E-Paper
Advertisement

Gold-Silver: బంగారం-వెండి ప్రియులకు షాక్.. ధరలు మరింత ప్రియం, ఆపై కేంద్రం కీలక నిర్ణయం

Gold-Silver: బంగారం-వెండి ప్రియులకు షాక్.. ధరలు మరింత ప్రియం, ఆపై కేంద్రం కీలక నిర్ణయం
Advertisement

Gold-Silver: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. సామాన్యుడు ఇకపై వాటి జోలికి వెళ్లే పరిస్థితి కనిపించలేదు. తాజాగా విదేశాల నుండి బంగారం, వెండి, ప్లాటినం లోహాల కొనుగోళ్లను అరికట్టడానికి దిగుమతి సుంకాలను 5 నుంచి 10 శాతానికి పెంచింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

బంగారం-వెండి ప్రియులకు షాక్.. ధరలు మరింత ప్రియం

Advertisement

ఆదివారం హైదరాబాద్ జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు తగ్గించుకోవాలని దేశ ప్రజలకు సూచన చేశారు. దాని ప్రభావం మార్కెట్లో బంగారం షాపుల షేర్లు దాదాపు 10 శాతం పైగానే నష్టపోయాయి. గడిచిన రెండు రోజులు ఇదే పరిస్థితి నెలకొంది.

తాజాగా బంగారం, వెండి, ప్లాటినంపై దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేసింది కేంద్రప్రభుత్వం. ఇప్పుడున్న 5 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని అమాంతంగా 10 శాతానికి పెంచింది. ప్రభుత్వం తీసుకున్న మే 13న అంటే అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల బంగారం, వెండి, ప్లాటినమ్ లోహాల ధరలు పెరగనున్నాయి.

Advertisement

కేంద్రం కీలక నిర్ణయం.. దిగుమంతి సుంకాన్ని 5 నుంచి 10 శాతానికి పెంపు

ఇప్పటివరకు ఆయా లోహాలపై దిగుమతులపై 5 శాతం సుంకం విధించేది కేంద్రం. ఇప్పుడు దాన్ని రెట్టింపు చేసింది. అంతే 10 శాతానికి పెంచేసింది. ఆభరణాల తయారీకి వాడే వస్తువులు, ఇతర లోహాలకు సంబంధించి పారిశ్రామిక దిగుమతులకు కేంద్రం తీసుకున్న నిర్ణయం వర్తించనుంది.

ప‌శ్చిమాసియాలో ఉద్రిక్తతల కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో విదేశీ మారక నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ ఈ చర్యను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన బంగారం, వెండి ధరలు అమాంతంగా పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: వెనక్కి తగ్గని బేర్..మరోసారి వణికిన దలాల్ స్ట్రీట్, దాదాపు 16 లక్షల కోట్ల సంపద ఆవిరి

కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. బంగారం, వెండి, ప్లాటినం వంటి ధరలు పెరగనున్నాయి. దీనికితోడు ఆభరణాల తయారీలో ఉపయోగించే హుక్స్, క్లాప్స్, క్లాంప్స్, పిన్లు, స్క్రూ బ్యాక్స్ వంటిపై సుంకాలు పెరిగాయి.  రీసైక్లింగ్ చేసే విలువైన లోహాల రికవరీ ప్రోత్సాహానికి దిగుమతులపై సుంకాన్ని 4.35 శాతానికి తగ్గించింది. వీటి కోసం నిర్దిష్ట నిబంధనలు, అనుమతులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

ప్రపంచంలో చైనా తర్వాత బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాలలో భారత్ సెకండ్ ప్లేస్. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలో బంగారం దిగుమతులు 24 శాతానికి పైగా పెరిగాయి. రికార్డు స్థాయిలో 71.98 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను పరిశీలిస్తే.. 2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం దిగుమతుల్లో దేశంలో బంగారం వాటా 9 శాతం.

Related News

డిమార్ట్‌లో విడిగా అమ్మే సరుకులకు ఎక్స్‌పైరీ డేట్స్ ఉండవా? FSSAI నిబంధనలు ఏం చెబుతున్నాయ్?

అధిక వడ్డీ చూసి బాండ్స్ కొనకండి.. పెట్టుబడిదారులు చేసే 5 తప్పులు ఇవే

వారంలో 3 రోజులు సెలవు.. 4 రోజులే ఆఫీస్.. మరి ప్రొడక్టివిటీ పెరుగుతుందా?

దిగొస్తున్న పసిడి-సిల్వర్ ధరలు, సోమవారం మార్కెట్ మాటేంటి?

PPF vs SIP.. నెలకు రూ.10,000 పెట్టుబడి చేసేందుకు ఏది లాభదాయకం?

డిగ్రీ లేదు.. పెట్టుబడి లేదు.. రూ.కోట్ల వ్యాపారం చేస్తున్న 65 ఏళ్ల మహిళ

స్వతహాగా ఆదివారాలు, రాత్రిళ్లు కూడా పనిచేస్తున్న ఆ కంపెనీ ఉద్యోగులు.. డబ్బు కోసం కాదు

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×