Youth Movie OTT : ఈ రోజు ఒక తమిళ టీనేజ్ డ్రామా థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ఒక యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా అలరించబోతోంది. ‘అసురన్’, ‘వాతి’ వంటి చిత్రాలలో కనిపించిన కెన్ కరుణాస్ ‘యూత్’ (Youth) చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ఆయనే కథ, దర్శకత్వం కూడా వహించారు. 2002లో విజయ్ నటించిన హిట్ సినిమా ‘యూత్’ టైటిల్‌ను ఈ సినిమాకు పెట్టడం విశేషం. ఇక ఈ సినిమా థియేటర్లలో అడుగుపెట్టకముందే స్ట్రీమింగ్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సొంతం చేసుకుంది.
తమిళ యువ నటుడు కెన్ కరుణాస్ కథానాయకుడిగా పరిచయమవుతూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘యూత్’ (Youth). ఈ చిత్రం తమిళంలో మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. ఇక తెలుగు వెర్షన్ మార్చి 26న థియేటర్లలోకి రానుంది. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని పార్వతి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించగా, తెలుగులో E2C టాకీస్ బ్యానర్‌పై హౌస్‌ఫుల్ వినీత్, సందీప్ విడుదల చేస్తున్నారు. కెన్ కరుణాస్ సరసన అనిష్మా అనిల్ కుమార్, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘యూత్’ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో దీని ఆట ముగిసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ (Netflix) ప్లాట్‌ఫామ్ ఈ చిత్రాన్ని పలు భాషల్లో విడుదల చేయనుంది. అధికారిక తేదీ ఇంకా ప్రకటించనప్పటికీ, ఏప్రిల్ నెలాఖరులో ఈ స్ట్రీమ్ అవుతుందని భావిస్తున్నారు.
ప్రవీణ్ అనే ఒక యువకుడి చుట్టూ తిరిగే ఈ కథలో, అతను తన వయసున్న ఇతర అబ్బాయిలలాగే సాధారణంగా ఎలా ఉంటాడో మనకు చూపించారు. ప్రవీణ్ అనే ఈ 15 ఏళ్ల టీనేజ్ అబ్బాయి మిగతా కుర్రాళ్లలాగే, తన స్కూల్లోనే నిజమైన ప్రేమను పొందాలని కోరుకుంటాడు. స్కూల్ ముగిసేలోపు దానిని సాధించాలని గోల్ పెట్టుకుంటాడు. చదువు కంటే ప్రేమకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాడు ఈ పోరడు. ఐఏఎస్ కావాలనే పేరెంట్స్ తాపత్రయ పడుతుంటే, ఇతను మాత్రం అమ్మాయిల వెంట పడుతుంటాడు. ఇక కథలో ముగ్గురు అమ్మాయిలు ఎంట్రీ స్తారు. వీళ్ళంతా ప్రవీణ్ పట్ల ఇష్టం పెంచుకుంటారు. ఇక ఈ యువరక్తం కూడా ముగ్గురిలో నలిపోతాడు. చివరికి ప్రవీణ్ ముగ్గురిలో ఎవరిని ఎంచుకుంటాడు ? తల్లి దండ్రుల కలను నెరవేరుస్తాడా ? ఈ కథ క్లైమాక్స్ ఏమిటి అనే విషయాలను, ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : అనంత సముద్రంలో అదిరిపోయే సాహసం… 16 ఏళ్ల అమ్మాయి ఏడు నెలలు ఒంటరిగా…