E-Paper
Advertisement

Horror thriller OTT: ఎముకలతో కట్టే బోన్ టెంపుల్ … పిశాచాలుగా మారే మనుషులు… ఒక్కో సీన్ అరాచకం

Horror thriller OTT:  ఎముకలతో కట్టే బోన్ టెంపుల్ … పిశాచాలుగా మారే మనుషులు… ఒక్కో సీన్ అరాచకం

Horror thriller OTT : ఒక భయంకరమైన హారర్ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. $63 మిలియన్ల బడ్జెట్‌తో కేవలం $57 మిలియన్ల వసూళ్లతో నిరాశపరిచింది. అయితే ఈ సినిమా విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా Rotten Tomatoes లో 92% రేటింగ్, ఐయండిబిలో 7.2 రేటింగ్ ను పొందింది. ఇందులో ఒక వైరస్ వల్ల భూమి మీద జీవం అతలాకుతలం అవుతుంది. రక్త పాతం, హింస ఎక్కువే ఉంటుంది ఇందులో. పిల్లలు ఈ సినిమాను చూడకపోవడమే మంచిది. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ పోస్ట్-అపోకలిప్టిక్ హారర్ సినిమా పేరు ’28 ఇయర్స్ లేటర్: ది బోన్ టెంపుల్’ దీనికి నియా డకోస్టా దర్శకత్వం వహించగా, అలెక్స్ గార్లాండ్ కథను అందించారు.ఇది 2025లో వచ్చిన ’28 ఇయర్స్ లేటర్’ కు సీక్వెల్. ఇందులో రాల్ఫ్ ఫీన్నెస్ (డాక్టర్ ఇయాన్ కెల్సన్), జాక్ ఓ’కానెల్ (కల్ట్ లీడర్ జిమ్మీ క్రిస్టల్) ప్రధాన పాత్రలు పోషించారు. మొదటి సినిమా హీరో సిలియన్ మర్ఫీ (జిమ్ పాత్రలో) సినిమా చివరలో అతిథి పాత్రలో కనిపిస్తాడు.ఇది పార్ట్ 3కి హింట్ ఇస్తుంది. ఈ సినిమాను కొలంబియా పిక్చర్స్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2026 జనవరి 13న విడుదల చేసింది. ప్రస్తుతం Prime videoలో రెంటల్ పద్దతిలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

భూమి మీద ‘రేజ్ వైరస్’ అనే మహమ్మారి తాండవం చేస్తుంటుంది. ఇది సోకగానే మనుషులకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. వాళ్ళకి ఏమీ అర్థం కాదు, ఎదురుగా ఎవరున్నా సరే మృగాల్లా పడి కొరికేస్తుంటారు. 28 ఏళ్లు గడిచినా ఈ వైరస్ ఇంకా అలానే ఉంటుంది. డాక్టర్ కెల్సన్ చనిపోయిన వేలమంది మనుషుల ఎముకలతో ఒక పెద్ద కోట లాంటిది కడతాడు. అందుకే దీన్ని ‘బోన్ టెంపుల్’ అని పిలుస్తారు. ఇక్కడ అతను ఒక లాబొరేటరీని నడుపుతుంటాడు. వైరస్ సోకిన వాళ్ళ మెదడు ఎలా పనిచేస్తుంది? వాళ్ళని మళ్ళీ మనుషులుగా మార్చవచ్చా? అని రీసెర్చ్ చేయడానికి ఈ ప్లేస్‌ను వాడుకుంటాడు. ఇది చూడటానికి చాలా భయంకరంగా, ఎముకల కుప్పలా ఉంటుంది. అతను సామ్సన్ అనే ఒక ఇన్ఫెక్టెడ్ వ్యక్తిని బంధించి, అతనికి మళ్ళీ పాత జ్ఞాపకాలు వచ్చేలా చేస్తాడు. అంటే, వైరస్ సోకిన వాళ్ళు కూడా మళ్ళీ మనుషుల్లా మారే ఛాన్స్ ఉందని ఈ డాక్టర్ కనిపెడతాడు.

మరో పక్క బయట పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. జిమ్మీ అనే ఒక పిచ్చి నాయకుడు ఒక గ్యాంగ్‌ని పెట్టుకుని, దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తూ ఉంటాడు. వైరస్ సోకిన వాళ్ళ కంటే, ఈ బతికున్న మనుషులే చాలా ప్రమాదకరంగా తయారవుతారు. సినిమా చివరలో మొదటి పార్ట్ సినిమా హీరో తన కూతురితో కలిసి, ఒక ఊరి చివర దాక్కుని బతుకుతున్నట్లు చూపిస్తారు. ఇక్కడితో కథ పార్ట్-3 మీద క్యూరియాసిటీ పెంచుతుంది.

Read Also : భూమి మీద ప్రాణాలు తీసే ఏలియన్లు… సైలెంట్ గా వైలెన్స్ చూపించే హారర్ స్టోరీ

Related News

ఒకరోజు ముందుగానే ఓటీటీలోకి హిందీ డార్క్ కామెడీ థ్రిల్లర్

‘డెకాయిట్’ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Friday OTT Releases : ఓటీటీ లవర్స్ కు పండగే.. శుక్రవారం ఏకంగా 15 సినిమాలు స్ట్రీమింగ్..!

జూన్ లో ఓటీటీలోకి రాబోతున్న క్రేజీ కొరియన్ డ్రామాలు… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

Big Stories

×