E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode May 29th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి వార్నింగ్ ఇచ్చిన మిస్సమ్మ  

Nindu Noorella Saavasam Serial Today Episode May 29th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి వార్నింగ్ ఇచ్చిన మిస్సమ్మ  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  స్టోర్‌ రూంలోకి వెళ్లిన అమర్‌, ఆరు ఫోటో చూసి స్పృహ కోల్పోతాడు. అందరూ కంగారుపడుతూ.. అమర్‌ను హాల్లోకి తీసుకొస్తారు. కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన అమర్‌ కు మనోహరి ఆత్రుతగా ఆరు ఫోటో చూపిస్తుంది. ఆరు ఫోటో చూసిన అమర్‌ ఎవరీవిడ ఈవిడ ఫోటో ఎందుకు స్టోర్‌ రూంలో ఉందని అడుగుతాడు. దీంతో మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది. అమర్‌కు గతం గుర్తుకు రాలేదని హ్యాపీగా పీలవుతుంది. అయితే అమర్‌ మాత్రం ఆరు ఫోటో హాల్లో పెట్టి దండ వేస్తాడు. బుజ్జమ్మకు పుట్టిన రోజు విషెష్ చెప్పి తనను డాడీ అని పిలవమని చెప్తాడు. దీంతో మనోహరి షాక్‌ అవుతుంది. అడ్డుగా వెళ్లిన మనోహరిని అమర్‌ తిడతాడు. దీంతో మనోహరి రూంలోకి వెళ్లి యాదమ్మతో బాధపడుతుంది.

ఇంతలో అక్కడకు మిస్సమ్మ, రాథోడ్‌ వెళ్తారు. మిస్సమ్మ కోపంగా ఇది నీ పతనానికి ఫస్ట్‌ స్టెప్‌ మనోహరి నీ డౌన్‌ ఫాల్‌ స్టార్ట్‌ అయింది అంటూ చెప్పగానే.. మనోహరి కోపంగా ఏయ్‌ ఏం వాగుతున్నావు భాగీ.. నా పతనం ఏంటి..? అని అడుగుతుంది. దీంతో రాథోడ్‌ పతనం అంటే తెలియదా..? పోయేకాలం మనోహరి గారు. చెడు కాలం దాపరించినప్పుడు ఇలాంటి మంచి శకునాలు జరుగుతాయి అని చెప్పగానే.. మనోహరి కోపంగా రాథోడ్‌ను తిడుతుంది. మాటలు జాగ్రత్త నువ్వు ఈ మనోహరితో మాట్లాడుతున్నావని గుర్తు పెట్టుకో అంటుంది. దీంతో మిస్సమ్మ కూడా కోపంగా ఎందుకు అంతలా ఎగిరెగిరి పడుతున్నావు.. ఆయన పరిస్థితి అడ్డుగా పెట్టుకుని వాడుకోవాలనుకున్నావు.. కానీ ఆ దేవుడి ఆట వేరు అనగానే.. రాథోడ్‌ కూడా చనిపోయిన అరుంధతి మేడం ఆత్మగా ఆరుబయట కిటికీ దగ్గర ఉండేది. ఇప్పుడు ఏకంగా సార్‌ గుండెల్లోనే ఉంది అని చెప్పగానే.. మిస్సమ్మ కూడా ఆయన ఎదురుగానే ఉంది. మళ్లీ పుట్టిన నా అక్కే బుజ్జమ్మ అని చెప్పగానే..

Advertisement

రాథోడ్‌ కూడా బుజ్జమ్మగా పుట్టిన అరుంధతి మేడం ఇంకా తన ఆట మొదలు పెట్టలేదు.. అదే జరిగితే కొంత మందిని మెడ పట్టి బయటక గెంటేయడం ఖాయం అని రాథోడ్‌  అనగానే.. మనోహరి కోపంగా నన్నెందుకు గెంటేస్తుంది. నేనేం తప్పు చేశాను అని కోపంగా అడగ్గానే.. మిస్సమ్మ కూడా కోపంగా గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటావేంటి మనోహరి. రాథోడ్‌ నిన్ను గెంటేస్తామని అనలేదు కదా..? అనగానే.. రాథోడ్‌ కూడా అంటే తప్పు చేసిన వాళ్లకు వాళ్ల తప్పు తెలుస్తుంది కదా మిస్సమ్మ అంటాడు. అవునునవును ఎవరు చేసిన తప్పున వాళ్లకు కచ్చితంగా తెలుస్తుంది. ఆ తప్పుకు శిక్ష కూడా ఉంటుంది అనగానే.. రాథోడ్ వెటకారంగా స్టోర్‌ రూంలో ఉన్న అరుంధతి మేడం ఫోటోను సార్‌ హాల్లోకి తీసుకొచ్చారు. హాల్లో ఫోటోలో ఉన్న అరుంధతి మేడం బయటకు వస్తే ఉంటుంది దబిడిదిబిడే.. అంటూ రాథోడ్‌, మిస్సమ్మ వెళ్లిపోతారు.

వాళ్లిద్దరూ వెళ్లిపోయాక మనోహరి కోపంగా ఏంటి వీళ్లు చంభా నాకే వార్నింగ్‌ ఇస్తున్నారు.. అసలు ఏం అనుకుంటున్నారు అని అడిగితే చంభా భయంగా ఈరోజు నీ టైం అసలు బాగాలేదు మనోహరి. పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశావో ఏంటో అంటుంది. దీంతో మనోహరి కోపంగా చంభాను చూస్తూ ఉంటుంది. చంభా భయంగా ఏంటి నా ముఖం చూస్తున్నావు అని అడిగితే మనోహరి కోపంగా నేను ఎవరి ముఖం చూశానో తెలియదా..? నిద్ర పోతున్న నన్ను నిద్ర లేపి మరీ నీ ముఖం చూపించావు.. అందుకే ఇలా జరుగుతుంది అంటూ మనోహరి తిడుతుంది. దీంతో చంభా, మనోహరిని తిడుతుంది. ఇద్దరూ కలిసి ప్లాన్‌ చేసి మిస్సమ్మకు చెక్‌ పెట్టాలని చూస్తారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×