Intinti Ramayanam Today Episode November 30th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి వేసుకునింది అబార్షన్ టాబ్లెట్స్ అని నిన్న డాక్టర్ చెప్తుంది. ఆమెకు ఆమె బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్ చెప్పగానే అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఇక అసలు మన ఇంట్లోకి అబార్షన్ టాబ్లెట్స్ ఎలా వచ్చాయని రాజేంద్రప్రసాద్ ఆలోచిస్తాడు. అవని ఇచ్చింది నేను వేసుకున్నాను అనేసి పల్లవి చెప్పి అవినీకి షాక్ ఇస్తుంది. ఆ మాట వినగానే కమల్ వాళ్ళ బామ్మ రెచ్చిపోతుంది. అవని నీ దారుణంగా తిడుతుంది. ఆస్తి కోసమే ఇదంతా చేస్తున్నావో తన కూతురు ఆరాధ్య కోసం ఆస్తి ఇవ్వాలని ఆలోచించింది అందుకే ఇలా చేసిందని నిందలు వేస్తుంది.. ఇక అత్తగారికి చక్రధర్ సపోర్ట్ చేస్తాడు. అత్తయ్య అన్నదాంట్లో తప్పేంటి అని చక్రధర్ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. నా కూతురికి ఇప్పుడు ఏం కాలేదు కాబట్టి అంత ఓకే ఏమన్నా అయింటే ఎవరు బాధ్యత అనేసి తిడతాడు. అవని ఎంత చెప్తున్నా వినకుండా అవని పై చక్రధర్ అరుస్తాడు.. ఇక చక్రధర్, రాజేశ్వరిలు పల్లవిని తమ ఇంటికి తీసుకెళ్తామని అంటారు. ఇక అవని పల్లవి దగ్గరకు వెళ్తుంది. రాజేశ్వరి పల్లవి చేసిన పనికి పెద్ద క్లాస్ పీకుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి వాళ్ళ అమ్మ ఇచ్చిన క్లాస్తో చక్రధర్ దగ్గరికి వెళుతుంది. ఎందుకు ఏమైంది అనేసి పల్లవిని చక్రధర్ అడుగుతాడు. నీ ఆబార్శన్ ప్లాన్ ఫెయిల్ అవ్వడం తో ఫీల్ అవుతున్నావా అనేసి అడుగుతాడు. ఇకమీదట ఇలాంటి ప్లాన్లు వద్దు డాడీ నా బిడ్డని నేను చంపాలనుకోవట్లేదు అనేసి అంటుంది పల్లవి. ఆ మాట వినగానే చక్రధర్ షాక్ అవుతాడు. మమ్మీ చెప్పినట్టు ఏమైంది. అదేంటి ఆ కుటుంబాన్ని మనం నాశనం చేయాలనుకున్నాం కదా సడన్ గా ఇంత మార్పు ఏంటి అసలు మీ మమ్మీ ఏం చెప్పిందో నీకు అనేది వెటకారంగా మాట్లాడతాడు చక్రధర్. పల్లవి అవని అక్షయ్ కూడా ఇంట్లోంచి పంపించేస్తే ఇక నా బిడ్డ కదా ఆ ఇంటికి రా రాజు నేనే కదా ఇంటికి మహారాణి అని అంటుంది. సరే అమ్మ నీ ఇష్టం అని చక్రధర్ అంటాడు. ఇక ఉదయం ఇంట్లో అందరూ పల్లవి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే వినోద్ అక్కడికి వచ్చి రాజేంద్రప్రసాద్ తో మావయ్య మధ్య ఇంటికి రావాలంటే ఏదోలా ఉంది ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి అనేసి అంటాడు. నువ్వు చెప్పింది కూడా నిజమే అని రాజేంద్రప్రసాద్ అంటాడు.
అప్పుడే పార్వతి ఫోన్ మాట్లాడుతూ అక్కడికి వస్తుంది. కోమలి ఉండి పల్లవి వాళ్ళు వస్తారా అమ్మ మనం వెళ్లి తీసుకురావాలా అనేసి అడుగుతుంది. లేదు వాళ్లే వచ్చేసారు కమల్ పల్లవి ఇంటి దగ్గరలోనే ఉన్నారంట అని అవని నీ హారతి తీయడానికి అన్ని సిద్ధం చేయమని చెప్తుంది. అంతలోకే పల్లవి కమల్ వస్తారు. అవని హారతి తీస్తుంటే కమల్ వాళ్ళ బామ్మ హారతి తీయద్దని వాదిస్తుంది. కడుపు పోవడానికి కారణమైన తనతోనే హారతి తీర్చడం ఏంటి అని పార్వతిపై మండిపడుతుంది. పైకి కనిపించేంత అమాయకురాలు ఏమి కాదు అవని. పల్లవి కడుపులో పెరుగుతున్న బిడ్డ సంతోషంగా ఉండాలంటే అసలు అవని హారతి తీయకుండా ఉండాలి అసలు అవని నీకు సంబంధించిన ఏ విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలని భామ్మంటుంది. దానికి కమల్ ఏంటే ముసలి నోరు ఏసుకొని పోతేగా అరిచేస్తున్నావ్ వదిన హారతి తీస్తేనే ఇంట్లోకి వస్తాం లేదంటే ఇంట్లోకి రాము ఎంతసేపైనా ఇక్కడే ఉంటామని అంటాడు. అయినా నువ్వు హారతి తీయు అనేసి కమల్ అనగానే లేదులే కన్నయ్య కోమలి కానీ అత్తయ్య గాని తీస్తారు అనేసి అంటుంది. కమల్ మాత్రం నువ్వే హారతి తీస్తేనే లోపలికి వస్తామని మొండికేసుకుని కూర్చుంటాడు. అవని హారతి తీసి లోపలికి రమ్మని చెప్తుంది.
పల్లవి ఇంట్లోకి రాగానే బామ్మ పల్లవి దగ్గరికి వెళ్లి డ్రై ఫ్రూట్స్ ఇస్తుంది. ఇకమీదట ఏం కావాలన్నా నన్నే అడుగు ఆ అవనిని అడగకు అనేసి చెప్తుంది. బామ్మ ని ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలని పల్లవి ప్లాన్ మనసులో అనుకుంటుంది. బామ్మ కు లేనిపోనివి నూరిపోసి అవని పై అనుమానం వచ్చేలా చేస్తుంది. ఇక ఇద్దరు కలిసి అవనీని ఇంట్లోంచి పంపించడం ఎలా అని ప్లాన్లు వేస్తారు. అప్పుడే కమల్ వస్తాడు. ఏంటే నా పెళ్ళానికి లేనిపోనివి నూరిపోస్తున్నావంటే అని అడగ్గానే నీకేం కావాలన్నా నన్నే అడుగు అనేసి ఇదిగో డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇచ్చాను అని చెప్తుంది. ఇక కమల్కు బామ్మ చాలెంజ్ విసురుతుంది అంత మగాడివి మొనగాడివైతే నీ పెళ్ళానికి చీర గట్టి చూపించు అనేసి అంటుంది. ఇక ఆరాధ్య తన ఫ్రెండు బయట పెయింట్ వేస్తుంటే అవి గోడల మీద పెయింట్ వేస్తారా అనేసి అరిచి లోపలికి పంపిస్తుంది. ఆ పెయింట్ ను క్లీన్ చేస్తూ ఉంటుంది. అది చూసినా అవని ఇంట్లో ఇంత ప్రశాంతంగా ఉంటే బాగోలేదు అసలు ఏదో ఒకటి జరగాలని పైనుంచి ఫ్లవర్ వాస్ ను కింద పడేస్తుంది. అది అక్షయ మీద కాకుండా పక్కన పడుతుంది. పైనున్న అవని ఇదంతా చేసిందని బామ్మ తిడుతుంది. ఇక అక్షయ్ కూడా అవనిని అందరి ముందు తిట్టి వెళ్ళిపోతాడు. ఈ సీన్ చూసి పల్లవి తెగ సంబరపడిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…