E-Paper
Advertisement

రవాణా శాఖలో లేడీ బాస్‌ల కష్టాలు.. హైవేల పై లేడీ ఆఫీసర్ల ఆవస్థలు

రవాణా శాఖలో లేడీ బాస్‌ల కష్టాలు.. హైవేల పై లేడీ ఆఫీసర్ల ఆవస్థలు
Advertisement

Women MVI: రోడ్లపై నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను పట్టుకోవాలి.. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి.. ప్రభుత్వానికి రావాల్సిన పన్నుల వసూళ్లలో టార్గెట్ రీచ్ అవ్వాలి. ఇదీ రవాణా శాఖలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు (MVI), అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల (AMVI) దైనందిన విధి నిర్వహణ. పురుషులతో సమానంగా, ఒక్కోసారి అంతకంటే ఎక్కువ శ్రమిస్తూ క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్న మహిళా అధికారులకు కష్టాలు తప్పడం లేదు. విధి నిర్వహణకు కనీసం వాహనాలు కూడా సమకూర్చకపోవడంతో.. “మేము విధులు నిర్వహించేదెలా?” అంటూ మహిళా ఎంవీఐ, ఏఎంవీఐలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సుమారు 20 మంది విధులు

రవాణాశాఖలో మహిళా సాధికారత మాటలకే పరిమితమవుతోంది. క్షేత్రస్థాయిలో సవాలుతో కూడిన విధులను నిర్వహించేందుకు ముందుకొచ్చిన మహిళా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పురుష అధికారులతో సమానంగా టార్గెట్లు విధిస్తున్న ప్రభుత్వం.. వారికి కనీస సౌకర్యాలైన ‘రహదారి రక్షణ వాహనాలను’ (పెట్రోలింగ్/రవాణా వాహనాలు) కేటాయించడంలో మాత్రం విఫలమవుతోంది. రాష్ట్రంలో రవాణాశాఖలో మహిళా ఏఎంవీఐలు సుమారు 45 మంది, ఎంవీఐలు సుమారు 20 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో మల్టీజోన్-1 పరిధిలో సుమారు 16 మంది ఏఎంవీఐలు, ఎంవీఐలు సుమారు 5గురు, మల్టీజోన్ -2పరిధిలో సుమారు 29 మంది ఏఎంవీఐలు, 15 మంది ఎంవీఐలు పనిచేస్తున్నారు. విధుల్లో చేరి ఏళ్లు గడుస్తున్నా వాహనాలు రాకపోవడంతో మహిళా అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వానికి విజ్ఞప్తులు.. కానీ నో రెస్పాన్స్!

Advertisement

రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖలో కీలక పోస్టుల్లో మహిళలు బాధ్యతలు చేపట్టారు. అయితే, వారికి కేటాయించాల్సిన అధికారిక వాహనాలు (జీపులు/కార్లు) ఏళ్ల తరబడి మంజూరు కావడం లేదు. విధి నిర్వహణ కోసం సొంత వాహనాలను వాడుకోవాల్సి వస్తోందని, లేదా ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని మరికొందరు మహిళా అధికారులు వాపోతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసినా.. బడ్జెట్ లేదనో, ఫైల్ పరిశీలనలో ఉందనో కాలయాపన చేస్తున్నారే తప్ప కనీస స్పందన కరువైందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also read: థియేటర్లలో పాటు ఓటీటీలను షేక్ చేసిన దమ్మున్న సినిమాలు… వీటి క్లైమాక్స్ తో పూనకాలు పక్కా

టార్గెట్లు ఎలా రీచ్ అవ్వాలి?

Advertisement

ప్రభుత్వం నుంచి వాహనాలు రాకపోయినా.. పన్నుల వసూళ్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ టార్గెట్లు (లక్ష్యాలు) మాత్రం సకాలంలో పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోన్నట్లు సమాచారం. చేతిలో సరైన వాహనం లేక, క్షేత్రస్థాయిలోకి సకాలంలో వెళ్లలేక.. టార్గెట్లు ఎలా రీచ్ కావాలని మహిళా అధికారులు మనోవేధన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్యాలు సాధించకపోతే వివరణలు ఇవ్వాల్సి వస్తోందని, ఇటు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు.. అటు పైఅధికారుల ఒత్తిళ్లతో తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆవేదన వ్యక్తం

మహిళ అధికారులతో పాటు పురుషాధికారుల బాధలు సైతం వర్ణణాతీతం. వారికి సైతం వాహనాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమందిసీనియర్లకు మాత్రమే వాహనాలు ఉన్నాయి. ఏఎంవీఐలకు అసలు లేవని సమాచారం. పైకి ఉన్నత పోస్టు అయినప్పటికీ వాహనాలు లేకపోవడంతో టార్గెట్ రీచ్ కాకపోవడం, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతుండటంతో వారి పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే పరిస్థితి లా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే రవాణా సౌకర్యంప్రభుత్వ వాహనాలు లేకపోవడంతో సొంత ఖర్చులతో ప్రైవేట్ వాహనాలు అద్దెకు తీసుకుంటున్నారు. కొంతమందికి హయర్ వెహికిల్స్ ఇస్తే వాటికి అద్దె డబ్బులు కూడా సకాలంలో రావడం లేదని, జేబుల నుంచే పెట్టుకోవాల్సి వస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో మహిళా ఎంవీఐ, ఏఎంవీఐల భద్రతను, విధులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే వారికి ప్రత్యేక రక్షణ వాహనాలను కేటాయించాలని, అలాగే టార్గెట్ల ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్ లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే.. విధుల్లో కొనసాగడం తమ వల్ల కాదనే తీవ్ర నిరాశలో మహిళా అధికారులు ఉన్నారు.

Also Read: తల్లి కోసం ఒక్కటయ్యే అక్కాచెల్లెళ్ళు… ఓటీటీలోకి వచ్చేసిన మరాఠీ ఫ్యామిలీ డ్రామా… ఐయండిబిలో 8.5 రేటింగ్

మంత్రి చొరవ తీసుకుంటేనే..

వాహనాలు లేవని ఉద్యోగులతో పాటు యూనియన్లు సైతం ప్రభుత్వానికి, సంబంధిత శాఖ మంత్రికి విజ్ఞప్తులు చేస్తున్నారు. అయినప్పటికీ వాహనాల పెండింగ్ లోనే పడింది. తాజాగా ఎలక్ట్రికల్ వాహనాలు ఇస్తామని ఉద్యోగులకు చెప్పినట్లు సమాచారం. ఉద్యోగుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ఇప్పటికైనా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారో లేదో చూడాలి.

ఆ అర్ధరాత్రి వేళల్లో.. ఎలా వెళ్లాలి?

“రవాణా శాఖలో తనిఖీలు రాత్రింబవళ్లు జరుగుతుంటాయి. రహదారులపై అక్రమ రవాణా, ఓవర్‌ లోడింగ్, నిబంధనల ఉల్లంఘనలపై అర్ధరాత్రి, తెల్లవారుజామున తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అర్ధరాత్రి వేళల్లో హైవేలపై తనిఖీలకు వెళ్లాలంటే మహిళా అధికారులకు రక్షణ కరువైంది. సొంత వాహనాల్లో వెళ్లినా.. అక్రమ రవాణా చేసే ముఠాలు, లారీ డ్రైవర్లు అధికారిక వాహనం కాదనే నెపంతో ఆపకుండా వెళ్లిపోతున్నారు. ఎదురుతిరుగుతున్నారు. మాకు ప్రభుత్వ వాహనం, దానికి ప్రత్యేక రంగు, సైరన్ ఉంటేనే ఆ రౌడీ మూకలకు భయం ఉంటుంది. కనీసం వాహనం కూడా ఇవ్వకుండా మమ్మల్ని రోడ్లపైకి వెళ్లమంటే ఎలా?” ఓ మహిళా ఎంవీఐ ఆవేదన వ్యక్తం చేశారు.

Also read: అప్పుల ఊబి నుండి బయటపడటానికి మాజీ పోలీస్ డేంజరస్ ప్లాన్… ఓటీటీలో పర్ఫెక్ట్ మైండ్ బ్లోయింగ్ వెబ్ సిరీస్

Related News

కాంగ్రెస్ నాయకులకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు.. హరీష్ రావు షాకింగ్ కామెంట్స్!

Ramchander Rao: ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులకు బిగ్ షాక్..?

‘ఎల్ నినో’తో ఎండిపోతున్న తెలంగాణ.. కాంగ్రెస్ నిద్రమత్తులో ఉందా? సీఎంకు దాసోజు శ్రవణ్ లేఖ!

రాహుల్ గాంధీ అరెస్ట్‌పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్.. ఏమన్నారంటే?

నా చావు కాలేజీకి చెప్పకండి.. సంతోషిస్తారు!.. కన్నీళ్లు పెట్టిస్తున్న స్టూడెంట్ సూసైడ్ నోట్!

అధికారం పోయినా అహంకారం తగ్గలేదు.. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి వాకిటి శ్రీహరి!

ఉద్యమకారుల కోసం పోరాడి.. బీఆర్ఎస్‌లో బలయ్యాను.. కవిత సంచలన వ్యాఖ్యలు

Education Hub: మాటలు వద్దు.. హకీంపేటలో అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్!

Big Stories

Advertisement
×