E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode October 16th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణ రాసిన ఒక్క లవ్‌ లెటర్‌ దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తాన్ని ఏం చేసిందో తెలిసా..?  

Brahmamudi Serial Today Episode October 16th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణ రాసిన ఒక్క లవ్‌ లెటర్‌ దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తాన్ని ఏం చేసిందో తెలిసా..?  
Advertisement

Brahmamudi serial today Episode: శృతి దుగ్గిరాల ఇంటికి వెళ్లి ఆఫీసులో ఇందు అపాయింట్‌ చేసిన ఉద్యోగులను ఐశ్వర్య తీసేసిందని చెప్తుంది. ఆ మాటలకు ఇందు, రాజు, అపర్ణ షాక్‌ అవుతారు. మీరు రికమండ్‌ చేసిన ఎవరైనా ఆఫీసులో ఉండొదట.. మీతో పరిచయం ఉన్న ఏ ఎంప్లాయీ తనకు అవసరం లేదట మేడం అని చెప్పగానే.. రాజు కోపంగా నేను ముందే చెప్పాను ఐశ్వర్య ఇలాగే చేస్తుందని ఇందు మనం వెంటనే ఆఫీసుకు వెళ్దాం పద అంటే ఇందు ఇప్పుడు వద్దు అంటుంది.

తను ఆ కంపెనీకి చైర్మన్‌ మనం అక్కడికి వెళ్లి ఈ విషయం మట్లాడితే తనను అవమానించినట్టు అవుతుంది అని చెప్పగానే.. అయితే తను ఏం తప్పు చేసినా వదిలేద్దామా..? అని రాజు అంటే లేదని తనకు అర్థం అయ్యేలా చెబుదామని ఇందు అంటుంది. తను నీ మాట వింటుందన్న నమ్మకం ఉందా..? నలుగురిలో అడిగితేనైనా బుద్ది వస్తుంది అని రాజు అంటే రాజు మనలో ఎన్నైనా ఉండొచ్చు కానీ నలుగురిలో చులకన కాకూడదు ఇంటికి రానివ్వు అప్పుడు మాట్లాడదాం.. శృతి నేను మాట్లాడతాను మీరు వెళ్లండి అని చెప్పగానే.. శృతి వెళ్లిపోతుంది.

Advertisement

ఆఫీసులో ఉన్న ఐశ్వర్య దర్పం చూపిస్తూ.. స్వరాజ్‌ గ్రూఫ్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ మీద నేను మొదటి గెలుపు గెలవాలి. అందరూ కూర్చుని ఎంత లిస్ట్‌ చేయాలో కోట్‌ చేసి తీసుకురండి అంటూ మేనేజర్‌కు చెప్తుంది. స్వరాజ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ మీ కుటుంబం కంపెనీ కదా దాని మీదే ఎందుకు గెలవాలనుకుంటున్నారు అని పీఏ పార్వతీశం అడిగితే.. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటుంది ఐశ్వర్య.

సాయంత్రం ఇంటికి వచ్చిన ఐశ్వర్యను అపర్ణ తిడుతుంది. ఎందుకు స్టాఫ్‌ను తీసేశావని అడుగుతుంది. అందుకు ఐశ్వర్య కోపంతో అందరినీ తిడుతుంది. నందు కోపంగా ఎంటర్‌ అయితే నందును తిడుతుంది ఐశ్వర్య. వాళ్లను తీసేసే ముందు ఒక్కమాట ఇందుకు చెప్పాలనుకోవా..? అని అడిగితే నా ఆఫీసులో తన పెత్తనం ఏంటి అని ఐశ్వర్య అడిగితే.. అది పెత్తనం కాదు నువ్వు కొత్తగా బిజినెస్‌ స్టార్ట్‌ చేశావు నీకు హెల్ప్ గా ఉంటుందని చేసింది అని రాజు చెబితే లక్కీ కూడా అవును ఐషు అని ఏదో చెప్పబోతుంటే.. ఏయ్‌ నువ్వు నోర్మూయ్‌ అంటూ తిడుతుంది. తన కంపెనీలో ఎవ్వరూ కలగజేసుకోవద్దు అంటూ మాట్లాడుతుంది ఐశ్వర్య. ఐశ్వర్యను రేఖ, భూషణ్‌ లు ఇంకా రెచ్చగొడతారు. తాను కామన్‌ మ్యాన్‌ కాదని ఓ కంపెనీ చైర్మన్‌ను అన్న విషయం మర్చిపోవద్దని చెప్పి వెళ్లిపోతుంది.

Advertisement

తర్వాత రేఖ వెళ్లి రాజుతో చాలెంజ్‌ చేస్తుంది నా పెంపకం ఎలా ఉందని అడుగుతుంది. రాజు నవ్వుతూ మిమ్మల్ని కూడా ఐషు లెక్క చేయడం లేదు. తనలో తన నాన్నమ్మ రక్తమే ఉంది. పాతికేళ్లు కన్నబిడ్డలా పెంచిన కుటుంబాన్ని నాశనం చేసింది మీ అమ్మ. ఇప్పుడు ఐషును నువ్వు పెంచావు నిన్ను నాశనం చేయుకుండా జాగ్రత్తపడు పిన్ని అంటూ చెప్పి వెళ్లిపోతాడు రాజు. మరోవైపు ఇందు, రాజులు ఒకరినొకరు చూసుకునేలా చేయాలని అపర్ణ, సుభాష్‌ ప్లాన్‌ చేస్తారు. ఇందు కిచెన్‌లో ఉంటే అపర్ణ వెళ్లి ఇందు పక్కన నిలబడి రాజుకు ఒక లెటర్‌ రాసి విసిరేస్తుంది. అది చూసి రాజు షాక్‌ అవుతాడు. అదే విధంగా రాజు రాసినట్టు ఇందు మీదకు ఒక లెటర్‌ వేయాలని అపర్ణ అనుకుంటుంది. అనుకున్నట్టుగానే ఇందు మీదకు లెటర్‌ వేస్తుంది అపర్ణ. లెటర్‌ చూసిన ఇందు రాజు వైపు చూసి నవ్వుతుంది. రాజు నవ్వుతాడు.

తర్వాత ఇందు తన చేతిలో ఉన్న లెటర్‌ను విసిరేస్తుంది అది మెట్ల మీద పడుతుంది. రాజు విసిరేస్తే అది డోర్‌ దగ్గర పడుతుంది. అప్పుడే కిందకు వస్తున్న నంద ఆ లెటర్‌ చూస్తుంది. అప్పుడే వెంకట్‌ కూడా ఇంట్లోకి వస్తుంటాడు. అప్పుడే ఆ లెటర్‌ చూసి నవ్వుకుంటాడు. అదే లెటర్‌ను లోపలికి వెళ్తూ.. శేషు పక్కన పడేసి రాజు దగ్గరకు వెళ్తాడు. నందు ఇల్లు తుడుస్తున్న పని మనిషి దగ్గరకు లెటర్‌ విసిరేస్తుంది. శేషు లెటర్‌ చూసి వంపులు తిరిగిపోతుంటాడు. పని మనిషి వైపు చూస్తే ఆమె నవ్వుతుంది. తన పక్కన ఉన్న లెటర్‌ తీసి చూసి సార్‌ గారు నన్ను పన్నెండు గంటలకు గార్డెన్‌లోకి రమ్మంటున్నారేంటి..? వెళ్లకపోతే పనిలోంచి తీసేస్తారేమో అనుకుంటూ ఆ లెటర్‌ మెట్ల వైపు పడేస్తుంది. అప్పుడే రేఖ వచ్చి ఆ లెటర్‌ తీసుకుని చదువుతుంది. భూషణ్‌ వచ్చి హాల్లో కూర్చుంటే శేషు తన చేతిలో లెటర్‌ భూషణ్‌ పక్కకు పడేస్తాడు.

లెటర్‌ చదివిని రేఖ భూషణ్‌ వైపు చూసి నవ్వుతుంది. చెప్పాలనుకుంటే రూంలోనే చెప్పొచ్చు కదా గార్డెన్‌లో ఎందుకు అనుకుంటుంది. భూషణ్‌ కూడా తన కాళ్ల పక్కనే ఉన్న లెటర్‌ చూసి చదివి నవ్వుకుంటాడు. రేఖకు ఇలాంటి ఆలోచనలు కూడా వస్తున్నాయా..? అనుకుంటాడు. పనిమనిషిని చూస్తూ నవ్వుతున్న శేషు దగ్గరకు భ్రమరాంబ వెళ్లి ఏయ్‌ అటు తుడుచుకోపో అంటూ శేషును తిడుతూ పనిమనిషికి సైట్‌ వేస్తున్నావా..? అంటుంది. శేషు మీద ఒక కన్నేసి ఉంచాలి అని మనసులో అనుకుంటుంది. దీంతో ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Intinti Ramayanam Today Episode: వదిన కోసం కమల్ కన్నీళ్లు.. భానుమతికి వార్నింగ్.. అవనికి షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి స్ట్రాంగ్ వార్నింగ్.. బాధపడ్డ రామరాజు.. భద్రకు ధీరజ్ వార్నింగ్..

Friday TV Movies : శుక్రవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 16th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి నాటకాన్ని వైజయంతి కనిపెట్టిందా..?  

బిగ్‌బాస్ విన్నర్ ఎవరో చెప్పేసిన మిథిలేష్.. నిజమవుతుందా?

బ్రేకప్ గురించి బయటపెట్టిన మిథిలేష్.. ఆ అమ్మాయికి నో చెప్పేశాడా?

బిగ్‌బాస్‌కి మళ్లీ పిలిచినా వెళ్లను.. మిథిలేష్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×