E-Paper
Advertisement

Brahmamudi Serial Today May 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్: శ్వేతను చూసిన రాజ్‌ – అన్నయ్యగా ఫీలవుతానన్న కళ్యాణ్‌  

Brahmamudi Serial Today May 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్: శ్వేతను చూసిన రాజ్‌ – అన్నయ్యగా ఫీలవుతానన్న కళ్యాణ్‌  
Advertisement

Brahmamudi serial today Episode: రిసార్ట్‌ లో ఉన్న కళ్యాణ్‌ దగ్గరకు శ్వేత వస్తుంది. శ్వేతకు అప్పును పరిచయం చేస్తాడు. వెంటనే రాజ్‌ గురించి ఇంత షాకింగ్‌ న్యూస్‌ చెప్పావేంటి అంటూ అడుగుతుంది. నువ్వు ఈరోజే తెలసుకున్నావు కానీ మా ప్యామిలీ మొత్తం నెల రోజుల నుంచి సపర్‌ అవుతూనే ఉంది అని చెప్తుంటాడు. ఇంతలో రాజ్‌ వస్తాడు. రాజ్‌ ను చూసిన అప్పు.. కూచి బావగారు వచ్చినట్టు ఉన్నారు అని కళ్యాణ్‌కు చెప్తుంది. నేను ఇప్పుడే వస్తాను అంటూ కళ్యాణ్‌ రాజ్‌ దగ్గరకు వెళ్తాడు. శ్వేత లోపలికి వెళ్తుంది. కళ్యాణ్‌ హ్యాపీగా దగ్గరకు వెళ్లి అన్నయ్యా అని పిలుస్తాడు. వెంటనే అప్పు కళ్యాణ్‌ చేయి పట్టుకుని వెనక్కి లాగుతుంది.

ఇంతలో కావ్య హయ్‌ కళ్యాణ్‌, హాయ్‌ అప్పు అని పలకరిస్తూ.. రామ్‌ గారు తను అప్పు అని పరిచయం చేస్తుంటే.. రాజ్‌ మాత్రం ఎంత అప్పు అన్నారు కదా ఎంతని అడుగుతున్నాను అంటూ జోక్‌ అంటూ నవ్వుతాడు. దీంతో కావ్య మిమ్మల్ని నేను హీరోలా పరిచయం చేయాలనుకుంటున్నాను మీరు జోకర్‌ లా ప్రవర్తించకండి అంటుంది. రాజ్‌ సరే అంటాడు. తన పేరు అప్పు.. నా చెల్లి అని కళ్యాణ్‌ గురించి చెప్పబోతుంటే.. రాజ్‌ నేను చెప్తాను.. అంటూ మీ బ్రదర్‌ కదా అంటాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే.. పప్పులో కాలేశానా..? అంటుంటే తను మా అప్పు హస్బెండ్‌ అని చెప్తుంది. దీంతో రాజ్‌ అనుమానంగా మీకు ఇంకా పెళ్లి కాలేదు మీ చెల్లికి భర్తేంటి అని అడుగుతాడు.

Advertisement

దీంతో అందరూ షాక్‌ అవుతారు. కళ్యాణ్‌ మాత్రం ఒక కోయిల ముందే కూసింది అని చెప్తాడు. ఇంతలో శ్వేత వస్తుంది. ఎవరని కావ్యను అడుగుతాడు రాజ్‌. అది మా కళ్యాణ్‌ సెకండ్‌ సెటప్‌ అని మెల్లగా చెప్తుంది కావ్య. ఇంతలో అప్పు కోపంగా శ్వేతను తిడుతుంది. అందరూ కలిసి రాజ్‌కు గతం గుర్తుకు రావాలని ట్రై చేస్తారు. శ్వేత గురించి కళ్యాణ్‌ చెప్పగానే నా లైఫ్‌లో కూడా ఇలాంటి సేమ్‌ స్టోరీ జరిగినట్టు అనిపిస్తుంది అంటూ రాజ్‌ చెప్పగానే ఏంటో చెప్పండి అన అడుగుతారు. రాజ్‌ ఆలోచించి గుర్తురావడం లేదు అంటాడు.

తర్వాత అందరూ లోపలికి వెళ్తారు. కళ్యాణ్‌.. అప్పు మనం ఉండేది ఇక్కడే ఈ రూమ్‌లో మనిద్దరం ఉంటాము..అన్నయ్యా వదిన ఈ రూంలో ఉంటారు అని చెప్పగానే.. రాజ్‌ ఆశ్చర్యపోతాడు. కళ్యాణ్‌ ఏంటలా చూస్తున్నారు అని అడుగుతాడు. దీంతో రాజ్‌ అదే కళావతి గారితో షేరింగ్‌ అంటే అంటూ నవ్వుతుంటాడు. ఇంతలో అప్పు.. కళ్యాణ్‌ నువ్వు అసలు విషయం మర్చిపోయినట్టు ఉన్నావు.. నీకు నాకు పెళ్లి అయింది. కానీ వాళ్లిద్దరు ఫ్రెండ్స్‌ కదా.. అని చెప్తుంది. అంటే నేను అంటూ రాజ్‌ ఏదో అడగబోతుంటే.. మీరు కలిసి ఉండకూడదు బావగారు అంటుంది. అయితే నా సింగిల్ రూం ఎక్కడో చెప్పండి వెళ్లిపోతాను అంటే ఏం అవసరం లేదు అన్నయ్య మనం ఇద్దరం ఒక రూంలో వాళ్లిద్దరు ఒక రూంలో ఉంటారు అని చెప్తాడు. సరేనని ఎవరి రూముల్లోకి వాళ్లు వెళ్తారు.

Advertisement

ఇంతలో రిసార్ట్స్‌ దగ్గరకు యామిని వస్తుంది. కావ్య నీ రాజ్‌ ఒకప్పుడు నా రాజ్‌. ఇక ఎప్పటికీ నా రాజ్‌ లాగే ఉంటాడనుకున్నాను. కానీ రాజ్‌ నా కళ్లే కప్పి నీ దగ్గరకు తోక ఊపుకుంటూ వచ్చేలా చేసుకున్నావు. పర్మినెంట్‌గా నీతోనే ఉంటాడనుకోకు. నేనేంటో పూర్తిగా తెలియక నాతోనే చాలెంజ్‌ చేశావు. ఈ యామినితో పెట్టుకుంటే ఫలితం ఎలా ఉంటుందో ఈరోజు నీకు రుచి చూపిస్తాను అనుకుంటుంది. మరోవైపు అప్పు, శృతి కలసి కావ్య దగ్గరకు వెళ్తారు. అక్కా నువ్వు చెప్పినట్టు డిజైన్స్‌ తీసుకొచ్చాము అని అప్పు చెప్తుంది. డిజైన్స్‌ చూస్తున్న కావ్య ఏంటి శ్రుతి ఫేస్‌ అంతా డల్లుగా ఉంది అని అడుగుతుంది.

దీంతో మీరు ఈ డిజైన్స్‌ ఎందుకు తెప్పించారో నాకు తెలుసు మేడం. ఈ డిజైన్స్‌ చూపించి సార్‌కు గతం గుర్తుకు వచ్చేలా చేయాలనే కదా..? అనగానే అది మంచి పనే కదా నువ్వెందుకు బాధపడుతున్నావు అని కావ్య అడుగుతుంది. దీంతో శ్రుతి బాధగా సార్‌  గతం గుర్తు చేసుకుని ఆఫీసుకు తిరిగ వస్తే మా పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే ఏడుపు వస్తుంది సార్‌ అంటుంది. దీంతో అప్పు కోపంగా అంటే మా బావకు గతం గుర్తుకు రాకుండా ఉండాలని కోరుకుంటున్నావా..? అంటూ అప్పు అడుగుతుంది. కావ్య కోపంగా చూస్తుంది. ఏంటి మేడం అలా చూస్తున్నారు అని శృతి అడుగుతుంది. దీంతో నీ ముఖం పగులగొడితే ఎలా ఉంటుందోనని చూస్తున్నాను అంటుంది.

తర్వాత రాజ్‌ రూంలోంచి బయటకు వచ్చి కావ్య వాళ్ల రూంలోకి తొంగి చూస్తుంటే వెనక నుంచి కళ్యాణ్‌ వస్తాడు. ఇక్కడేం చేస్తున్నావు అన్నయ్య అని అడుగుతాడు. కళ్యాణ్‌ను చూసిన రాజ్‌ షాక్‌ అవుతాడు. అయినా నువ్వు స్నానం చేయడానికి వెళ్లావు కదా ఐదు నిమిషాల్లో వచ్చవేంటి..? అని అడుగుతాడు. అక్కడ వాటర్‌ రావడం లేదని కళ్యాణ్‌ చెప్తాడు. మరి ఎలా అంటాడు రాజ్‌.. ఇక్కడ అప్పు వాళ్ల రూంలో చేద్దాములే అంటాడు. దీంతో రాజ్‌ ఎగిరి గంతేస్తాడు. స్నానం చేయడానికి కావ్య రూంలోకి వెళ్లిన రాజ్‌కు మీ రూంకి వాటర్‌ రాకుండా చేసింది నేనే అని చెప్తుంది. దీంతో రాజ్‌ సంతోషంతో ఉప్పొంగిపోతాడు. రొమాంటిక్‌గా మాట్లాడుతూ అటూ ఇటూ చూడగానే అక్కడ కావ్య ఉండదు. రాజ్‌ కంగారుగా ఇదంతా నా కలా.. ఇక్కడ ఎవరూ లేరు ఎవరైనా చూస్తే నా పరువు పోయేది అనుకుంటుండగా.. కావ్య వస్తుంది. మా రూంలోకి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. రాజ్‌ స్నానం చేయడానికి వచ్చాను అని చెప్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Big Stories

Advertisement
×