E-Paper
Advertisement

Brahmamudi Serial Today November 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్:   కావ్య కోసం రుద్రాణి కొత్త ప్లాన్‌ – దొంగచాటుగా భోజనం చేసిన రాజ్‌  

Brahmamudi Serial Today November 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్:   కావ్య కోసం రుద్రాణి కొత్త ప్లాన్‌ – దొంగచాటుగా భోజనం చేసిన రాజ్‌  
Advertisement

Brahmamudi serial today Episode: నీ తలతిక్క నిర్ణయాల వల్ల మీకన్నతల్లి కూడా నీ మీద అలిగి మాఇంటికి వచ్చింది. అయినా సరే నువ్వు మా ఇంటికి ఫుడ్‌ ఎందుకు తీసుకొచ్చావు. ఇంకోసారి తీసుకురాకు అంటాడు రాజ్‌. మీ కోసం నేను తీసుకురాలేదు. మా అమ్మమ్మ తాతయ్య కోసం తీసుకొచ్చాను అంటుంది కావ్య. ఏ పక్క నుంచి వాళ్లు నీకు తాతయ్య, అమ్మమ్మలు అయ్యారు అంటూ రాజ్‌ అడగ్గానే.. మా పక్క నుంచే మా పెద్దకొడుక్కి వాడికి నిలువునా అహంకారం నిండిపోయి వంకరబుద్ది చూపించడం వల్ల ఇంట్లోంచి వెళ్లిపోయినా.. మాకు మనవరాలిగా సేవలు చేస్తూనే ఉంది అని చెప్తుంది ఇందిరాదేవి.

మా బంధుత్వం గురించి ప్రశ్నించే హక్కు మీకు లేదు. ప్రతిదీ మీర డబ్బుతో కొనలేరు అంటుంది కావ్య. కావ్య మా మనవరాలు కాదనడానికి ఎవ్వరికీ హక్కు లేదు. అయినా నీవల్ల ఆపిల్ల సుఖపడిందని నిలబెట్టి ప్రశ్నిస్తున్నావు అంటాడు సీతారామయ్య.. దీంతో రుద్రాణి.. భజన బృందం చిడతలు వాయిస్తుంది. ఈవిడ వల్ల మా అపర్ణ వదిన ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. అది ఎవ్వరికీ కనిపించలేదు. ఓ పూట ఆ కనకం ఏదో వండి పంపిస్తే కావ్య అన్నపూర్ణాదేవి అంశతో పుట్టిన కారణజన్మురాలిగా కనిపిస్తుందా…? అంటుంది. దీంతో రాజ్‌ కరెక్టుగా చెప్పావు అత్త అసలు నాటకాలకు పులిస్టాప్‌ పెట్టడానికి కొత్త వంట మనిషిని మాట్లాడాను. స్టార్‌ హోటల్‌ లో వంట చేసిన అనుభవజ్ఞురాలు అంటాడు రాజ్‌. ఎందుకైనా మంచిది ఈయన కుక్కని తెస్తానంటున్నాడు కరిస్తే జాగ్రత్త అంటుంది కావ్య. వీడి మాటలు నువ్వేమి పట్టించుకోకు కావ్య రేపు కూడా మాకు భోజనం తీసుకురా అని చెప్తుంది ఇందిరాదేవి. సరేనని కావ్య వెళ్లిపోతుంది.

Advertisement

అప్పు, కళ్యాణ్‌ భోజనం చేస్తుంటారు. కళ్యాణ్‌ అదే పనిగా అప్పు చూస్తుంటాడు. ఎందుకు అలా చూస్తున్నావు నువ్వు అలా చూస్తేంటే నేను ఎలా తినగలను అంటుంది అప్పు. ఈరోజు ఎందుకో నిన్ను కన్నార్పకుండా అలాగే చూడాలనిపిస్తుంది పొట్టి అంటాడు కళ్యాణ్‌. ఎందుకు కూచి అని అడుగుతుంది అప్పు. నన్ను నమ్మినందుకు.. నాతో వచ్చినందుకు.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నాతో ఉన్నందుకు అంటాడు కళ్యాణ్‌.

ప్రేమ అంటే అదే కదా అంటుంది అప్పు.. ప్రేమ మాత్రమే ఉంటే చాలదు కదా..? దాన్ని గెలిపించుకోవడానికి ధైర్యం కూడా ఉండాలి. నువ్వు పైకి కనిపించినంత కఠినంగా ఉండవని.. ఒక మనిషిని అర్థం చేసుకుంటే ఇంత బాగా చూసుకుంటావని ఇవాళే అర్తం అయింది. అక్కడ అనామికతో మాట్లాడిన మాటలు విన్నాక నన్ను నాకంటే నువ్వే ఎక్కువ నమ్మావు. అంత నమ్మకం ఎందుకు పొట్టి నా మీద అని కళ్యాణ్‌ అడుగుతాడు. మనల్ని మనం నమ్మితేనే కదా..? అనుకున్నది సాధించగలం. ఇక సక్సెస్‌ అంటావా.. ? ఎవరు ఎక్కువ కష్టపడితే వాళ్లకు వస్తుంది అంటూ అప్పు చెప్పగానే కళ్యాణ్‌ ఆశ్చర్యపోతాడు.

Advertisement

కావ్యను ఎన్ని రకాలుగా తరిమేసినా అన్ని రకాలుగా తిరిగి వస్తుంది. ఒక్కో సారి ఒక్కో కారణం  చెప్పి వస్తుంది. ఇంట్లోంచి తరిమేస్తే సీఈవోగా వచ్చింది. అక్కడి నుంచి తరిమేస్తే.. ఇప్పుడు ఇలా వంట మనిషిలా వచ్చింది. దీన్ని ఇలాగే వదిలేస్తే పర్మినెంట్‌ గా ఇక్కడే సెట్‌ అయిపోతుంది అంటూ రుద్రాణి టెన్షన్‌ పడుతుంది. దీంతో రాహుల్‌ అయినా ఆ రాజ్‌ ఎవరో కుక్‌ ను చూశాడు కదా మమ్మీ ఆవిడ వస్తే కావ్య ఇంట్లోంకి రావాల్సిన అవసరం రాదు కదా అంటాడు రాహుల్‌. ఒరేయ్‌ కావ్య వంట మనిషిగా వస్తుందని నువ్వు గెస్‌ చేశావా..? అలాగే పని మనిషిగా వచ్చి ఇక్కడే సెటిల్‌ అవ్వొచ్చు అని రుద్రాణి చెప్తుంటే..

స్వప్న వచ్చి కరెక్టుగా గెస్‌ చేశారు అత్తయ్యా అంటుంది. మీరు అనుకుంటుంన్నది నిజమే నా చెల్లెలు తప్పకుండా తిరిగి వస్తుంది. ఈ ఇంటి కోడలిగా ఇక్కడే పర్మినెంట్‌గా ఉండిపోతుంది. మీరందరూ అనుకుంటున్నట్టుగా ఆస్థి పంపకాలు జరగకుండా ఆపేస్తుంది అని స్వప్న చెప్పగానే జస్ట్‌ మేము అనుకుంటున్నాము.. కానీ రాజ్‌ మాత్రం రాకుండా అడ్డు పడుతున్నాడు కదా… అంటుంది రుద్రాణి. రాజ్ తెలివైన వాడే కానీ మా కావ్య మొండిది అనుకున్నది సాధించేవరకు వదిలిపెట్టదు అంటుంది స్వప్న. నా విషయలో ఎంతో చేసిన నా చెల్లి తన జీవితంలో ఎంత పోరాడుతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను అని చెప్పి వెళ్లిపోతుంది స్వప్న.

సీతారామయ్య, ఇందిరాదేవి భోజనం చేస్తుంటారు. రాజ్‌ సోపాలో కూర్చుని ఆకలితో బాధపడుతుంటాడు. ఇందిరాదేవి, రాజ్‌ను పిలిచి కావ్య నీకోసం కూడా కొంచెం ఉంచిందిరా.. వచ్చి భోజనం చేయ్‌ అంటుంది. వరుసలు అడ్డుపెట్టుకుని భోజనం చేయను. నేను ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టుకున్నాను అది వచ్చాక తింటాను అంటాడు. తర్వాత ఫుడ్‌ రాగానే ఓపెన్‌ చేసి తిన్న రాజ్‌ ఇది వేడిగా ఉంటేనే తినగలం చల్లగా అయిపోయింది తినబుద్ది కావడం లేదు ఎలా అని ఆలోచించి కిందకు వెళ్లి ఎవ్వరూ లేరని నిర్దారించుకుని వెళ్లి కావ్య చేసిన భోజనం చేస్తుంటాడు. ఇంతలో ఇందిరాదేవి వచ్చి వాటర్ ఇస్తుంది. అది చూసి రాజ్‌ షాక్‌ అవుతాడు. రాజ్ ను కన్వీన్స్‌ చేయాలని చూస్తారు ఇందిరాదేవి, సీతారామయ్య. కానీ రాజ్‌ మారడు.

మరుసటి రోజు కావ్య ఇంటికి రాగానే పైనుంచి వచ్చిన రాజ్‌ దొంగచాటుగా వారి మాటలు వింటుంటాడు. రాజ్‌ను గమనించిన ఇందిరాదేవి ఏరా ఎందుకు దొంగ చాటుగా చూస్తున్నావు అని కిందకు పిలుస్తుంది. రాత్రి చేసిన దొంగతనం గుర్తుకు వచ్చిందా..? లేకపోతే ఇంకో దొంగతనానికి ప్లాన్‌ చేస్తున్నావా..? అంటాడు సీతారామయ్య. దీంతో రాజ్‌ షాక్‌ అవుతాడు. రాజ్‌ నువ్వు చెప్పిన కొత్త కుక్‌ ఇంకా రాలేదేంటని రాహుల్‌ అడుగుతాడు. కొద్ది సేపట్లో వస్తుందని రాజ్ చెప్తాడు. నా పెళ్లానికి కూడా బుద్ది చెప్పడానికి ఇదే మంచి చాన్స్‌ అని మనసులో అనుకుని ఏదిరా ఇంకా రాలేదు అని ప్రకాష్‌ అడుగుతాడు. ధాన్యలక్ష్మీ ఎందుకు అంటూ సీరియస్‌ అవుతుంది. ఇంతలో కొత్త కుక్‌ స్టెల్లా వస్తుంది. అందరూ ఆమెనే చూస్తుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

Tags

Related News

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Big Stories

Advertisement
×