E-Paper
Advertisement

Brahmamudi Serial Today march 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇంట్లోంచి పారిపోయిన నందు 

Brahmamudi Serial Today march 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇంట్లోంచి పారిపోయిన నందు 
Advertisement

Brahmamudi serial today Episode: 

అపర్ణ అన్నం తినకుండా పస్తులు ఉండటంతో ఇందు అన్నం తినమని చెప్తుంది. అపర్ణ తాను తిన్నానని మీరు తినండి అని చెప్పడంతో ఇందు అబద్దం చెప్పకు నాన్నమ్మ మీరు తినండి అంటుంది. దీంతో ఇందు అబద్దం చెప్పకు నాన్నమ్మ నీ కళ్లు చూస్తుంటేనే అర్థం అవుతుంది నువ్వేమీ తినలేదని అంటుంది. దీంతో అపర్ణ లేదమ్మా నేను తినేశాను మీరు తినండి అనగానే.. ఇందు అన్న నోటి దగ్గర పెట్టి తిను నాన్నమ్మ ఫ్లీజ్‌ అంటూ అన్నం తినిపిస్తుంది. దీంతో అపర్ణ ఎమోషనల్‌ అవుతుంది. ఎదుటి వాళ్ల కళ్లు చూసి ఆకలి బాధ తెలుసుకుకేంత గొప్పదానివి అయిపోయావు..అచ్చం మీ అమ్మలాగా..? అంటుంది.

తర్వాత రేఖ బిడ్డ బొమ్మలు తీసుకుని వస్తే.. కళ్యాణ్‌ బిడ్డ బొమ్మలు బాగున్నాయి అంటుంది. దీంతో అయితే తీసుకో అని ఇస్తుంది. అప్పుడే అక్కడకు వచ్చిన స్వప్న బిడ్డ బొమ్మలు లాక్కుంటుంది. ఇవి నా బొమ్మలు అని చెప్తుంది. అయితే కళ్యాణ్‌ బిడ్డ మాత్రం కోపంగా ఇవి నాకు స్వాతి ఇచ్చింది. ఈ రోజు నుంచి ఇవి నా బొమ్మలు అని చెప్పగానే.. స్వప్న బిడ్డ కోపంగా అదెవరే ఇవ్వడానికి ఈ బొమ్మలు మా ఆంటీ నాకోసం తీసుకొచ్చింది. అనగానే.. కళ్యాణ్‌ బిడ్డ కోపంగా వచ్చిందమ్మా యువరాణి నువ్వు చెప్తే నీ బొమ్మలు అయిపోతాయా..? నా బొమ్ములు అనగానే.. అవునే ఈ కోటకు యువరాణినని మా ఆంటీ చెప్పింది. ఇవ్వు బొమ్మలు అనగానే.. కావ్య బిడ్డ ఇందు మాత్రం అలా అంటావేంటి అక్కా మనం అందరం ఒక్కటే కదా అనగానే..

Advertisement

స్వప్న బిడ్డ ఐశ్వర్య నవ్వుతూ నేను మీరు ఒకటా..? ఎవరు చెప్పారు మీకు మీరు ఈ ఇంట్లో పని వాళ్లంట.. ఒకసారి మీ బట్టలు, ముఖాలు చూసుకోండి.. ఎలా ఉన్నాయో.. అనగానే.. కళ్యాణ్ బిడ్డ నందు కోపంగా అక్కా ఎక్కువ చేయకు నాకు కోపం వస్తుంది అనగానే.. స్వప్న బిడ్డ ఐశ్వర్య  కోపంగా అబ్బా అమ్మగారికి కోపం వచ్చింది. ఇప్పుడు మనం భయపడాలా మదన్‌.. అసలు మీ ముఖాలకు ఇంత కాస్లీ బొమ్మలు కావాలా..? అనగానే.. ఇందు చూస్తూ.. నందు మనకెందుకు ఆ బొమ్మలు ఇచ్చేయ్‌ అని చెప్తుంది. నందు ఇవ్వనని చెప్తుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంటే.. రేఖ వాళ్ల వదిన భ్రమరాంభ వచ్చి ఇందు, నందులను తోసేస్తుంది. అప్పుడే అపర్ణ వచ్చి భ్రమరాంభను తిడుతుంటే.. రేఖ వచ్చి అపర్ణను తిడుతుంది. దీంతో అపర్ణ రేఖను తిడుతుంది. గతంలో నీ బ్రతుకేంటో.. ఈ ఇంట్లో ఉండటానికి నా కాళ్లు పట్టుకుని బతిమాలిన రోజులు మర్చిపోయావా..? అనగానే.. నేను అదే చెప్తున్నాను.. ఇప్పుడు రోజులు మారిపోయాయి.. మీ లిమిట్స్‌లో మీరు ఉండండి అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది.

మరోవైపు లక్ష్మీ తన భర్త మార్కెట్‌ కు వెళ్లి వస్తుంటే.. రాజు, తన తమ్ముడితో ఆడుకుంటూ ఉంటారు.. ఇంతలో కారు వస్తుంది. రాజు వెళ్లి తన తమ్ముణ్ని సేవ్‌ చేస్తాడు. అంతా చూసిన లక్ష్మీ ఎమోషనల్ అవుతుంది. మరోవైపు నందు బొమ్మల కోసం బాధపడుతుంటే.. ఇందు ఓదారుస్తుంది. అప్పుడే భ్రమరాంబ బిడ్డ స్వాతి తన బొమ్మను తీసుకుని వచ్చి నందుకు ఇస్తుంది. ఆ బొమ్మ తీసుకుంటే మీ అమ్మ మళ్లీ తిడుతుంది ఏం వద్దులే స్వాతి అని ఇందు చెప్పగానే.. మా అమ్మకు ఈ బొమ్మ గురించి ఏమీ తెలియదు అక్కా ఇది నాకు బర్తుడే గిఫ్టుగా నా ఫ్రెండ్స్‌ ఇచ్చారు. తీసుకో అక్కా.. ఏంటక్కా ఆలోచిస్తున్నావు.. మీ ఇద్దరికీ నేను చెల్లిని కాదా..? అని అడగ్గానే.. ఇందు హ్యాపీగా ఎవరేమన్నా సరే నువ్వు మా చెల్లివే.. అంటూ బొమ్మ తీసుకుని ముగ్గురూ హ్యాపీగా ఆడుకుంటారు.

Advertisement

తర్వాత నందు వెళ్లి డైనింగ్‌ టేబుల్‌ మీద ఉన్న ఫుడ్‌ తినబోతుంటే.. రేఖ చూసి నందుకు కిచెన్‌లోకి తీసుకెళ్లి చేయి కాలుస్తుంది. అప్పుడే అపర్ణ వచ్చి రేఖను తిడుతుంది. తర్వాత పొద్దున్నే లేచి అపర్ణ చూసేసరికి నందు కనిపించదు.. అప్పటికే నందు బయటకు వెళ్లి ఒకావిడ బ్యాగులో బన్‌ ఉంటే తీసుకుంటుంది. ఆమె నందును తిట్టి కొట్టబోతుంటే.. హెడ్‌కానిస్టేబుల్‌ దత్త వచ్చి సేవ్‌ చేసి తనతో తీసుకెళ్తాడు. ఇంట్లో నందు కోసం ఇందు బాధపడుతుంది. స్వాతి వచ్చి ఓదారుస్తుంది. మరోవైపు తనతో పాటు వచ్చిన నందును డీటెయిల్స్‌ అడిగినా చెప్పదు తనకు పోలీస్‌ అవ్వాలని ఉందని చెప్తుంది.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×