RCB VS MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ముంబై ఇండియన్స్ శకం పూర్తయింది. నిన్న బెంగళూరు చేతిలో చిత్తుగా ఓడిన ముంబై ఇండియన్స్, టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య నిన్న రాయిపూర్ వేదికగా బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చివరి బంతికి విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో ముంబై పైన రెండు వికెట్ల తేడాతో విక్టరీ అందుకున్న బెంగుళూరు.. పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది.
Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువరాజ్ రొమాన్స్..ఇంతకు ఎవరీ నవ్య నాయర్ ?
ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మధ్య నిన్న మ్యాచ్ జరగగా.. ఇందులో తిలక్ వర్మను అందరు విలన్ చేస్తున్నారు. అతడు క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ ముంబై గెలిచేదని అంటున్నారు. ఈ మ్యాచ్ లో బెంగళూరు చేజింగ్ చేస్తున్న క్రమంలో… కృనాల్ పాండ్యాను ఔట్ చేసే ఛాన్స్ వస్తే.. ముంబై ఇండియన్స్ చేజేతులా మిస్ చేసుకుంది. 17 బంతుల్లో 30 పరుగులు కొట్టాల్సిన సమయంలో కృనాల్ పాండ్యా భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీ గేట్ దగ్గర ఉన్న నమన్ ధీర్ బంతిని అందుకుని.. తిలక్ వర్మ కు విసిరాడు. అయితే అలర్ట్ గా లేని తిలక్ వర్మ, ఆ క్యాచ్ వదిలేశాడు. దీంతో క్యాచ్ నేలపాలైంది. అటు లైఫ్ దక్కించుకున్న కృనాల్ పాండ్యా వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. అయితే ఆ రెండు సిక్సర్లు కొట్టకు ముందు కృనాల్ పాండ్యాను ఔట్ చేసి ఉంటే ముంబై ఇండియన్స్ ఈజీగా గెలిచేది. దీంతో తిలక్ వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేజింగ్ చేస్తున్న సమయంలో చివరి ఓవర్ రాజ్ బవా వేశాడు. బంతులు అద్భుతంగా వేసినప్పటికీ.. రనౌట్ చేసే అవకాశాన్ని మిస్ చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన సమయంలో… రసిక్ బ్యాటింగ్ లో ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ మరో ఎండ్ లో ఉన్నాడు. రాజ్ బవా చివరి బంతి సంధించాడు. అయితే, ఆ బంతి వికెట్ల నుంచి నేరుగా బౌండరీ గేటు దగ్గర ఉన్న ఫీల్డర్ దగ్గరికి వెళ్లింది. ఆ సమయంలో రెండు పరుగుల కోసం బెంగళూరు బ్యాటర్లు ప్రయత్నించారు. అయితే ఫీల్డర్ నుంచి బంతి వచ్చే క్రమంలో బౌలర్ ఎండ్ వికెట్ల దగ్గరకు రాజ్ బవా రాలేకపోయాడు. పిచ్ మధ్యలోనే సేద తీరాడు. కావాలని చేశాడా? ఆలోచన రాలేదా? తెలియదు కానీ, వికెట్ల దగ్గరికి రాజ్ బవా వచ్చి ఉంటే మ్యాచ్ పరిస్థితి వేరే లాగా ఉండేది. బౌలర్ ఎండ్ దగ్గర రాజ్ బవా లేకపోవడంతో వికెట్ కీపర్ వైపు ఫీల్డర్ బంతి విసిరాడు. కానీ అప్పటికే ఇద్దరు బ్యాటర్లు క్రీజ్ లోకి చేరుకున్నారు. దీంతో రెండు వికెట్ల తేడాతో బెంగళూరు గెలిచింది. చివరి బంతి సందర్భంగా తెలివిగా రాజ్ బవా వ్యవహరించి ఉంటే మ్యాచ్ డ్రా అయ్యేది. సూపర్ ఓవర్ లో విజేత ఎవరు అనేది తేలేది. దీంతో ఈ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగిందని అరోపణలు వస్తున్నాయి.
Karlo verify Bhai, Tilak Varma Umpire, you could have atleast tried to catch it bro. Now all you have done is Umpire Indians @TilakV9 it's because of you Bawa is getting abused. @mipaltan
Atleast be man enough and show some appreciation to the new kid.#RCBvsMI pic.twitter.com/lHX4rox8If— TweeterNotX (@Condomning) May 10, 2026
When I watch this clip over and over again I really think to myself am I watching a clean game which is transparent and not filled with any doubts.
The only ones who are gaining anything are the owners, broadcasters and players.
Fans stand to gain nothing.
We all are just… pic.twitter.com/a2O1PpXt6I— Troll cricket unlimitedd (@TUnlimitedd) May 10, 2026