Intinti Ramayanam Today Episode May 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆరాధ్య ను రాజేంద్రప్రసాద్ స్కూల్ కి ఎందుకు వెళ్లలేదమ్మా అని అడుగుతాడు.. అటు అవని ప్రిన్సిపల్ దగ్గరకొచ్చి నేను నా కూతురు కోసమే ఈ స్కూల్లో చేస్తున్నానని చెప్పాను కదా మేడం.. ఇప్పుడు నా కూతురు కనిపించట్లేదు. వాళ్ళ నాన్న స్కూల్ కి ఎందుకు పంపించట్లేదు అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు ఒకసారి కాల్ చేసి కనుక్కోండి అని అడుగుతుంది.. ప్రిన్సిపల్ అక్షయ్ కి ఫోన్ చేసి ఆరాధ్య స్కూల్ కి రాలేదు ఏంటి సార్ హెల్త్ బాలేదా..? మరి ఏదైనా కారణం ఉందా అని అడుగుతుంది. అక్షయ్ నేను మా ఆరాధ్యను స్కూల్ మార్పించే ఆలోచనలో ఉన్నానని చెప్తాడు. ప్రిన్సిపల్ ఆ విషయాన్ని అవినీకి చెప్తుంది. ఆ మాట విన్నావని షాక్ అవుతుంది.. నావల్లే ఆరాధన స్కూల్ మార్పిస్తున్నాడా అని అవని బాధపడుతుంది. అక్షయ్ ను రాజేంద్రప్రసాద్ ఆరాధ్య స్కూల్ ఎందుకు మారుస్తున్నావు అని అడుగుతాడు. మీ భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే మీరు మీరు చూసుకోండి అంతేగాని చిన్నపిల్ల భవిష్యత్తుతో ఆడుకోకూడదు అలా అని రాజేంద్రప్రసాద్ అంటాడు దానికి కోపంతో రగిలిపోయిన అక్షయ్ ఇది నా ఫ్యామిలీ మ్యాటర్ నేను చూసుకుంటాను మీకు ఇందులో సంబంధం లేదని అరుస్తాడు దాంతో రాజేంద్రప్రసాద్ బాధపడతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళఎపిసోడ్ విషయానికొస్తే.. ఆరాధ్య భవిష్యత్తును కోరుకునే దానివైతే నువ్వు ఆ స్కూల్ మానేశాయి అప్పుడే ఆ స్కూల్ కి నేను ఆరాధ్యను పంపిస్తానని అక్షయ్ అంటాడు. ఇక తర్వాత రోజు ఉదయం అవని ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అయ్యి వస్తుంది. నీకు నీ కూతురికి లంచ్ బాక్స్ రెడీ చేసానమ్మా తీసుకొని వెళ్ళు అని స్వరాజ్యం అంటుంది. అయితే అవని ఒక లంచ్ బాక్స్ మాత్రమే తీసుకుంటుంది.. అదేంటి అవని ఎప్పుడు నీకు నీ కూతురికి రెండు బాక్సులు పెట్టమని అడుగుతావు కదా ఇప్పుడేంటి ఒక బాక్స్ తీసుకెళ్తున్నావని అడుగుతారు.
అవని నేను స్కూల్ మానేశాను స్కూల్ కి వెళ్లట్లేదు పిన్ని ఆఫీస్ కి వెళ్తున్నాను అని అంటుంది. నేను ఆ ఇంట్లో మనుషుల్ని సంతోషంగా లేకుండా చేస్తున్నానని ఆయన అన్నారు. నేను వాళ్లకి దూరంగా ఉంటే సంతోషంగా ఉంటారు కదా అందుకే నా కూతురికి నేను దూరంగా ఉండాలని అనుకుంటున్నాను అని అవని అంటుంది. అవని బాధను చూసి స్వరాజ్యం అందరూ బాధపడతారు. అవని ఆరాధ్య కోసం స్కూల్ కి వెళ్లి దొంగ చాటుగా ఆరాధ్యను చూసి బాధపడుతుంది. ఆ తర్వాత అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆరాధ్య మాత్రం అమ్మ కోసం స్కూల్ అంత వెతుకుతుంది. టీచర్ ని అడిగి తెలుసుకుని ఇక స్కూల్ కి రాదని బాధపడుతుంది.
స్వరాజ్యం దయాకర్ ఇంటికి వెళ్లడానికి ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే రాజేంద్రప్రసాద్ కనిపించడంతో అతనితో మాట్లాడాలని దగ్గరకు వెళ్తారు. మీ అబ్బాయి చేసిన పని ఏం బాలేదు అన్నయ్యగారు అని స్వరాజ్యం నిజం చెప్తుంది. మీరు చెప్పేంతవరకు నాకు అవని స్కూల్ మారిందని తెలియదు. పెద్దవాళ్ళం మనం కలగ చేసుకోకపోతే పిల్లలు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతారు. వాళ్ళ మధ్యలో మనం కలెక్ట్ చేసుకుని వారిద్దరిని కలిపే ప్రయత్నం చేయాలని అటు దయాకర్ స్వరాజ్యం ఇద్దరూ రాజేంద్రప్రసాద్ అంటారు. ఇక మౌనంగా ఉంటే పనులు జరగవు నేనేం చేయాలో అది చేస్తాను మీరు నిశ్చింతగా ఉండాలని రాజేంద్రప్రసాద్ తో అంటారు.
ఆరాధ్య స్కూల్ నుంచి మధ్యలోనే ఇంటికి వస్తుంది. ఏమైంది అంటే అమ్మలేని ఆ స్కూల్లో నేను ఉండను అని అందరితో అంటుంది. అప్పుడే రాజేంద్రప్రసాద్ అక్కడికి వస్తాడు. మా అమ్మనించి నన్ను దూరం చేస్తారా మా అమ్మ లేని స్కూల్లో నేను చదవను అని ఆరాధ్య అనడంతో రాజేంద్రప్రసాద్ కరెక్ట్ గా చెప్పావమ్మా అని అంటాడు. ఏంటండీ బుద్ధి లేకుండా మీరు కూడా అలానే మాట్లాడుతున్నారు. అది మన కూతురి మన కాకుండా దూరం చేసింది. ఇప్పుడు అక్షయ్ ఆరాధ్యని ఎక్కడ దూరం చేస్తుందని మంచి పని చేశాడు కదా అని అంటుంది. ఇంట్లో అవని లేకపోవడం వలన ఇలాంటి గొడవలను జరుగుతున్నాయి. అవని వదిన ఉంటే ఇలాంటి గొడవలు జరగవు వెంటనే ఎవరిని తీసుకొని వద్దామని కమలంటాడు. ఆ అవని ఉండడం వల్లే అవని తప్పు చేసిందని అమ్మ తనని ఇంట్లోంచి పంపించింది ఇప్పుడు మళ్లీ తీసుకొస్తే మళ్లీ తప్పు చేయదని గ్యారెంటీ ఏంటి అని అక్షయ్ అందరితో అంటాడు..
అవని తన కూతురిని చూడడానికి దొంగగా వెళ్లానని బాధపడుతూ ఉంటుంది. ఇక స్వరాజ్యం వాళ్ళందరూ నువ్వేం బాధపడకమ్మా అవని మీ మామయ్య గారు కనిపిస్తే మీ మామయ్య గారిని సమస్య గురించి చెప్పాను ఆయనే ఏదో ఒకటి చేస్తాడులే అని అంటుంది. నీ బిడ్డ కోసం నువ్వు ఎక్కడికి వెళ్లాలనుకున్నా నీకే న్యాయం జరుగుతుందని అంటారు. నీకు న్యాయం జరగాలంటే నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలని దయాకర్ సలహా ఇస్తాడు కానీ అవని మాత్రం అలాంటి పని నేను ఎప్పుడు చేయను బాబాయ్ అని అంటుంది. నీ కుటుంబం పరువు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ నీ బిడ్డ మీద నీకున్న ప్రేమ గురించి నువ్వు ఆలోచించట్లేదా వాళ్ళు అది ఎందుకు మర్చిపోయారు. నాకు అర్థం కావట్లేదు అని స్వరాజ్యం అంటుంది.
పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం అంటే ఆ ఇంటి పరువు ని బైటకు తీయడమే అని మీరు అర్థం చేసుకోవాలి అని అవని అంటుంది. నేను ఇంటి పరువు తీసేస్తే నా కుటుంబం నాకు శాశ్వతంగా దూరమైపోతుంది కదా అని అవని ఆలోచిస్తుంది.. నా కుటుంబంతో నేను ఎప్పటికైనా కలవాలని నా ఆశ నా ప్రయత్నం. నా వాళ్లు నన్ను ఎప్పటికైనా అర్థం చేసుకుంటారని నమ్మకం నాకుంది. దానికోసం కోర్టు కేసులు అంటూ నేను తిరగడం ఎందుకు అని అవని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఆరాధ్యను ఇంటి దగ్గరికి వెళ్లి అవని కలుస్తుంది. ఆ విషయాన్ని ఆరాధ్య అక్షయకి చెప్తుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..