E-Paper
Advertisement

Brahmamudi Serial Today May 31st: ‘బ్రహ్మముడి’ సీరియల్: యామిని ప్లాన్‌ సక్సెస్‌ – కావ్యకు ప్రపోజ్‌ చేయకుండా వెల్లిపోయిన రాజ్‌

Brahmamudi Serial Today May 31st: ‘బ్రహ్మముడి’ సీరియల్: యామిని ప్లాన్‌ సక్సెస్‌ – కావ్యకు ప్రపోజ్‌ చేయకుండా వెల్లిపోయిన రాజ్‌
Advertisement

Brahmamudi serial today Episode:   రాజ్‌, కావ్యకు ప్రపోజ్‌ చేయబోతుంటే వైదేహి ఫోన్‌ చేస్తుంది. రాజ్‌ కట్‌ చేసినా కూడా మళ్లీ మళ్లీ కాల్‌ చేస్తుంటే.. రాజ్‌ అనుమానం వచ్చి కట్ చేసినా కూడా మళ్లీ చేస్తుందేంటి అని రాజ్‌ లిఫ్ట్ చేసి హలో ఆంటీ నేను ఒక ఇంపార్టెంట్‌ పని మీద ఉన్నాను మళ్లీ చేయనా అంటాడు. వైదేహి మాత్రం కంగారుగా బాబు రామ్‌ యామిని కళ్లు తిరిగి పడిపోయింది బాబు అని చెప్తుంది. బాబు ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వే దాన్ని కాపాడగలవు అంటుంది. దీంతో రాజ్‌ నేను వస్తున్నాను ఆంటీ.. అంటూ కావ్యకు ఐయామ్‌ సారీ అండి నేను వెంటనే వెళ్లాలి అంటూ వెళ్లిపోతాడు. రుద్రాణి హ్యాపీగా ఇది కదా అసలైన ట్విస్ట్‌ అంటే.. ఆ యామిని అనుకున్నది అనుకున్నట్టు సాధించింది.  ఇక రాజ్‌, కావ్య పర్మినెంట్‌గా విడిపోయినట్టే అని మనసులో అనుకుంటుంది.

మరోవైపు రాహుల్ కావ్యరూంలోకి వెళ్లి నగలు కొట్టేస్తుంటాడు. ఆ యామిని ఇచ్చిన షాక్‌కు ఇంట్లో అందరూ కోలుకోవడానికి ఇంకో వారం రోజులు పడుతుంది. ఆ లోపు మనం గిల్టీ నగలు చేసి పెట్టొచ్చు అనుకుంటూ నగలు తీసుకుని వెళ్లిపోతాడు. మరోవైపు యామినికి డాక్టర్‌ ట్రీట్‌మెంట్‌ చేస్తుంటాడు. ఇంతలో రాజ్‌ కంగారుగా పరుగెత్తుకుని వస్తాడు. సరిగ్గా ఫుడ్‌ తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగింది అని డాక్టర్‌ చెప్తాడు. ఇప్పుడు తన కండీషన్‌ ఎలా ఉంది డాక్టర్‌ అని రాజ్‌ అడగ్గానే.. పర్వాలేదు.. మెడిసిన్స్‌ రాశాను రెగ్యులర్‌గా వాడండి.. బాబు మీరు ఒకసారి బయటకు రండి అని రాజ్‌ను బయటకు తీసుకెళ్లి తను కళ్లు తిరిగి పడిపోయింది. ఫుడ్‌ వల్ల కాదు. డిప్రెషన్‌ వల్ల.. పేషెంట్‌ ముందు చెప్పకూడదు కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. ముందు అదేంటో కనుక్కోండి అని చెప్పి డాక్టర్‌ వెళ్లిపోతాడు.

Advertisement

ఇంతలో వైదేహి ఆమె భర్త బయటకు వస్తారు. వాళ్లను రాజ్‌ తిడుతాడు. మీరు యామిని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు అంటాడు. దీంతో వైదేహి అది ఇలా కావడానికి కారణం మేము కాదు మీరే.. అది మీ వల్లే ఇలా అయిపోయింది అని చెప్తుంది. యామిని డోర్‌ చాటు నుంచి వింటుంది. ఇన్నేళ్లకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్న దాని కల నిజం అవుతుందని అది ఎగిరి గంతేసింది. పెళ్లి జరిగేంత వరకు నీ పక్కనే ఉంటూ ప్రతిక్షణం నీతోనే గడపాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ మీరు దాని మనసులో ఏముందో తెలుసుకుంటేనే కదా అర్తం అయ్యేది. అంటుంది వైదేహి. అవును బాబు తన మనసులోని బాధను మాతో చెప్పుకోలేక.. తనలో తానే నలిగిపోయింది. తన మనసులోని బాధను ఎవరి మీద చూపించాలో అర్తం కాక ఆకలి మీద చూపించింది అంటాడు వైదేహి భర్త. పుడ్‌ మీద కోపంతో ఇలా బెడ్‌ మీదకు వచ్చేలా చేసుకుంది అసలు మీకు ఈ పెళ్లి ఇష్టమేనా కాదా అని వైదేహి అడుగుతుంది.

అదేంటి ఆంటీ అలా మాట్లాడుతున్నారు ఇష్టం లేకపోతే ఇంతదూరం ఎందుకు తీసుకొస్తాను అంటాడు రాజ్‌. నిజంగా మీకు ఈ పెళ్లి ఇష్టం అని నేను నమ్మాలంటే నాకు ఒక మాట ఇవ్వండి అని అడుగుతుంది వైదేహి. ఏంటి ఆంటీ అది అని రాజ్‌ అడగ్గానే.. ముందు నాకు ప్రామిస్‌ చేయండి అప్పుడు చెప్తాను అంటుంది. దీంతో రాజ్‌ మాట ఇస్తున్నాను ఆంటీ ఏంటో చెప్పండి అని అడుగుతాడు రాజ్‌. దీంతో నా కూతురుని రెండు రోజులు ఎటైనా తీసుకెళ్లండి.. తనను మళ్లీ సంతోషపెట్టి నార్మల్‌ మనిషిని చేయండి. అది కూడా రేపే అని అడుగుతుంది. దీంతో రాజ్‌ రేపా..అని అడుగుతాడు. దీంతో రేపే తీసుకెళ్లాలి.. నీకు కాబోయే భార్య కన్నా మరేదో ఇంపార్టెంటా..? అంటూ ఎమోషన్‌ అవుతున్నట్టు నాటకం ఆడుతుంది. దీతో రాజ్‌ ఓకే చెప్తాడు.

Advertisement

బయట కావ్య అటూ ఇటూ తిరుగుతూ ఎదురుచూస్తుంటే.. అపర్ణ, ఇంద్రాదేవి వస్తారు. పాపం రాజ్‌ కోసం ఎదురుచూస్తుంది. మనసులో ఎంత బాధపడుతుందో కదా అనుకుంటారు. దగ్గరకు వెళ్లి ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని అడుగుతారు. దీంతో కావ్య కూల్‌గా ఐస్‌క్రీమ్‌ కోసం ఆర్డర్‌ పెట్టాను. ఇంకా రాలేదు. డెలివరీ బాయ్‌కి ఫోన్‌ చేస్తే స్విచ్చాప్‌ వస్తుంది అని చెప్పి వెళ్లిపోతుంది. అపర్ణ, ఇంద్రాదేవి షాక్‌ అవుతారు. ఇంతలో రాజ్‌ ఫోన్‌ చేసి రేపు తాను రావడం లేదని యామిని గురించి ఇంట్లో జరిగింది చెప్తాడు. దీంతో అపర్ణ, ఇంద్రాదేవి షాక్‌ అవుతారు. మరోవైపు వైదేహి, యామిని దగ్గరకు వెళ్లి నువ్వు చెప్పినట్టే మేము రాజ్‌ రిసార్ట్‌ కు రావడానికి ఒప్పించాము.ఇప్పటికైనా నీ ప్లాన్‌ చెప్పు అని అడుగుతుంది. దీంతో యామిని రేపు బావతో నా ఫస్ట్‌నైట్‌ జరగబోతుది అని చెప్తుంది. దీంతో వైదేహి కోపంగా యామిని తిడుతుంది. అయినా యామిని వినకుండా వెళ్లిపోతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Related News

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Big Stories

Advertisement
×