E-Paper
Advertisement

గంట దూరంలో ఉన్నాం.. మేమంతా సిద్ధమే, ఇరాన్‌కు ట్రంప్ కొత్త వార్నింగ్

గంట దూరంలో ఉన్నాం.. మేమంతా సిద్ధమే, ఇరాన్‌కు ట్రంప్ కొత్త వార్నింగ్
Advertisement

Trump: అమెరికా-ఇరాన్‌ల మధ్య దౌత్య ప్రతిష్టంభన కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు మరోసారి హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్‌పై దాడులకు అమెరికా కేవలం గంట దూరంలో ఉందని తేల్చి చెప్పారు. ఈ విషయంలో మేమంతా సిద్ధంగా ఉన్నామన్నారు.

ఇరాన్‌కు ట్రంప్ కొత్త వార్నింగ్

Advertisement

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. రెండు లేదా మూడు రోజుల్లో ఒప్పందం కుదరకపోతే భారీ దాడులు చేస్తామని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన, మనం యుద్ధం చేయాల్సిన అవసరం రాదని ఆశిస్తున్నానని అన్నారు. ఒకవేళ ఏమైనా జరిగితే వారికి మరో పెద్ద దెబ్బ తగలవచ్చన్నారు.

తనక ఇంకా కచ్చితంగా తెలియదని, త్వరలో మీకు తెలుస్తుందన్నారు. ఇరాన్‌పై తిరిగి దాడులు చేయడానికి గడువును ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు. శుక్రవారం నుంచి ఆదివారం లోపు ఏదో ఒకటి తేలాల్సి వుంటుంది. లేకుంటే వచ్చే వారం ఆరంభంలో భారీ సైనిక చర్యఉంటుందని సంకేతాలు ఇచ్చారు.

Advertisement

దాడులకు గంట దూరంలో ఉన్నాం.. మేమంతా సిద్ధమే-ట్రంప్

ఇరాన్ ఆర్థికంగా దెబ్బతిని ఉందని, ఒప్పందం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు చెప్పుకొచ్చారు. ఇరాన్ తీవ్రవాద భావజాలం వైపు మళ్లినందున వారు అణ్వాయుధాలను కలిగి ఉండలేరని, దానిని ఉపయోగిస్తారని మరొక రిపబ్లికన్ నేత చెప్పుకొచ్చారు.

తమపై అమెరికా-ఇజ్రాయెల్‌ మళ్లీ దాడులు చేస్తే సరికొత్త విధానాల్లో విరుచుకుపడతామని హెచ్చరించింది ఇరాన్‌. తమను దిగ్బంధించడం, ఓడించడం సాధ్యం కాదని ఒక్కమాటలో తేల్చేసింది. టెహ్రాన్‌లోని జరిగిన బహిరంగ సభలో ఆ దేశ సైన్యాధికారి మహమ్మద్‌ అక్రమీనియా ఈ వ్యాఖ్యలు చేశారు. సాయుధ దళాలు గతంలో కంటే ఇప్పుడు మరింత బలంగా ఉన్నాయని అన్నారు.

ALSO READ: ట్రంప్ ఆసక్తికర ప్రకటన.. అందుకే ఇరాన్‌పై దాడి వాయిదా, మళ్లీ ఏం జరిగింది?

ఒకవేళ యుద్ధం జరిగితే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడే అవకాశం ఉందని అంచనాలు లేకపోలేదు. అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడటంతో మార్కెట్‌లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతాయి. భారత్‌తోపాటు దాని ప్రభావం ఆసియా దేశాలపై పెద్ద సమస్యగా మారనుంది. చమురు అవసరాల్లో ఎక్కువ శాతం ఈ మార్గం ద్వారానే ఆసియా దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. అదే జరిగితే మార్కెట్లో ఆయిల్ తోపాటు అన్ని రకాల ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయమని అంటున్నాయి మార్కెట్ వర్గాలు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×