Brahmamudi serial today Episode: ఆఫీసులో తనకు ఏ పవర్ లేకుండా బొమ్మలా చైర్మన్ కుర్చీలో కూర్చెబెట్టారా..? అంటూ ఇంటికి వచ్చి రాజు, ఇందులను నిలదీస్తుంది ఐశ్వర్. అందుకు ఐశ్వర్యకు అనుభవం లేదు అందుకు ఎక్స్‌ఫీరియెన్స్ ఉన్న స్టాఫ్‌ను ఇచ్చామని వాళ్లను తీసేసి నువ్వు చేసిన ఘనకార్యం తెలిసే ఇలా చేశామని ఇందు చెప్తుంది. అయితే నేను మీకు పిచ్చిదానిలా కనబడుతున్నానా..? అంటూ ఐశ్వర్య తిడుతుంటే.. అపర్ణ అడ్డుగా వచ్చి నేను ముందే చెప్పాను ఆవేశం తప్పా ఆలోచన లేని దీనికి పగ్గాలు ఇవ్వడమే వేస్టని అంటుంది.
అందుకు రేఖ, భ్రమరాంబ ఏదో చెప్పబోతుంటే.. మీరు నోరు మూయండి అంటూ వాళ్లను తిడుతుంది అపర్ణ. ఎంత మంది నోరు మూయిస్తారు అంటూ ఐషు అడిగితే.. న్యాయం ఉందనిపిస్తే వాళ్లు ఎంత మంది నోరు అయినా మూయిస్తారు అంటూ నందు చెప్తుంది. అందుకు ఐశ్వర్య కోపంగా ఏయ్ నాకు ఇవన్నీ కాదు ఇందు నువ్వు చెప్పు మాట మీద నిలబడటం అంటే ఇదనా..? అంటూ ప్రశ్నిస్తుంది. పవర్స్ అన్ని వెనక్కి తీసుకునే ఉద్దేశమే ఉంటే ఇవన్నీ చేసేదాన్ని కాదు కదా.. ఈ పెళ్లి, కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇవన్నీ ఉండేవి కాదు కదా అంటూ అడిగితే.. ఇప్పటికైనా ఐపోయిందేమీ లేదు కదా ఐషు. వాళ్ల నిర్ణయం వాళ్లు తీసుకున్నారు నీ నిర్ణయం నువ్వు తీసుకో అంటూ రేఖ రెచ్చగొట్టగానే.. ఇప్పుడు నా నిర్ణయం ఇందు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఆంటీ అంటుంది ఐషు.
నా రైట్స్ నాకు ఇస్తారా..? నా డిసిజన్ నన్ను తీసుకోమంటారా..? అని కరాకండిగా అడుగుతుంది ఐషు. నేను దేని గురించి ఆలోచించను చెప్పు ఇందు అంటూ అడగ్గానే.. ఇస్తాను నువ్వు అడిగినట్టే నీకు అన్ని అధికారాలు ఇస్తాను అంటూ ఇందు చెప్తుంది. దీంతో భ్రమరాంబ, శేషుతో చూశారా అందరం ఒక్కసారి మీద పడామంటే ఎలా వెనక్కి తగ్గిందో అని చెప్తే పులి ఒక అడుగు వెనక్కి తగ్గిందంటే వంద అడుగులు వేగంగా ముందుకు వేయబోతుందని అనుకోవాలి అంటూ శేషు చెప్తాడు. చీ నీకు చెప్పాను చూడు నాది బుద్ది తక్కువ అంటూ తిడుతుంది భ్రమరాంబ. ఇక ఇందు కాకపోతే నువ్వు రాంగ్ డిసీజన్ తీసుకోవన్న నమ్మకం నాకు కలగాలి అని చెప్పగానే..
మళ్లీ ఇదేం ఫిట్టింగు అంటూ భ్రమరాంబ వెంటనే నేను చెప్పాను కదా అనగానే.. ఐశ్వర్య సరే నేను ఒప్పుకుంటాను.. నీకు నమ్మకం కలగాలి అంటే నేనేం చేయాలి అని అడుగుతుంది. జీఆర్ గ్రూప్ నుంచి కొత్త టెండర్ వచ్చింది అది నువ్వు సాధించాలి అని ఇందు చెప్పగానే.. ప్రతి సంవత్సరం ఆ కంపెనీ నుంచి వచ్చే డీల్ స్వరాజ్ కంపెనీకే వస్తుంది కదా ఇప్పుడు కూడా తెలివిగా నన్ను ఇరికించి పవర్స్ రాకుండా చేయాలని చూస్తున్నారు కదా అంటూ ఐషు చెబితే.. ఎవరు కాంపిటీషన్ లో ఉన్నా నువ్వు సక్సెస్ అయితేనే కదా నీ టాలెంట్ తెలిసేది అంటూ చెప్పగానే.. ఐశ్వర్య డీల్ ఓకే అంటూ వెళ్లిపోతుంది.
మరోవైపు స్వాతిని పికప్ చేసుకోవడానికి వాళ్ల బాస్ వస్తాడు. బాస్ బైక్ సౌండ్ విని బయటకు వచ్చి ఐదు నిమిషాలు ఆగండి అంటూ చెప్తుంది. అది చూసిన మదన్ దగ్గరకు వెళ్లి అతను హారన్ కూడా కొట్టలేదు వచ్చాడని నువ్వెలా గమనించావు అంటే డైలీ వెళ్లే బైక్ సౌండ్ గుర్తుపట్టానని స్వాతి చెప్తుంది. దీంతో మదన్ లో అనుమానం మొదలవుతుంది. సందీప్ దగ్గరకు వెళ్లి ఎవరి అడుగుతాడు. డీటెయిల్స్ తెలుసుకుంటుంటే స్వాతి వచ్చి లేట్ అవుతుంది త్వరగా వెళ్దాం పదండి అంటూ వెళ్లిపోతుంది.
ఇందు, రాజులలో లవ్ పుట్టించేందుకు సుభాష్, అపర్ణ, నందు ప్లాన్ చేస్తారు. అది కాస్త బెడిసి కొట్టి లక్కీ, ఐషుల మీద ప్రయోగించబడుతుంది. దీంతో ఐషు కోపంగా లక్కీ దగ్గరకు వెళ్తుంది. లక్కీ మాత్రం ఐషు నీ మీద పువ్వులు అలా పడుతుంటే వాహ్ మామూలుగా లేదు అంటుంటే.. ఐశ్వర్య కోపంగా లక్కీని కొడుతుంది. ఇలాంటి చెత్త ఐడియాలు వేసి నన్ను ఇంప్రెస్ చేయాలని చూడకు అంటూ వెళ్లిపోతుంది. అందరూ వెళ్లిపోతారు. అపర్ణ మాత్ర ఏంటి లక్కీ ఇలా చేస్తున్నావు.. అంటూ వెళ్లిపోతుంది.
తర్వాత నందు, అపర్ణ, సుభాష్ తమ ప్లాన్ ఫెయిల్ అయిందని మాట్లాడుకుంటుంటే ఇందు వెళ్తుంది. మీ ప్లాన్ ఫెయిల్ అయిందని ఆలోచిస్తున్నారా..? అంటూ తానే రాజులో ప్రేమ పుట్టేలా చేస్తానని వెళ్లిపోతుంది. తర్వాత రాజు, ఇందు వర్క్ చేస్తుంటే లక్కీ చూసి వీళ్లు వర్క్ చేస్తే ఐషు ఓడిపోతుంది వీళ్లు వర్క్ చేయకపోతే ఐషు గెలుస్తుంది ఎలాగైనా వీళ్లు వర్క్ చేయకుండ ఆపేయాలి అనుకుంటూ వెళ్లి కరెంట్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఇప్పుడు హీరోలా ఐషు దగ్గరకు వెళ్తాను అనుకుంటూ వెళ్లిపోతాడు. ఐషు కూడా కోపంగా పవరేంటి ఇప్పుడు పోయింది అనుకుంటుంది. లక్కీ వెళ్లి విషయం మొత్తం చెప్పగానే.. ఐశ్వర్య కోపంగా లక్కీని తిడుతుంది. దీంతో ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్ అయిపోతుంది.