BigTV English

Brahmamudi Serial Today November 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  రాజ్‌ బిర్యానీ ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌ – కావ్య పార్టీలో చేరి తల్లి రుద్రాణికి షాక్ ఇచ్చిన రాహుల్‌

Brahmamudi Serial Today November 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  రాజ్‌ బిర్యానీ ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌ – కావ్య పార్టీలో చేరి తల్లి రుద్రాణికి షాక్ ఇచ్చిన రాహుల్‌

Brahmamudi serial today Episode:  ఏ హక్కుతో భోజనం తీసుకొచ్చిందో అడుగు నాన్నమ్మ అంటాడు రాజ్‌. దీంతో కావ్య మా మనవరాలురా అందుకే భోజనం తీసుకొచ్చింది అని ఇందిరాదేవి చెప్తుంది.  ఇంట్లో ఆడవాళ్లు  ఉన్నారు కానీ వంట చేసే దిక్కు లేదని అంటుంది. త్వరగా వడ్డించు కావ్య అని ఇందిరాదేవి అడగ్గానే సరేనని కావ్య వడ్డించబోతుంటే.. రాజ్‌ కూడా అందరినీ పిలుస్తాడు. అందరూ రండి మనం తింద్దాం అంటాడు. అందరూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు రాగానే ఇక్కడ ఏముందని పేరంటానికి వచ్చినట్టు కూర్చున్నారు. పైగా వాళ్లను ఎందుకు పిలుస్తున్నావు. ఎంటీ గిన్నెలు ఉన్నాయి ఇక్కడ అని ఇందిరాదేవి అనగానే నా వంట నేను తెచ్చుకున్నాను అంటూ ధాన్యలక్ష్మీ వస్తుంది.


మరి నాకేదే అంటూ ప్రకాష్‌ అడుగుతాడు. దీంతో మీరెంతైనా రాజ్‌ పార్టీ కదా..? అంటుంది ధాన్యలక్ష్మీ. ఏరా రెంటికి చెడ్డ రేవడిలా మారుస్తావా..? ఏంటి ఇక్కడ నిజంగా తినడానికి ఏముందిరా..? అని అడుగుతాడు ప్రకాష్‌. దీంతో రాజ్‌ అందరూ కుళ్లుకునేలాగా స్పెషల్‌ బిర్యానీ ఆర్డర్‌ చేయించి మరీ తెప్పించాను. స్పైసీ బిర్యాని అని చెప్పగానే రుద్రాణి నువ్వు సూపర్‌ రా.. అంటుంది. స్వప్న మాత్రం కొపందీసి కారం తెప్పించావా..? అని అడుగుతుంది. వెటకారమా..? అంటూ రాజ్‌ బిర్యానీ ఓపెన్‌ చేస్తాడు. రాజ్‌ స్వయంగా అందరికీ బిర్యానీ వడ్డిస్తాడు. కావ్య కూడా బామ్మా, తాతయ్యలకు వడ్డిస్తుంటే అందరూ కావ్య వంటల వైపు ఆశగా చూస్తారు.

ఆహా గుమగుమలాడిపోయే పప్పు తాతయ్యగారు తినండి అని వడ్డిస్తుంది. ఓరేయ్‌ పప్పు  అంటరా..? అంటాడు ప్రకాష్‌. బాబాయ్‌ ఇక్కడ బిర్యానీ అంటాడు రాజ్. అమ్మమ్మగారు చోలే కర్రి మీకోసం స్పెషల్‌ గా చేశాను. ఒకసారి టేస్ట్‌ చూడండి అంటుంది కావ్య. ఓరేయ్‌ చోలే కర్రి అంటరా..? మసాలారా.. అని ప్రకాష్‌ అనగానే చోలే అన్నావంటే నువ్వు పోయేదాకా నీకు పాటలు వినిపిస్తాను. ఇందులో మసాలా ఉంది తిను అంటాడు రాజ్‌. అబ్బా ఎంత బాగుందో నీ చేతి వంట తిని ఎన్ని రోజులు అయిందో అంటుంది ఇందిరాదేవి. అమ్మమ్మగారు కడుపు నిండా తినండి వడ్డిస్తాను అంటుంది. బిర్యానీ తిన్నవాళ్లందరూ అదోరకంగా ముఖం పెడతారు. రాజ్ అత్తా ఎలా ఉంది అని అడుగుతాడు. స్వప్న చెత్తలా ఉంది అంటుంది. రుద్రాణి మాత్రం బాగానే ఉంది అంటుంది. తర్వాత రాహుల్‌ కూడా బాగానే ఉందంటూ అలాగే తింటాడు. ఇంతలో ఒక్కోక్కరు కావ్య వైపు జంప్‌ అవుతారు.


రాజ్‌, రుద్రాణి మాత్రం బిర్యానీ తింటూ.. కారం తట్టుకోలేక కిచెన్‌ లోకి వెళ్లి పంచదార కోసం వెతుకుతారు. అందరూ నవ్వుతారు.  తర్వాత కావ్య కిచెన్‌ లోకి వెళ్లి శుభ్రం చేస్తుంది. రాజ్ వచ్చి ఏయ్‌ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. పాత్రలకు పట్టిన దుమ్ము దులుపుతుంటే ఎంతకీ వదలడం లేదు. అది వదిలించే పనిలో ఉన్నాను అంటుంది కావ్య. ఈ ఇంట్లో పనిమనిషి ఉంది అంటాడు రాజ్‌. కానీ ఇంటి మనిషి లేరు ఒక్కోక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు అంటుంది కావ్య. బయటకు వెళ్లే వాళ్లు వెళ్తారు. వచ్చే వాళ్లు వస్తారు.

వంట మనిషిగా ఎత్తిన అవతారం చాలు.. పనిమనిషిలా మారిపోయి మా నాన్నమ్మ తాతయ్యల దగ్గర మార్కులు కొట్టేయాలనుకుంటున్నావా..? పరీక్షే రాయని వాళ్లు మార్కుల కోసం ఎలా ఎదురుచూస్తారు. డిజైన్స్‌ వేయకుండానే వేసినట్టు నాటకం ఆడి సీఈవో సీటు కొట్టేసినట్టు అందరూ మీలాగా నాటకం ఆడరు అంటుంది కావ్య. నీ ఆటలు నా దగ్గర సాగవు అంటాడు రాజ్. సాగుతున్నాయి కదా..? ఇంకా ఏం చేస్తారు అంటుంది కావ్య. మీకోసం నేను ఉండాలనుకోవడం లేదు. అమ్మమ్మ, తాతయ్య భోజనానికి ఇబ్బంది పడకూడదని రాత్రికి కూడా బోజనం చేసి వెళ్తాను అని చెప్పి ఏదైనా ఉంటే వాళ్లతో వెళ్లి మాట్లాడండి అని చెప్పి వెళ్లిపోతుంది.

అపర్ణ, ఇందిరాదేవికి ఫోన్‌ చేస్తుంది. భోజనం చేశారా..? కూరలు అన్ని బాగున్నాయా..? అని అడుగుతుంది అపర్ణ. ఇప్పుడే భోజనం చేశామని.. కావ్య చేసిన వంటల గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? మీ మామగారైతే రెండు మూడు సార్లు అడిగి మరీ పెట్టించుకున్నారు. చాలా రోజుల తర్వాత తృప్తిగా తిన్నాము అని ఇందిరాదేవి చెప్తుంది. అయితే తృప్తిగా తిన్నారన్నమాట.. హాయిగా ఉన్నారన్నమాట అంటూ తినండి తృప్తిగా తినండి.. హాయిగా ఉండండి.. అసలు కావ్య మీద ఇసుమంత జాలి. కొసరంత కరుణ  ఏమైనా ఉన్నాయా..? మీకు అని అపర్ణ అడుగుతుంది. ఇంట్లో ఇలాంటి పరిస్థితులు పెట్టుకుని మీకు ఎలా భోజనం చేయాలనిపిస్తుందండి అని అపర్ణ అడుగుతుంది. దీంతో మమ్మల్ని ఆకలి చంపుకోండని మాత్రం చెప్పకు అంటూ ఇందిరాదేవి ఫోన్‌ కట్‌ చేస్తుంది.

అందరూ హాల్లో కూర్చుని ఉండగా కావ్య కాఫీ తీసొకొచ్చి సీతారామయ్య, ఇందిరాదేవి, సుభాష్‌, ప్రకాష్‌ లకు మాత్రమే ఇచ్చి ఇక నేను వెళ్తున్నాను రాత్రికి భోజనం చేశాను టైంకి తినండి.. టాబ్లెట్స్‌ వేసుకోండని చెప్పి వెళ్లిపోతుంటే.. రాజ్‌ వచ్చి కావ్యను ఆగమంటాడు. కావ్య ఎందుకు ఆగమన్నారు అని అడుగుతుంది. డ్రాప్‌ చేస్తాడేమో అని స్వప్న అంటుంది. కాదని డబ్బులు తీసి నువ్వు తెచ్చిన ఫుల్‌ మీల్స్‌కు బిల్లు ఇస్తున్నాను తీసుకో అంటాడు రాజ్. దీంతో సుభాష్‌ వెళ్లి అమ్మా కావ్య వాడేదో వాగుతుంటాడు నువ్వు వెళ్లు అమ్మా అని చెప్పగానే..

లేదు మామయ్యా ఇలాగే తల దించుకుని వెళ్లిపోతే ఈయనకు తెలిసి రాదు అంటుంది కావ్య. ఏంటి నాకు తెలిసి వచ్చేది అంటాడు రాజ్‌. మీకు నిలువెల్లా అహంకారం నిండిపోయిందని మీకింకా తెలియడం లేదా..? అంటుంది కావ్య. ఇంతకు ముందు కూడా మీరు మా ఇంటికి వచ్చి ఇలాగే డబ్బు ఆశ చూపించి మా ఇంటికి రా అన్నారు. ఎలా కనిపిస్తున్నాను నేను. మీ తలతిక్క నిర్ణయాల వల్ల మీ కన్నతల్లే మిమ్మల్ని అసహ్యించుకుని మా ఇంటికి వచ్చి ఉంటున్నారు.  అని కావ్య చెప్పగానే..నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్, ప్రేమ గొడవ.. సాగర్, నర్మద సరసాలు.. శ్రీవల్లికి టెన్షన్..

Brahmamudi Serial Today August 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ఆచూకి తెలిసిందన్న కావ్య – ఆనందంలో  నిజం చెప్పబోయిన కళావతి

Nindu Noorella Saavasam Serial Today August 7th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాకు దొరికిపోయిన ఆరు

Anchor Ravi: ఆ స్వామీజీతో కలిసి నాపై చేతబడి చేయించారు.. యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్!

Intinti Ramayanam Today Episode: తల్లికి మాటిచ్చిన అక్షయ్.. అవనిని మోసం చేసిన ప్రణతి..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ముగ్గుతో షాక్.. మనోజ్, రోహిణికి బాలు దిమ్మతిరిగే షాక్.. సంజూకు సర్ ప్రైజ్..

Big Stories

×