Brahmamudi serial today Episode: రుద్రాణి మెల్లగా కావ్య దగ్గరకు వెళ్లి కూర్చుని మీరెందుకు ఎవ్వరూ కూడా పెళ్లి ఆపడానికి ప్రయత్నించడం లేదని అడుగుతుంది. దీంతో ఇంద్రాదేవి నువ్వు కూడా ఆ ఇంటి నుంచే వచ్చావు కదా నువ్వెందుకు ఆపడానికి ప్రయత్నించడం లేదు అని రుద్రాణిని అడుగుతుంది. నాకంత బలం బలగం లేదు. ఒకవేళ ఉంటే నా కొడుకును ఎప్పుడో ప్రయోజకుణ్ని చేసేదాన్ని అంటుంది రుద్రాణి. ఈ ఒక్క విషయం కరెక్టగా చెప్పావు రుద్రాణి అంటుంది అపర్ణ. అయితే కావ్య కూడా ఎందుకు ఏ ఉలుకు పలుకు లేకుండా హ్యాపీగా కూర్చుని పెళ్లి చూస్తుంది. అసలు అక్కడ జరుగుతుంది నీ మొగుడు పెళ్లేనా..? లేక ఆ యామిని చెప్పిన కట్టుకథను నిజం చేయాలనుకుంటున్నావా కావ్య.. రాజ్‌కు న్యాయం చేసేవాళ్లు ఎవరు..? ఈ పెళ్లి ఆపేవాళ్లు ఎవరు అని అడుగుతుంది రుద్రాణి.
దీంతో కావ్య అసలు నాకు పెళ్లి ఆపాలనే ఉద్దేశమే లేదు రుద్రాణి గారు అని చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. రాహుల్ మరింత షాకింగ్ గా మమ్మీ కావ్య చెప్పింది నిజమేనా లేక నాకు అలా వినిపించిందా..? అని అడుగుతాడు. కావ్య నేను నిజమే చెప్తున్నాను రాహుల్.. మీరు కంగారుపడకండి నేను ఈ పెళ్లిని అస్సలు ఆపను. కానీ ఈ పెళ్లి జరగదు. అని చెప్పగానే రుద్రాణి, రాహుల్ కన్పీజ్‌గా చూస్తుంటారు.. అసలు ఏమంటున్నావు కావ్య పెళ్లి ఆపను.. అంటున్నావు.. పెళ్లి జరగదు అంటున్నావు అసలు ఏం జరుగుతుంది కావ్య అని రుద్రాణి అడగ్గానే.. కావ్య తన బ్రహ్మముడి పురాణం మొదలు పెడుతుంది. ఇంతలో కళ్యాణ్, అప్పుకు సైగ చేయగానే.. ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు. పంతులు మంత్రాలు చదువుతూ అక్షింతలు పంచాలి ఎవరైనా ఇటు రండి అని పిలవగానే ఒకరు వెళ్లి అక్షింతలు తీసుకుని పంచుతారు. అక్షింతలు పంచాక పంతులు తాళి తీసి రాజ్‌కు ఇచ్చి బాబు మాంగళ్య ధారణ కానివ్వండి అని చెప్తాడు.
రాజ్ తాళి తీసుకుంటాడు. అపర్ణ, ఇంద్రాదేవి, కనకం కంగారు పడుతుంటారు. రాజ్, కావ్యను చూస్తుంటే.. పంతులు బాబు అలా తాళి ఎంతసేపని పట్టుకుంటావు నాయన మాంగళ్యధారణ కానివ్వు అని చెప్తాడు. రాజ్ లేచి తాళి కట్టబోతుంటే.. పోలీసులు ఎంట్రీ ఇస్తారు. పోలీసులను చూసిన రుద్రాణి అదిగోరా పోలీసులు వచ్చారు అని రాహుల్‌కు చెప్తుంది. దీంతో రాహుల్ ఇంకేంటి మమ్మీ లేటు మన వాళ్లకు సఫోర్ట్ చేస్తున్నట్టుగా నీ యాక్టింగ్ స్టార్ట్ చేయ్ అని చెప్తాడు. రాజ్ తాళి కట్టబోతుంటే.. రుద్రాణి కోపంగా ఆపండి అంటూ అరుస్తుంది. అందరూ షాక్ అవుతారు. చిరాకుగా పంతులు అవ్వదు ఈ పెళ్లి ఇక అవ్వదు.. ఈ పెళ్లి ఆపడానికి ఇప్పటి వరకు కనకమే ఉంది అనుకున్నా ఇప్పుడు కొత్త క్యారెక్టర్ వచ్చింది. పెళ్లి ఆపడానికి అని మనసులో అనుకుంటాడు.
అపర్ణ కూడా ఇదేంటి అత్తయ్యా మనం చెప్పాల్సిన డైలాగు రుద్రాణి చెప్పింది ఏంటి..? అని అడుగుతుంది. ఇంద్రాదేవి కూడా నాకు అదే అర్థం కావడం లేదు అపర్ణ అంటుంది. ఇంతలో వైదేమి లేచి ఏమైంది అపర్ణ ఎందుకు ఆపాలి అని అడుగుతుంది. దీంతో రుద్రాణి పెళ్లి మండపం అంటే ముత్తైదువులు రావాలి కానీ ఇలా పోలీసులు ఎందుకు వస్తున్నారు అని అడుగుతుంది. ఇంతలో పోలీసులు మండపం దగ్గరకు వస్తారు. అందరూ షాక్ అవుతారు. పోలీసులు వచ్చి యామినిని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్తారు. ఎందుకని వైదేహి అడగ్గానే.. కానిస్టేబుల్ జరిగింది మొత్తం చెప్తాడు. అప్పు కూడా జరిగింది మొత్తం చెప్పి రఘును లోపలికి తీసుకురండి అని చెప్పగానే.. పోలీసులు రౌడీని లోపలికి తీసుకొస్తారు. జరిగింది మొత్తం చెప్పు అని అప్పు అడగ్గానే రౌడీ ఏం చెప్పాలి మేడం అని అడుగుతాడు.
మా అక్కను చంపమని కావ్య నీకు కోటి రూపాయలు ఇచ్చిన విషయం చెప్పు అంటుంది. ఏ యామిని మేడం అని అడుగుతాడు. దీంతో అప్పు షాక్ అవుతుంది. గట్టిగా అరుస్తూ రౌడీని బెదిరించినా… వాడు అబద్దం చెప్తాడు. దీంతో అప్పు నా దగ్గర వీడియో ఉందని ఫోన్ ఓపెన్ చేసి వీడియో చూపించబోతే అందులో వీడియో డిలీట్ అయి ఉంటుంది. ముందు రోజు రాత్రి రుద్రాణి, రాహుల్ కలిసి వీడియో డిలీస్ చేసి ఉంటారు. యామిని కోపంగా అప్పును తిడుతుంది. ఎక్కడుంది వీడియో అని అడుగుతుంది. రాజ్ కోపంగా అప్పు ఏంటి ఇదంతా అంటూ నిలదీస్తాడు. అప్పు సైలెంట్‌గా ఉంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?