E-Paper
Advertisement

Brahmamudi Serial Today march 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ఫోన్ పగులగొట్టిన రాజు

Brahmamudi Serial Today march 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ఫోన్ పగులగొట్టిన రాజు
Advertisement

Brahmamudi serial today Episode: ఇందు, ఐశ్వర్య గొడవ పడటం చూసిన అపర్ణ లోపలికి వెళ్లి సుభాష్‌ దగ్గర బాధపడుతుంది. రేఖ, రుద్రాణి కంటే ఘోరంగా తయారయింది. ఐశ్వర్యను తన లాగే పెంచుతుంది. అని చెప్పగానే.. అలా చేయకపోతే ఆశ్చర్యపోవాలి కానీ చేస్తే ఎందుకు ఆశ్చర్యపోవాలి అంటూ ఓదారుస్తాడు సుభాష్‌.. అపర్ణ మాత్రం బాధగా ఇది ఇలాగే కొనసాగితే ఆ రేఖ, భ్రమరాంబతో పాటు ఐశ్వర్య కూడా ఇందుకు ఒక కొత్త శత్రువులా మారుతుందండి.. ఈరోజు అంటే మనం ఉన్నాం రేపు ఏదైనా జరగొచ్చు.. పాపం అప్పుడు ఇందు ఒక్కతై పోతుంది.. ఇంత మంది శత్రువుల మధ్య నిలబడి ఎలా పోరాడగలుగుతుంది. ఎలా బతకగలుతుంది అని ఎమోషనల్‌ అవుతుంటే.. సుభాష్‌ మాత్రం మనం ఏం చేయగలం అపర్ణ లేవలేని పరిస్థితుల్లో నేనున్నాను.. ఎదురించలేని పరిస్థితుల్లో నువ్వున్నావు.. అని చెప్పగానే..

అపర్ణ బాధగా మనతో పని లేకుండా ఇందుకే వాళ్లను ఎదురించే శక్తి వస్తే.. అని చెప్పగానే.. సుభాష్‌ అర్థం కాలేదు అపర్ణ అంటాడు. దీంతో అపర్ణ ఈ ఆస్థి, ఫ్యాక్టరీలు.. ఎలాగూ ఇందు పేరు మీదే ఉన్నాయి. కొన్ని రోజుల్లో అవి తనకు ఎలాగూ సొంతం అవుతాయి అని చెప్పగానే.. సుభాష్‌ ఆ రేఖ జరగనిస్తుందా..? అపర్ణ అని అడుగుతాడు. దీంతో అపర్ణ అలా జరగాలి అంటే ఇన్నేళ్లుగా మన ఆస్థులకు పవర్ ఆఫ్‌ పటార్నిగా ఉన్న రేఖను తప్పించాలి. ఆ భాద్యతలను ఇందుకు అప్పగించాలి. ఇందు ఇప్పుడు చిన్న పిల్ల కాదు.. ఎవరితో ఎలా నడుచుకోవాలో.. ఎవరు ఎలాంటి వారో బాగా తెలుసు.. ఆస్థి వచ్చే రోజు ఆ రేఖ ఎటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఉండాలి అంటే.. ఈ పవర్‌ ఆఫ్‌ ఆటార్నీ ఇందు చేతిలో ఉండటమే మంచిది అని చెప్పగానే..

Advertisement

సుభాష్‌ నీ ఆలోచన బాగానే ఉంది కానీ ఈ విషయం రేఖకు తెలిస్తే ఏం చేస్తుందో అని భయంగా ఉంది అపర్ణ అంటాడు. దీంతో అపర్ణ ఇలా భయపడుతూ కూర్చుంటే.. ఆ రేఖ అనుకున్నది చేసేస్తుంది అండి అని చెప్పగానే.. సుభాష్‌ నా భయం ఆ రేఖ మనకేదే చేసేస్తుంది అని కాదు.. మన ఇందును ఏమైనా చేస్తుందోమోనని భయంగా ఉంది అపర్ణ అంటాడు. దీంతో అపర్ణ ఆ భయం ఇప్పుడు కూడా ఉందండి కానీ ఒక్కసారి ధైర్యం వేసి కోర్టులో కేసు వేశామంటే తప్పకుండా పవర్‌ తిరిగి ఇందు చేతుల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఈ రేఖ ఒక చచ్చిన పాముతో సమానం.. అని చెప్పగానే.. సుభాష్‌ సరే అపర్ణ అలాగే కానివ్వు.. ఇందుకు మంచి జరుగుతుందంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను.. అని చెప్పగానే.. అపర్ణ సరేనండి అయితే ఈరోజే వెళ్లి లాయరును కలుస్తాను.. అని చెప్పగానే.. సుభాష్‌ సరే ఇందు జాగ్రత్త       అని చెప్పగానే.. అపర్ణ వెళ్లిపోతుంది.

తర్వాత ఇందు శివరాం ఇంట్లో వంట చేయడానికి వెళ్తున్నానని ఇంటర్వ్యూకు వెళ్తుంటుంది. భ్రమరాంబ అనుమానంగా ఇందు అనుమానిస్తుంది. బ్యాగ్‌ చెక్‌ చేస్తుంటే.. శేషు వచ్చి ‌భ్రమరాంబను తిడతాడు. దీంతో బ్యాగ్‌ ఇందుకు ఇచ్చేస్తుంది. ఇందు వెళ్లిపోతుంది. శివరాం ఇంటికి వెళ్లి థాంక్స్‌ చెప్పి ఇంటర్య్వూకు వెళ్తుంది. రోడ్డు మీద నడుస్తున్న ఇందుకు బైక్‌ మీద వచ్చిన రాజు డాష్‌ ఇస్తాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. దీంతో ఇందు పోలీస్‌ స్టేషన్‌ లో కంప్లైంట్‌ ఇస్తానని చెప్తుంది. దీంతో రాజు, లక్కీ భయపడి సారీ చెప్తారు. సారీ చెప్పడం కాదు నా ఫోన్‌ పగిలిపోయింది ఎలా అని ఇందు అడగ్గానే.. రాజు, లక్కీ ఇద్దరూ కలిసి ఇందును తీసుకుని సెల్‌షాపుకు వెళ్లి ఇందు ఫోన్ బాగు చేయిస్తుంటారు.. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×