Anushka Shetty:అనుష్క శెట్టి (Anushka Shetty).. అలియాస్ స్వీటీ.. ‘సూపర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకుంది. తన అద్భుతమైన నటనతో.. విలక్షణమైన ప్రతిభ కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ‘అరుంధతి’ సినిమాతో ఊహించని స్టార్ డంను సొంతం చేసుకున్న ఈమె.. తాజాగా ‘ఘాటీ’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేసిన చిత్రబృందం.. తాజాగా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఊహించని విషయాలను బయటపెట్టింది అనుష్క.
ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలనుకున్నాను – అనుష్క శెట్టి
ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలనుకున్నాను. కాకపోతే ఆ ఒక్క సినిమా నన్ను మళ్ళీ నిలబెట్టింది అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అనుష్క మాట్లాడుతూ.. “ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎంతో భయపడ్డాను. చదువుకునే రోజుల్లో సినిమాలు పెద్దగా చూడకపోవడంతో.. షూటింగ్ హడావుడి చూసి కంగారు పడిపోయాను. దీంతో సినిమాలు మానేసి యోగా టీచర్ గానే కొనసాగాలని అనుకున్నాను. కానీ నా కెరియర్ ను అరుంధతి సినిమా మలుపు తిప్పింది. ఆ సినిమా నాకెంతో ప్రత్యేకం అంటూ తెలిపింది.
అందుకే బరువు పెరిగాను – అనుష్క శెట్టి
ఇకపోతే “సైజ్ జీరో కోసం ప్రోస్థెటిక్ మేకప్ ద్వారా లావుగా చూపిద్దామని ట్రై చేసినా అది కుదరలేదు. నిజానికి స్క్రీన్ మీద అనుకున్నట్లుగా కనిపించలేదు. దాంతో నేను బరువు పెరుగుతానని డైరెక్టర్ తో చెప్పాను. ఒక యోగ టీచర్ గా బరువు తగ్గడం చాలా కష్టమని తెలిసినా సరే అన్నం, కూరలు తింటూనే 20 కిలోల వరకు బరువు పెరిగాను. మొదట్లో పెద్దగా తేడాగా అనిపించకపోయినా.. పరిగెడుతున్నప్పుడు ఆ ఇబ్బంది ఎదుర్కొన్నాను. ఆ తర్వాత బరువు తగ్గడానికి చాలా కష్టపడ్డాను” అంటూ తెలిపింది.
భోజనంలో అవి తప్పనిసరిగా ఉండాల్సిందే..
భోజనం చేసేటప్పుడు.. అమ్మ చేతి వంట చాలా ఇష్టమని ఇంటి భోజనం లో పప్పు చారు ఒకటి ఉంటే చాలు.. ఇంకేం అవసరం లేదు అని తెలిపింది. అంతేకాదు ఎక్కడపడితే అక్కడ తినడానికి ఇష్టపడను అని కూడా చెప్పుకొచ్చింది అనుష్క.
ఎప్పుడూ అలాంటి సినిమాలు చూడను..
తనకు హార్రర్ సినిమాలు అంటే చాలా ఇష్టమని.. భాగమతి సినిమా చేసినా కూడా తాను ఎప్పుడూ హార్రర్ సినిమాలు చూడను అంటూ కూడా చెప్పుకొచ్చింది అనుష్క.
అనుష్క సినిమాలు..
అనుష్క సినిమాల విషయానికొస్తే .. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటీ సినిమా చేస్తుంది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇక జూలై 4న విడుదల చేస్తారనుకున్నారు కానీ అప్పుడు కూడా ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. కానీ త్వరలోనే విడుదల తేదీన ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమాతో మళ్లీ తన టాలెంట్ నిరూపించుకోవడానికి సిద్ధమైంది అనుష్క శెట్టి. మరి అలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడండి.
ALSO READ: Indian Cinima: ప్రతి ఏటా పైరసీ వల్ల ఎన్ని కోట్లు నష్టపోతున్నారో తెలుసా?