E-Paper
Advertisement

Brahmamudi Serial Today June 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అడవిలో తప్పిపోయిన రాజ్‌ – ఒంటరిదైన కావ్య

Brahmamudi Serial Today June 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అడవిలో తప్పిపోయిన   రాజ్‌ –  ఒంటరిదైన కావ్య
Advertisement

Brahmamudi serial today Episode:  కావ్య, రాజ్‌లను అడవిలో రౌడీలు వెతుక్కుంటూ వెళ్తుంటారు. మరోవైపు వారికోసం పోలీసులతో కలిసి అప్పు అడవి దగ్గరకు వస్తుంది. కావ్య నడవలేక రామ్‌ గారు బయటకు వెళ్లే దారి చూడొచ్చు కదా అని అడుగుతుంది. దీంతో వెరీ సింపుల్ కళావతి గారు ఇలా స్ట్రెయిట్‌ గా నడుచుకుంటూ వెళ్లిపోవడమే అని చెప్తాడు. నడుకుకుంటూ వెళ్తే దారి వస్తుందా అని కావ్య అడుగుతుంది. నడుచుకుంటూ దారి వస్తుందో లేదో తెలియదు కానీ ఏదో ఒక ఊరు మాత్రం కచ్చితంగా వస్తుంది అని రాజ్‌ చెప్పగానే.. అది నాకు తెలియదా..? అంటుంది కావ్య. ఇంతలో రాజ్‌ తొండను చూసి భయపడతాడు. దీంతో కావ్య నవ్వుతుంది. కొద్ది దూరం నడిచాక కావ్య ఇక నా వల్ల కాదండి అంటుంది. మనం అనవసరంగా దారి వెతుక్కుంటూ కష్టపడటం కన్నా ఇక్కడే ఉండిపోతే అంటాడు రాజ్‌.

దీంతో కావ్య ఏంటి ఇక్కడే ఉండిపోతారా..? అని అడుగుతుంది. దీంతో రాజ్‌ ఉంటే తప్పేంటండి ఆ సిటీలో పొల్యూషన్‌ మధ్యలో ఉండటం కన్నా ఇలా నేచర్‌ మధ్యలో ఉంటే ఎంత బాగుందో తెలుసా..? ఆ సీతారాముల్లా మనం ఒక గుడిసె వేసుకుని ఇక్కడే ఉండిపోదాం అండి చాలా బాగుంటుంది అంటాడు రాజ్‌. అయితే మంచిది రామ్‌ గారు మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్లిపోతాను అంటుంది కావ్య. దీంతో రాజ్‌ ఏవండి సీత లేకుండా రాముడు ఎలా ఉంటాడండి అంటాడు. మీకోసం సూర్పనక్క వస్తుందిలేండి నేను వెళ్తున్నాను. అంటూ కావ్య వెళ్తుంది. రాజ్‌ కూడా వెళ్లిపోతాడు. కొద్ది దూరం వెళ్లాక కావ్య దాహంగా ఉంది ఎక్కడైనా మంచినీళ్లు ఉంటే ఇవ్వండి అని అడుగుతుంది. రాజ్‌ వెళ్లి వెతికి ఆకులో నీళ్లు తీసుకుని వస్తాడు. కళావతి గారు ఇదిగోండి వాటర్‌.. అంటూ నీళ్లు కావ్య ఇస్తాడు. నీళ్లు తాగిన కావ్య ఎమోషనల్‌ అవుతుంది. మీరు తాగండి అని చెప్తుంది. మీకు దాహం తీరిందా అని అడుగుతాడు.  తీరింది మీరు తాగండి అని చెప్పగానే రాజ్‌ వాటర్‌ తాగుతుంటే రౌడీలు వస్తారు.

Advertisement

వాళ్లను చూసి కావ్య, రాజ్‌ మళ్లీ పరుగెడతారు. రౌడీలు వెనకాలే తరుముతుంటారు. ఇంతలో రౌడీకి యామిని ఫోన్‌ చేస్తుంది. చెప్పండి మేడం అని రౌడీ అడగ్గానే యామిని కోపంగా నేను చెప్పడం ఏట్రా ఇడియట్‌.. ఇంతకీ ఆ కావ్య పని ఫినిష్‌ అయిందా లేదా..? అని అడుగుతంది. దీంతో రౌడీ ఇక్కడ మీరు అనుకున్నట్టుగా ఏదీ జరగడం లేదు మేడం అని చెప్తాడు. దీంతో ఏమైంది అని యామిని అడుగుతుంది. మనం అనుకున్నట్టుగానే ఆ కావ్యను తిట్టాను కానీ రాజ్‌ ఏమీ అనకుండా కావ్యతో కలిసి వెళ్లిపోయాడు. అడవిలోకి వచ్చేశారు. వెనకాలే మేము వచ్చాము. అంటూ జరిగింది చెప్తాడు. సరే పని అయ్యాక నాకు ఫోన్‌ చేయ్‌ అని  యామిని కాల్‌ కట్‌ చేస్తుంది.

తర్వాత చీకటి పడుతుంది. సెల్‌ఫోన్‌ లైట్‌ వేసుకుని కావ్య, రాజ్‌ వెళ్తుంటారు. ఏవండి ఈ చీకటిలో నడవాలంటే నాకు భయం వేస్తుందండి మీకు భయంగా లేదా..? అని అడుగుతుంది. దీంతో రాజ్‌ నేను ఏమైనా రోజూ అడవిలో తిరుగుతున్నానా..? ఏంటి..? ధైర్యంగా ఉండటానికి అంటాడు రాజ్‌. ఆ రౌడీలు మళ్లీ వస్తారని భయపడుతున్నారా..? అని కావ్య అడుగుతుంది. దీంతో రాజ్‌ వాళ్లకన్న ముందు ఏ పులి ఎటునుంచి వస్తుందోనన్న ఆలోచిస్తున్నానండి అని రాజ్‌ చెప్పగానే కావ్య భయపడుతుంది. మరోవైపు రౌడీలు కూడా సెల్‌ఫోన్‌ టార్చీ వేసుకుని వెతుకుతుంటారు. ఇంతలో కావ్య వాళ్ల కారు దగ్గరకు అప్పు వస్తుంది. అక్కడి నుంచి టార్చీ వేసుకుని కానిస్టేబుల్స్‌ తో కలిసి అప్పు కూడా అడవిలోకి వెళ్తుంది. మరోవైపు కావ్య పక్కన ఉన్న రాజ్‌ కనిపించకుండా పోతాడు కావ్య భయంతో ఏడుస్తుంది.

Advertisement

వెనక నుంచి రాజ్‌ వచ్చి కళావతి గారు నేను ఇక్కడున్నాను అని పిలవగానే.. కావ్య కోపంగా దగ్గరకు వెళ్లి ఎక్కడికి వెళ్లిపోయారండి మీరు నేను ఎంత భయపడ్డానో తెలుసా..? అలా ఆడపిల్లను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతారా..? ఏమనుకుంటున్నారు మీరు ఎక్కడికి వెళ్లిపోయారు మీరు అంటూ కొడుతుంది. దీంతో రాజ్‌ ఆకలి వేస్తుంది అన్నారు కదా..? ఏదైనా తీసుకొద్దామని వెళ్లాను. ఇందాక మంట అడిగారు కదా ఇదిగోండి ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు మీ ఇంట్లో వాళ్లు అలాంటిది మీరు ఆకలి అనే సరికి నాకు చాలా బాధ అనిపించింది అండి ఇదిగో తీసుకో.. కావ్య అలాగే చూస్తుంది పోతుంది. హలో మేడం గారు మీకే తీసుకోండి అని తను తీసుకొచ్చిన ఫ్రూట్స్‌ ఇస్తాడు రాజ్‌. ఇద్దరూ కలిపి ఫ్రూట్స్‌ తింటుంటారు. ఇంతలో ఇద్దరికి కళ్లు తిరుగుతాయి.. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Related News

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Big Stories

Advertisement
×