Illu Illalu Pillalu Today Episode March 24th : నిన్నటి ఎపిసోడ్ లో.. వేదవతి గదిలోకి వెళ్లి బాధపడిపోతూ ఉంటుంది. ఆ వల్లికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది.. బాగా ఆలోచించి నేరుగా వెళ్లి వల్లిని అడిగి అన్ని బయట పెట్టాలి అని వేదవతి లేచి వెళ్లబోతుంది. తన అంతరాత్మ తనని పిలిచి నువ్వు అలాంటి పని చేస్తే తాను ఇంకా తప్పులు చేస్తూ పోతుంది. నువ్వు నీ పెద్ద కోడలు గురించి అందరికీ బయట పెడితే నీ భర్త రామరాజు తట్టుకుంటాడా? తను ఏరి కోరి ఎంతో ఇష్టపడి కోడలుగా తెచ్చుకున్న అమ్మాయి ఇలా చేసిందంటే తట్టుకోగలడా ఆలోచించు అని వేదవతికి తన అంతరాత్మ చెబుతుంది.. ఇక తర్వాత నీకు ఇది నిజం తెలిసింది అని బయట పెట్టకుండా ఆ వల్లికి బాధ అంటే ఏంటో చూపించు అని అంతరాత్మ చెప్తుంది.. వెధవతికి నిజం తెలిసిపోతుంది. వల్లికి ఆ నిజం తెలిసింది అని తెలియకుండా చుక్కలు చూపించాలని అనుకుంటుంది. నర్మదా ప్రేమలో వల్లి వాయిస్ రికార్డ్ ని వినిపించి వల్లిని ఒక ఆట ఆడుకుంటారు. ఇక వేదవతి వల్లికి దెయ్యం పట్టింది అని చీపురుతో బాధపడేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రేమ నర్మదలు ఆ వల్లిని చూసి తెగ నవ్వేసుకుంటూ ఉంటారు. ఇకమీదట టార్చర్ ఏంటో వల్లికి చూపించాలి అని అనుకుంటారు. తను బ్రతికినంత కాలం మనల్ని గుర్తు తెచ్చుకొని గుక్క పట్టి ఏడుస్తుంది అని ప్రేమ నర్మద ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇద్దరు కూడా వల్లిని ఎంత బాగా ఏడిపించాము అని నవ్వేసుకుంటూ ఉంటారు. అత్తయ్య దెయ్యం పట్టిందని చీపురుతో బాధింది కదా అది మాత్రం హైలెట్ అని ప్రేమ అంటుంది. ఇద్దరూ కలిసి చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉండగా ప్రేమకి కడుపులో నొప్పి వస్తుంది.. ఏమైంది ప్రేమ ఇంత సడన్గా ఇలా మారిపోయావ్ ఏంటి అని నర్మదా అడుగుతుంది.. రెండు రోజుల నుంచి నేను ఏమి తినలేదు అక్క అందుకే నాకు కడుపులో నొప్పి వస్తుంది.. ధీరజ్ నాతో మాట్లాడకపోతే నాకు ఏదోలా ఉంటుంది అందుకే తినబుద్ధి కావడం లేదు అని ప్రేమ అంటుంది..
వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం విన్నా వేదవతి ప్రేమకు భోజనం కోసమని లోపలికి వెళుతుంది. ఇక లోపలికి వెళ్ళిన ధీరజ్తో నర్మదా ఆగు ధీరజ్ఎన్ని రోజులు ఇలానే ఉంటావు అని అడుగుతుంది.. నువ్వు ఎప్పటికీ ఇలానే ఉంటావా ఏంటి నువ్వు మాట్లాడలేదని బాధతో తను రెండు రోజుల నుంచి అన్నం కూడా తినలేదు అని నర్మద ఎంత చెప్తున్నా సరే.. ధీరజ్ మాత్రం అమూల్య విషయంలో తను చేసింది తప్పే అని అంటాడు. నా చెల్లెలు విషయంలో తను చేయాలనుకున్న పని చూసి నాకు చాలా కోపంగా ఉంది తనని చూస్తుంటే అసహ్యం కూడా వేస్తుంది అని ధీరజ్ అంటాడు..
అమూల్య ప్రాణాలు కాపాడ్డానికి మన ఇంటి పరువు ని కాపాడ్డానికి ప్రేమ అలా చేసిందన్న విషయాన్ని నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు.. అని నర్మద ఎంత చెప్తున్నా సరే ధీరజ్ మాత్రం అసలు వినకుండా ఈ విషయాన్ని నాకు ఎప్పుడో చెప్పాల్సింది కదా.. అనేసి ధీరజ్ సీరియస్గా వెళ్ళిపోతాడు.. వేదవతి భోజనం తీసుకురావడం చూస్తున్న ధీరజ్ ముసలి కన్నీరు చూసి మోసపోవద్దమ్మా అని అంటాడు.. డ్రామాలను చూసి నువ్వు ఇంకా మోసపోతున్నావని వేదవతి తో అంటాడు. అరే చిన్నోడా నువ్వు నిజంగానే అపార్థం చేసుకుంటున్నావురా అని అనగానే ధీరజ్ మాత్రం నన్ను మోసం చేస్తూనే ఉంటే.. ఎలా నేను అపార్థం చేసుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ధీరజ్ మాట్లాడలేదని బాధతో ఏడుస్తున్న ప్రేమ దగ్గరికి వేదవతి భోజనం తీసుకుని వస్తుంది. మీరిద్దరూ ఇంతగా బాధపడడానికి కారణం ఆవల్లి దాన్ని నేను అసలు వదిలిపెట్టను అని వేదవతి అంటుంది.. ఏంటే ఇది వాడికి ప్రేమ వస్తే ఆపుకోలేడు అలాగే బాధ వస్తే మాత్రం అస్సలు ఊరుకోలేడు వాడు ఆవేశం గురించి నీకు తెలిసిందే కదా అని వేదవతి అంటుంది. అమూల్య విషయంలోనే వాడిలా మారాడు లేకపోతే వాడు చాలా మంచి వాడిని నీకు తెలియదా అని వేదవతి అంటుంది.. మీరు అబద్ధం చేసుకుంటారని అనుకున్నాను అత్తయ్య నన్ను అర్థం చేసుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అని ప్రేమ అంటుంది..
నేను మీకు అత్తని కాదు అమ్మని బిడ్డల్ని అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాను అని వేదవతి అంటుంది.. అర్థం చేసుకోవడం మాత్రమే కాదు అన్ని విషయాలతో పాటుగా కొన్ని విషయాలు కూడా తెలియడంతో.. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను అని వేదవతి అంటుంది. ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవడం ఏంటి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకున్నారు అని నర్మదా అడుగుతున్న సరే వేదవది మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటుంది. ఏంటే నా మీదే ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నావు. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగి అని పొగరు చూపిస్తున్నావా అని నర్మదాతో వేదవతి అంటుంది. మీరేమైనా నాకు అన్ని విషయాలు చెప్పారా మీకు ప్రతిదీ చెప్పడానికి అని వేదవతి వాళ్ళని అంటుంది.. ఇక ఇద్దరు కోడలికి ప్రేమగా వేదవతి అన్నం తినిపిస్తుంది..
Also Read :ఏసి కోసం రచ్చ చేసిన శ్రీయ.. రాజేంద్రకు నిజం చెప్పిన పార్వతి.. అవనిని చంపేందుకు పల్లవి మరో ప్లాన్..
ఇక వేదవతి అర్ధరాత్రిలో ఉలిక్కిపడి ఒక్కసారిగా లేస్తుంది. రామరాజు ఏమైంది అని అడిగితే చందు శ్రీవల్లి గురించి ఆలోచిస్తున్నానని అంటుంది. చందు శ్రీవల్లి చాలా మంచి వాళ్ళు నేను జీవితంలో చేసిన ఒకే ఒక్క మంచి పని ఏదైనా ఉంది అంటే అది నా పెద్ద కోడల్ని ఏరి కోరి తెచ్చుకోవడమే అని రామరాజు అంటాడు. ఇంకా నేనేం చెప్పాలి నా బొందా అని వేదవతి అనుకుంటుంది.. ఆ తర్వాత ధీరజ్ అలాగే తిరుపతి ఇద్దరు సరదాగా మాట్లాడుకుని పడుకుంటారు. ధీరజుని ఎలాగైనా సరే లోపలికి తీసుకురావాలి అని ప్రేమ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.. వీరిద్దరి మధ్యలో ఒక డ్యూయేట్సాంగ్ కూడా వస్తుంది.. ఇక చేసేదేమీ లేక ప్రేమ కూడా ధీరజ్ పక్కన పడుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ప్రేమ ధీరజ్ ఇద్దరు కలిసిపోతారేమో చూడాలి..