OTT Movie : హారర్ సినిమాలు ఇప్పుడు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సినిమాలు కూడా మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తునాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా క్లాస్ట్రోఫోబిక్ హారర్, ఆర్కియాలజికల్ థ్రిల్లర్ , సర్వైవల్ డ్రామా ఎలిమెంట్స్ శైలిలో తెరకక్కింది. చివరివరకూ ఉత్కంఠభరితంగా ఈ స్టోరీ నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ ఫ్రెంచ్ హారర్-అడ్వెంచర్ మూవీ పేరు ‘ది డీప్ డార్క్’ (The Deep Dark). 2023లో విడుదలైన ఈ సినిమాకి మాథ్యూ తురి దర్శకత్వం వహించారు. ఇందులో సామ్యూల్ లే బిహాన్ (రోలాండ్), అమీర్ ఎల్ కాసెమ్ (అమీర్), జీన్-హగ్స్ ఆంగ్లాడ్ (ప్రొఫెసర్ బెర్తియర్), థామస్ సోలివెర్స్, డియెగో మార్టిన్, బ్రూనో సాంచెస్ వంటి నటులు నటించారు. 1956లో ఫ్రాన్స్‌లోని ఒక బొగ్గు గనిలో ఈ స్టోరీ మొదలవుతుంది. ఇది ఒక రక్తపిపాసి జీవిని ఎదుర్కునే గని కార్మికుల చుట్టూ తిరుగుతుంది. 2023 నవంబర్ 15న ఫ్రాన్స్ థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. 1 గంట 43 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి, IMDbలో 5.6/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా Amazon Prime Video, Jio hot star, Airtel Xstream లలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
సినిమా 1856లో ఒక బొగ్గు గనిలో జరిగిన విషాదకరమైన పేలుడుతో ప్రారంభమవుతుంది. ఈ ప్రమాదం 27 మంది గని కార్మికుల మరణానికి దారితీస్తుంది. వీళ్ళంతా ఒక ఆర్కియాలజికల్ డిస్కవరీ చేసిన తర్వాత, ఒక భయంకరమైన జీవిని ఎదుర్కొంటారు. ఆతరువాత ఈ దుర్ఘటన జరుగుతుంది. ఇది జరిగిన 100 సంవత్సరాల తర్వాత, 1956లో ఫ్రాన్స్‌లోని “డెవిల్స్ ఐలాండ్” లో ఉన్న ఒక ప్రమాదకరమైన బొగ్గు గనిలో స్టోరీ కొనసాగుతుంది. మొరాకో నుండి వచ్చిన అమీర్ అనే ఒక గని కార్మికుడు, ఆర్థిక అవసరాల కారణంగా ఈ గనిలో పని చేయడానికి వస్తాడు. అతను రోలాండ్ నేతృత్వంలో, ఒక గని కార్మికుల బృందంలో చేరతాడు. వీళ్ళు ప్రొఫెసర్ బెర్తియర్ అనే ఒక ఆంత్రోపాలజిస్ట్‌ను, గనిలోని లోతైన పొరలలో నమూనాలను సేకరించడానికి తీసుకెళ్లాలని ఆదేశించబడతారు. ఫ్యాక్టరీ బాస్ ఫౌసియర్ ఈ మిషన్‌కు ఆకర్షణీయమైన బోనస్‌ను కూడా ఆఫర్ చేస్తాడు.
గని కార్మికులు ప్రొఫెసర్ తో కలిసి గనిలోపలికి దిగుతారు. వీళ్ళు శతాబ్దం క్రితం జరిగిన ప్రాంతంలోనే తవ్వకాలు మొదలుపెడతారు. అక్కడ వీళ్ళు ఒక రహస్యమైన క్రిప్ట్‌ను కనిపెడతారు. ఇది పురాతన నాగరికతకు చెందిన ఆనవాళ్లతో ఉంటుంది. అది ఒక భయంకరమైన, రక్తపిపాసి జీవని తరువాత తెలుస్తుంది. ఎముకలతో కూడిన ఒక భయంకర రూపంతో ఇది ఉంటుంది. ఆ తరువాత స్టోరీ భయంకరంగా మారుతుంది.ఒక రాక్‌ఫాల్ కారణంగా గని కార్మికులు గనిలో చిక్కుకుంటారు. బయటికి తిరిగి వెళ్లే మార్గం మూసుకుపోతుంది. ఈ క్లాస్ట్రోఫోబిక్ వాతావరణంలో, వీళ్ళంతా ఆ భయంకరమైన జీవికి ఒక్కొక్కరిగా బలవుతుంటారు. అమీర్ ఇప్పుడు మిగిలిన గని కార్మికులను కాపాడే ప్రయత్నం చేస్తాడు. చివరికి వీళ్ళు ప్రాణాలతో బయట పడతారా ? ఆ జీవికి బలి అవుతారా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ ఫ్రెంచ్ హారర్-అడ్వెంచర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : అమ్మాయిలు ఆ అపార్ట్మెంట్లో అడుగు పెడితే నరకమే… రెంట్‌కి ఉండాలంటే ప్రాణాలు వదులకోవాలి