Honey Rose: హనీ రోజ్ (Honey Rose).. ఇండస్ట్రీలో చాలామంది ఉన్నప్పటికీ అందులో కొంతమంది మాత్రమే అందాలు ఆరబోసి సక్సెస్ అవుతున్నారు. అలాంటి అందాలు ఆరబోయడంలో ఆరితేరిన వారిలో బాలయ్య (Balakrishna) బ్యూటీ హనీ రోజ్ కూడా ఒకరు. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి, ఈమె చేసే గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ్ ఇలా భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో చాలా సినిమాలే చేసింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా హనీ రోజ్ అంటే యూత్ కి ప్రత్యేకమైన అంచనాలు కూడా ఉన్నాయి. ఇక చాలావరకు అలాంటి సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకుంది.
నైట్ పార్టీలో అతనితో క్లోజ్ గా హనీ రోజ్..
వాస్తవానికి తెలుగులో గతంలో పలు చిత్రాలు చేసింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బాలయ్యతో ‘వీరసింహరెడ్డి’ సినిమా చేసిన తర్వాత ఒక్కసారిగా ఈమె క్రేజ్ అమాంతం మారిపోయిందనే చెప్పాలి. ఇందులో మీనాక్షి పాత్రలో నటించి తెలుగు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీని కూడా దున్నేస్తోందని చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో హనీ రోజ్ తాజాగా ఒక నైట్ పార్టీకి వెళ్లినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. నైట్ పార్టీకి హనీ రోజ్ తో పాటు ప్రముఖ బ్యూటీ సన్నీలియోన్ (Sunnyleone )కూడా హాజరయ్యారు. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో చెబుతూ ఆమెతో దిగిన ఫోటోని కూడా అని షేర్ చేయడం జరిగింది. ఇకపోతే ఈ ఇద్దరు తారల మధ్య మిథున్ (Mithun) అనే యాంకర్ కూడా వచ్చాడు. అయితే అంతా బాగానే ఉన్నా.. ఇద్దరి భుజాలపై చేతులు వేసుకొని మరీ రొమాంటిక్గా మిథున్ ఫోటోలు దిగాడు. ఈ ఫోటోలను కూడా హనీ రోజ్ షేర్ చేయడంతో ఇవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన వారంతా నైట్ పార్టీలో ఈ ఫోజులేంటి అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే హనీ రోజ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
హనీరోజ్ కెరియర్..
హనీ రోజ్ కెరియర్ విషయానికి వస్తే.. 2005లో మలయాళం లో విడుదలైన ‘బాయ్ ఫ్రెండ్’ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. మలయాళం తోపాటు కన్నడ, తెలుగు, తమిళ్ సినిమాలలో నటించింది. తొలిసారి తెలుగులో ఆలయం, ఈ వర్షం సాక్షిగా వంటి సినిమాలలో నటించి.. బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి 107వ సినిమాలో హీరోయిన్ గా నటించారు. 2007లో వచ్చిన ‘ముదల్ కానవే’ అనే తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. అటు కన్నడలో కూడా ‘నంజంగుడ్ నంజుండ’ అనే సినిమాతో అడుగుపెట్టింది. ఇలా ప్రతి భాషలో కూడా ఒక్క సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న ఈమెకు.. ఇప్పుడు చేతిలో అవకాశాలు లేవనే చెప్పాలి. అందుకే స్పెషల్ ఈవెంట్లలో పాల్గొంటూ.. మరొకవైపు పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళ్తూ భారీగానే సంపాదిస్తోంది.