Ugadi Festival: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో కొత్త ఆశలు, సరికొత్త ఆలోచనలతో ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొని ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు.
ఉగాది పండగ.. తెలుగు ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి, చంద్రబాబు శుభాకాంక్షలు
ఉగాది షడ్రుచుల మాదిరిగానే జీవితంలోని సుఖదుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలని కోరారు. ప్రకృతి పునరుజ్జీవానికి సంకేతమైన ఈ శుభదినాన్ని ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. అలాగే నూతన సంవత్సరంలోకి కొత్త ఆశలు, సరికొత్త ఆలోచనలతో ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొని ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు.
అటు ఏపీ సీఎం చంద్రబాబు తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పర్వదినం నేపథ్యంలో నూతన సంవత్సరంలో అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఎక్స్‌లో రాసుకొచ్చారు. తాము తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు వెళ్లాలనన్నారు. షడ్రుచుల సమ్మేళనం, పరవశింప చేసే వసంతకాల ఆగమనం, అన్నింటినీ మించిన ఆనందం, భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరి జీవితాల్లో కొత్త వెలుగు తీసుకురావాలని ఆకాంక్ష
మీరు, మీ కుటుంబ సభ్యులంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, మీ ఆశలు, ఆకాంక్షలు తీరి, జీవన సాఫల్య ప్రయోజనాలు సిద్ధించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. పేదరికం లేని సమ సమాజ నిర్మాణం కోసం మనం తలపెట్టిన పీ4 తో బాటు, వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందరూ అందిపుచ్చుకుని పురోగమించాలన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 విజయవంతంగా ముందుకు సాగాలని రాసుకొచ్చారు.
తెలుగు వారందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఉగాది శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. నకారాత్మక ఆలోచనలకు పరాభవంగా మారాలని, సకారత్మక విధానాలకు ప్రాభవంగా వర్థిల్లాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని ఎక్స్‌లో పోస్టు చేశారు.
ALSO READ: భార్యాభర్తల వివాదం.. పిల్లల డీఎన్ఏ టెస్ట్, ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
ఉగాది రోజు తీసుకునే ఆరు రుచుల ఉగాది పచ్చడి… జీవితంలో కష్ట సుఖాలకు, గెలుపోటములకు సంకేతమన్నారు. అన్నింటినీ సమంగా స్వీకరించి, జీవితంలో విజయాలు సాధించాలని సందేశాన్నిచ్చే ఈ పండుగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆర్థం చేసుకుని, ఆదర్శనీయంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.
తెలుగు ప్రజల సంప్రదాయం, సంస్కృతికి ప్రతీక.. శ్రీ పరాభవ నామ ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సరం కొత్త ఆశలు, సరికొత్త ఆలోచనలతో ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొని ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు,… pic.twitter.com/Jgfh2dCwqn
— Telangana CMO (@TelanganaCMO) March 18, 2026
షడ్రుచుల సమ్మేళనం, పరవశింపచేసే వసంతకాల ఆగమనం, అన్నింటినీ మించిన ఆనందం, భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు, మీ… pic.twitter.com/0gfJapsDzU
— N Chandrababu Naidu (@ncbn) March 18, 2026
తెలుగు వారందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఉగాది శుభాకాంక్షలు.
ఈ పరాభవ నామ సంవత్సరం నకారాత్మక ఆలోచనలకు పరాభవంగా మారాలని, సకారత్మక విధానాలకు ప్రాభవంగా వర్థిల్లాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను.ఈ ఉగాది నాడు సేవించే ఆరు రుచుల ఉగాది పచ్చడి… జీవితంలో కష్ట సుఖాలకు, గెలుపోటములకు… pic.twitter.com/VRBuR0wpvA
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) March 18, 2026
ఉగాది పండుగను ఆనందంగా జరుపుకోండి! pic.twitter.com/cSTLRBSu3R
— Narendra Modi (@narendramodi) March 19, 2026