ఇంద్రాదేవి వచ్చి ఎందుకు అంతలా మెలికలు తిరిగిపోతున్నావు అని అడుగుతారు. దీంతో రాజ్‌ సిగ్గు పడుతూ కళావతి గారు ఈ రోజు రాత్రంతా నన్ను తనతోనే ఉండమంది అని చెప్తాడు. ఆ మాత్రం దానికే ఇన్ని మెలికలు తిరగాలా…? అంటూ వెటకారంగా మాట్లాడతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Related News

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లి బండారం బయటపెట్టబోతున్న నర్మద.. ధీరజ్ కు షాక్.. నగల గుట్టు బయట పడుతుందా..?

Intinti Ramayanam Today Episode: పల్లవికి వార్నింగ్ ఇచ్చిన భానుమతి.. ప్రణతికి తెలిసిన నిజం.. పెళ్లి ఆగిపోతుందా..?

Nindu Noorella Saavasam Serial Today August 15th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రావును వెళ్లిపోమ్మన్న అమర్‌

Gundeninda GudiGantalu Today episode: మౌనికకు మాటిచ్చిన మీనా.. మనోజ్ ను మోసం చేసిన రోహిణి..ప్రభావతికి షాక్..

Brahmamudi Serial Today August 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌కు కాల్‌ చేసిన ఇంద్రాదేవి – స్వరాజ్‌ను తీసుకొచ్చిన రాజ్‌

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒకటి వేరీ స్పెషల్..

Big Stories

×