Transgender Wedding Fraud| చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లి జరగడం లేదని ఆందోళన చెందుతుంటారు. వారి కోసం ఎంత వెతికినా సరైన సంబంధం కుదరకపోవడంతో తమ పిల్లల్లో ఉన్న లోపాలను దాచి వంద అబద్ధాలు ఆడి అయినా పెళ్లి చేయవచ్చు. అని కవరింగ్ చేసేస్తుంటారు. కానీ అలాంటి వివాహాలతో ఎదుటి వ్యక్తి జీవితం నాశనమవుతుందని ఆలోచించరు. ఇటీవలే జరిగిన ఒక పెళ్లి వివాదాస్పదమైంది. యువకుడి తల్లిదండ్రులు తమ కొడకు కోసం ఎక్కడా సంబంధం కుదరడం లేదని చెప్పి.. వెతుకుతుంటే ఎదురుగా ఒక పెళ్లి సంబంధం వచ్చింది. అది కూడా పెళ్లి కొడుకు కంటే చాలా చిన్న వయసు.. అయినా వారు వెంటనే ఒప్పేసుకున్నారు. తీరా పెళ్లి అయ్యాక 15 రోజుల తరువాత అంతా మోసమని చెప్పి కోడలిని ఇంటికి పంపించేశారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని దేవ్ బంద్ పట్టణంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. దేవ్ బంద్ పట్టణంలో నివసించే మహేళ్(28) అనే యువకుడికి రెండు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. అయితే ఆరు నెలల క్రితం అతని భార్య ప్రసవిస్తూ చనిపోయింది. దీంతో మహేశ్‌కి రెండో వివాహం చేయాలని అతని తల్లిదండ్రులు భావించారు. కానీ రెండో వివాహం కావడంతో ఎక్కడా సరైన సంబంధం కలిసి రాలేదు. ఎక్కడైనా అమ్మాయి బాగున్నా.. మహేశ్ తనకు నచ్చలేదని చెప్పేవాడు. దీంతో అతని తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు వెతికి విసిగిపోయారు.
Also Read: నెలకు లక్ష జీతం ఉన్నా ఈ వరుడు వద్దు.. పెళ్లి మధ్యలో వధువు నిరాకరణ!
ఈ క్రమంలో నెల రోజు క్రితం మహేశ్ కోసం అతని ఇంటికి ఒక పెళ్లి సంబంధాలు కుదిర్చే వ్యక్తి వచ్చాడు. ఒక్కటే అమ్మయి వయసు 17 సంవత్సరాలు. మహేశ్ కు రెండో పెళ్లి అని చెప్పినా అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించారని చెప్పాడు. దీంత మహేశ్ తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. వెంటనే అమ్మాయిని చూసి ఇష్టపడ్డారు. మహేశ్ కూడా అంగీకరించడంతో వెంటనే పెళ్లి నిశ్చయించేశారు. అలా రెండు వారాల క్రితం మహేశ్ కు రెండో వివాహం జరిగింది. ఇక్కడికి వరకు అంతా బాగానే ఉంది.
కానీ పెళ్లి జరిగిన రెండో రోజు నుంచి మహేశ్ తన భార్యతో సంతోషంగా లేడు. ఆమె అతడిని తన దెగ్గరు రానిచ్చేది కాదు. దీంతో నాలుగు రోజుల్లోనే మహేశ్ తన కొత్త భార్యతో గొడవపడ్డాడు. ఆ తరువాత కొన్ని రోజుల క్రితం మహేశ్ కు తన భార్య ఒక పురుషుడని, హిజ్రా అని అనుమానం వచ్చింది. ఈ కారణంగా ఆమెను తిరగి పుట్టింటికి పంపించేశాడు.
దీంతో అమ్మాయి తల్లిదండ్రులు ఇంటికొచ్చి గొడవచేశారు. ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరగడంతో విషయం పోలీస్ స్టేషన్ వరకు చేరింది. పోలీస్ స్టేషన్ లో ఇరు పక్షాల మధ్య రాజీ కుదర్చాలని చూసినా.. మహేశ్ వినలేదు. ఆ తరువాత తన భార్య ఒక హిజ్రా అని.. అమ్మాయి అని చెప్పి మోసం చేసి పెళ్లి చేశారని పోలీసుల ముందు మహేశ్ ఏడ్చేశాడు. ఈ విషయం అందరికీ తెలియడంతో తనపై అందరూ నవ్వుతున్నారని.. అవమానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.
కానీ అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం ఇదంతా అబద్దం అని తెలిపారు. తన కూతరు సాధారణ అమ్మాయి మాత్రమేనని చెప్పాడు. దీంతో పోలీసులు ఇరు పక్షాలను శాంతింప చేసి.. చివరికి అమ్మాయికి వైద్య పరీక్షలు చేసేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం అమ్మాయిని రాజధాని ఢిల్లీ తీసుకెళ్లినట్లు సమాచారం.